2014-2015 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ From Wikipedia, the free encyclopedia
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2014-2015), అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి బడ్జెట్.[1] 2014-15 వార్షిక సంవత్సరంలో పది నెలల కాలానికి 2014 నవంబరు 5న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[2] తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి బడ్జెటును ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొంటూ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపాడు. సమావేశ ప్రారంభంలోనే విపక్షాలు నిరసన తెలుపగా, ఆ నిరసనల మధ్యే రాజేందర్ 1 గంట 5 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు.[3]
Submitted | 2014 నవంబరు 5 |
---|---|
Submitted by | ఈటెల రాజేందర్ (తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి) |
Submitted to | తెలంగాణ శాసనసభ |
Presented | 2014 నవంబరు 5 |
Parliament | 1వ శాసనసభ |
Party | తెలంగాణ రాష్ట్ర సమితి |
Finance minister | ఈటెల రాజేందర్ |
Total expenditures | రూ. 1,00,637.96 కోట్లు |
Tax cuts | None |
2015 › |
తెలంగాణ బడ్జెట్ విలువ రూ.1,00,637.96 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం: రూ.48,648.47 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయం: రూ.51,989.49 కోట్లుగా అంచనా వేయబడింది.[4] ఈ బడ్జెటులో నీటిపారుదల రంగానికి రూ. 9,407 కోట్లు, వ్యవసాయరంగానికి రూ. 8,511 కోట్లు, రైతుల రుణమాఫీకి రూ. 4,250 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు రూ. 2,000 కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ. 4,000 కోట్లు, ఆరోగ్యరంగానికి రూ. 2,282 కోట్లు, అమరవీరుల కుటుంబాలకు రూ. 100 కోట్లు, పింఛన్లకు రూ. 6,580 కోట్లు, నియోజకవర్గం అభివృద్ధి నిధులు కోటిన్నర, విద్యారంగానికి రూ. 10,956 కోట్లు, సామాజికరంగానికి రూ. 23,000 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 20,000 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ. 80,090.33 కోట్లుగా, రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయాన్ని రూ. 79,789.31 కోట్లుగా చూపించారు.[5][6]
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2014-2015)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:
2013-2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలకు కలిపి రూ. 1.61 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టబడగా, 2014-2015లో తెలంగాణలోని పది జిల్లాలకు (పది నెలల కాలానికి) తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.