From Wikipedia, the free encyclopedia
డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ అనునది ఒక క్లోరిన్ సమ్మేళనం, రెండు క్లోరిన్ పరమాణువులు,మూడు ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన ఏర్పడు అకర్బన సంయోగపదార్థం.ఈ సంయోగ పదార్థం యొక్క రసాయన సంకేత పదం Cl2O3 డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ ముదురు/చిక్కని బ్రౌన్ రంగులో ఉండు ఘనపదార్థం.దీనిని మొదటి సారి 1967 సంవత్సరంలో కనుగొన్నారు.డై క్లోరిన్ ట్రైఆక్సైడ్ సంయోగ పదార్థం 0 °C కన్న తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా విస్పొటనం (explosive ) చెందు స్వభావాన్ని,లక్షణాన్ని కలిగి ఉన్నది.[2] డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ యొక్క అణుభారం 118.903 గ్రాములు/మోల్.
| |||
పేర్లు | |||
---|---|---|---|
IUPAC నామము
dichlorine trioxide | |||
ఇతర పేర్లు
chlorine trioxide chlorine chlorate chlorine(I,V) oxide | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [17496-59-2] | ||
పబ్ కెమ్ | 167661 | ||
SMILES | ClOCl(=O)=O | ||
| |||
ధర్మములు | |||
Cl2O3 | |||
మోలార్ ద్రవ్యరాశి | 118.903 g/mol | ||
స్వరూపం | dark brown solid | ||
ద్రవీభవన స్థానం | explodes below 0 °C | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
verify (what is ?) | |||
Infobox references | |||
డైక్లోరిన్హెక్సాక్సైడ్(Cl2O6),క్లోరిన్(Cl2) మరియుఆక్సిజన్(O2)లను తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాంతివిశ్లేషణం ప్రకాశ విశ్లేషణ(photolysis)చెయ్యడం వలన డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ సంయోగపదార్థం ఏర్పడును. ఈ రసాయన సంయోగ పదార్థం యొక్క అణుసౌష్టవం OCl-ClO2 వలె ఉండునని విశ్వసించడమైనది[3] .డైక్లోరిన్ ట్రైఆక్సైడ్ యొక్క ఐసొమర్ Cl-O-ClO2 అయ్యిండే అవకాశం కలదు.ఈ ఐసొమర్ ,సిద్దాంతరీత్యా క్లోరస్ ఆమ్లం యొక్క నిర్జలస్థితి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.