తాబేలు లేదా కూర్మము (ఆంగ్లం Tortoise) దృఢమైన పైకప్పుగల ప్రాచీన సరీసృపాలు. ఇవి ట్రయాసిక్ యుగం నుంచి ఎలాంటి మార్పులు లేకుండా జీవించి ఉన్న జీవులు. వీటిని అతి ఎక్కువ జీవితకాలాన్ని కలిగియున్న జీవులుగా చెప్పవచ్చు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి.
భూచరజీవుల్లో గోళ్ళను కలిగిన చలనాంగాలు ఉంటాయి. జలచరజీవుల్లో తెడ్డు వంటి చలనాంగాలు ఉంటాయి.
దేహాన్ని ఆవరించి ఉన్న పెట్టె వంటి బాహ్యాస్థిపంజరం పృష్ఠకవచమైన కారపేస్, ఉదర కవచమైన ప్లాస్ట్రాన్ తో ఏర్పడి ఉంటుంది. ఉరఃకశేరుకాలు, పర్శుకలు కారాపేస్ తో కలుస్తాయి.
డక్టస్ బొటాలి అనే చిన్న రక్తనాళం దైహిక, పుప్పుస చాపాలను కలుపుతుంది.
నాసికా రంధ్రం ఒకటి మాత్రమే ఉంటుంది.
సముద్రతాబేళ్ళవంటి కొన్ని జలచర జీవులలో జలశ్వాసక్రియను జరపడానికి రక్తనాళయుత అవస్కరం ఉంటుంది.
దవడలపై దంతాలు ఉండవు. దవడలను ఆవరించి కొమ్ముపొర ఉంటుంది.
అవస్కర రంధ్రం నిలువుగా ఉంటుంది.
ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తాబేలు దినోత్సవం నిర్వహించబడుతుంది. తాబేళ్ళ మనుగడపై మానవ దృష్టి సారించడానికి, వాటిని సంరక్షించేలా ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.[1][2][3]
The following species list largely follows Ernst & Barbour (1989), as indicated by The Reptile Database. However, the newly erected genera Astrochelys, Chelonoidis, and Stigmochelys have been retained within Geochelone.
చెర్సినా (Chersina)
Chersina angulata, Bowsprit Tortoise
సిలిండ్రాస్పిస్ (Cylindraspis) (అన్ని జాతులు అంతరించినవి)