తిరునెల్వేలి
From Wikipedia, the free encyclopedia
తిరునెల్వేలి, ఇది భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తిరునెల్వేలి జిల్లాలోని ఒక ప్రధాన నగరం. దీనిని చారిత్రాత్మకంగా (బ్రిటీష్ పాలనలో) తిన్నెవెల్లి, నెల్లై అని కూడా పిలిచారు, ఇది తిరునెల్వేలి జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. తిరునెల్వేలి నగరపాలక సంస్థ చెన్నై, కోయంబత్తూర్, మధురై, తిరుచిరాపల్లి, సేలం నగరపాలక సంస్థల తరువాత రాష్ట్రంలోఆరవ అతి పెద్ద నగరపాలక సంస్థ. తిరునెల్వేలి రాష్ట్ర రాజధాని చెన్నైకి నైరుతిన 624 కి.మీ. (388 మై.) లోదూరంలో, తూత్తుకుడి నుండి 58 కి.మీ. (36 మై.) దూరంలో,కన్యాకుమారి నుండి డౌన్ టౌన్ తామిరబరాణి నదికి పశ్చిమఒడ్డున 73 కి.మీ. (45 మై.) దూరంలో ఉంది.దాని జంట పట్టణం పాలయంకోట్టై తామిరబరాణి నదికి తూర్పు ఒడ్డున ఉంది.
Tirunelveli
Nellai (shortened) Tinnevely (colonial) | |
---|---|
Metropolis | |
Coordinates: 8°42′49″N 77°45′24″E | |
Country | India |
State | Tamil Nadu |
Region | Pandya Nadu |
District | Tirunelveli District |
Boroughs | Tirunelveli Town Palayamkottai Melapalayam Pettai Thachanallur |
Government | |
• Type | Municipal Corporation |
• Body | Tirunelveli City Municipal Corporation |
• Mayor | Saravanan |
విస్తీర్ణం | |
• Metropolis | 189.9 కి.మీ2 (73.3 చ. మై) |
• Rank | 3 |
Elevation | 73 మీ (240 అ.) |
జనాభా (2011)[1] | |
• Metropolis | 4,97,826 |
• Rank | 8th in Tamil Nadu |
• జనసాంద్రత | 2,600/కి.మీ2 (6,800/చ. మై.) |
• Metro | 9,68,874 |
Demonym(s) | Tirunelvelian, Nellaikaran (Male) and Nellaikari (Female) |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (IST) |
Pin Codes | 627001 To 627012 , 627353, 627357, 627358 |
Telephone code | 91 (0)462, (0)4633 |
Vehicle registration | TN 72 |
Website | https://www.tirunelvelicorporation.in/ |
తిరునెల్వేలి ఇది రెండు సహస్రాబ్దాల పురాతన నగరముగా పేరు పొందింది. దీనిని ప్రారంభ పాండ్యులు, చేరులు, మధ్యయుగ చోళులు, తరువాత చోళులు, తరువాతి పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం ,బ్రిటీష్ వారు వివిధ సమయాలలో పాలించారు. 1797 నుండి 1801 వరకు నగరశివార్లలో వీరపాండియ కట్టబొమ్మన్, బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సేనల నేతృత్వంలోని పాలయ్యక్కరర్లు పాల్గొన్న పాలీగర్ యుద్ధం జరిగింది.
నగరపాలకసంస్థల చట్టం ద్వారా 1994 జూన్ 1న ఏర్పడిన తిరునల్వేలి నగరపాలక సంస్థ ద్వారా తిరునెల్వేలి పరిపాలన సాగుతుంది.నగరం 189.9 కి.మీ2 (73.3 చ. మై.) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభాలెక్కలు ప్రకారం 4,73,637 జనాభాను కలిగి ఉంది. ఇతర పురపాలక సంఘాలను ఈపట్టణ పరిధిలో చేరిన తరువాత మొత్తం 9,68,984 మంది జనాభాను కలిగి ఉంది. తిరునెల్వేలి తమిళనాడు, భారతదేశం లోని మిగిలిన ప్రాంతాలతో రోడ్డు, రైలు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడింది. సమీప దేశీయ విమానాశ్రయం తూత్తుకుడి విమానాశ్రయం. మధురై అంతర్జాతీయ విమానాశ్రయం, తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. సమీప ఓడరేవు తూత్తుకుడి ఓడరేవు.
తిరునెల్వేలిలోని పరిశ్రమలలో పరిపాలనా సేవలు, వ్యవసాయ, వ్యాపారం, పర్యాటకం, బ్యాంకింగ్, వ్యవసాయయంత్రాలు, సమాచార సాంకేతికత, విద్యా సేవలు ఉన్నాయి. అన్నా విశ్వవిద్యాలయం ప్రాంతీయ క్యాంపస్ - తిరునెల్వేలి, తిరునల్వేలి వైద్య కళాశాల, తిరునెల్వేలి పశువైద్య కళాశాల & పరిశోధన సంస్థ, తిరునల్వేలి న్యాయ కళాశాల, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, మనోన్మానియం సుందరనార్ విశ్వవిద్యాలయం ఇంకా మరిన్ని విద్యా సంస్థలతో ఈ నగరం దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ విద్యా కేంద్రంగా ఉంది. అనేక చారిత్రాత్మక స్మారక చిహ్నాలు తిరునెల్వేలి నగరంలో ఉన్నాయి. నెల్లైయప్పర్ ఆలయం అత్యంత ప్రముఖమైంది. ఈ నగరం 'ఇరుతు కడై హల్వా ' అనే తీపి తినుభండారం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.