![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4e/Tirumala_090615.jpg/640px-Tirumala_090615.jpg&w=640&q=50)
తిరుపతి
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా నగరం / From Wikipedia, the free encyclopedia
తిరుపతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో నగరం. తిరుపతి జిల్లా కేంద్రం, హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ దగ్గరలోని తిరుమలలో తిరుమల వెంకటేశ్వర ఆలయం, ఇతర చారిత్రక దేవాలయాల వున్నందున "ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని" అని అంటారు.[6] విష్ణువు స్వయంభుగా అవతరించిన ఎనిమిది క్షేత్రాలలో ఇది ఒకటి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం, 287,035 జనాభాను కలిగి, ఆంధ్రప్రదేశ్లో 9 వ అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలిచింది.[7] కర్నూలు తరువాత రాయలసీమలో ఇది రెండవ అతిపెద్ద నగరం. 2012–13 సంవత్సరానికి, భారత పర్యాటక మంత్రిత్వ శాఖ తిరుపతిని "ఉత్తమ వారసత్వ నగరంగా" పేర్కొంది.[8] స్మార్ట్ నగరం క్రింద అభివృద్ధి చేయబడే వంద భారత నగరాలలో ఒకటిగా ఎంపిక చెయ్యబడింది .
ఇతర వాడుకల కొరకు, తిరుపతి (అయోమయ నివృత్తి) చూడండి.
త్వరిత వాస్తవాలు తిరుపతి, దేశం ...
తిరుపతి | |||||||
---|---|---|---|---|---|---|---|
నగరం | |||||||
శ్రీ వేంకటేశ్వర దేవస్థానం, తిరుపతి | |||||||
Nickname: ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని | |||||||
Coordinates: 13.65°N 79.42°E / 13.65; 79.42 | |||||||
దేశం | ![]() | ||||||
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ | ||||||
ప్రాంతం | రాయలసీమ | ||||||
జిల్లా | తిరుపతి జిల్లా | ||||||
స్థాపన (పురపాలక సంస్థ) | 1 ఏప్రిల్ 1886 | ||||||
స్థాపన (నగర పాలకసంస్థ) | 2007 మార్చి 2 | ||||||
వార్డులు | 59 | ||||||
Government | |||||||
• Type | మేయర్ కౌన్సిల్ | ||||||
• Body | తిరుపతి నగరపాలక సంస్థ | ||||||
• మేయర్ | శిరీష యాదవ్ (వైఎస్సార్సీపీ) | ||||||
విస్తీర్ణం | |||||||
• నగరం | 27.44 కి.మీ2 (10.59 చ. మై) | ||||||
జనాభా (2011)[2] | |||||||
• నగరం | 2,95,323 | ||||||
• జనసాంద్రత | 11,000/కి.మీ2 (28,000/చ. మై.) | ||||||
• Metro | 3,74,260 | ||||||
అక్షరాస్యత | |||||||
భాషలు | |||||||
• అధికారిక | తెలుగు | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
పిన్కోడ్ | 517501 | ||||||
ప్రాంతపు కోడ్ | +91–877 | ||||||
Geocode | UN/LOCODE IN TIR[4] | ||||||
వాహన నమోదు కోడ్ | AP-39 (from 30 January 2019)[5] |
మూసివేయి