![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3d/Tovino_Thomas_At_The_%25E2%2580%2598Maari_2%25E2%2580%2599_Press_Meet.jpg/640px-Tovino_Thomas_At_The_%25E2%2580%2598Maari_2%25E2%2580%2599_Press_Meet.jpg&w=640&q=50)
టోవినో థామస్
From Wikipedia, the free encyclopedia
టోవినో థామస్ (జననం 1989 జనవరి 21) భారతదేశానికి చెందిన మలయాళ సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2012లో విడుదలైన ప్రభువింటే మక్కల్ సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టి ABCD (2013), 7వ రోజు (2014), న్నూ నింటె మొయిదీన్ (2015) సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]
టోవినో థామస్ | |
---|---|
![]() | |
జననం | (1989-01-21) 1989 జనవరి 21 (వయసు 35)[1] ఇరింజలకుడా, కేరళ, భారతదేశం |
విద్యాసంస్థ | తమిళనాడు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2012–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | లిదియా టోవినో (m. 2014) |
పిల్లలు | 2 |
టోవినో థామస్ కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించి, 2021 జనవరి 21న ఆయన తన సొంత నిర్మాణ సంస్థ టోవినో థామస్ ప్రొడక్షన్స్‌ని ప్రారంభించి ''కాలా'' సినిమాను నిర్మించి అందులో ప్రతినాయకుడి పాత్రను పోషించాడు.[3][4]
టోవినో థామస్ 2015లో విడుదలైన ''ఎన్ను నింటే మొయిదీన్'' సినిమాలో నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును, 2017లో మాయానది సినిమాలో నటనకుగాను కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును, ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును, 2022లో మిన్నల్ మురళి & కాలా సినిమాలకుగాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డును గెలుచుకున్నాడు.[5][6] టోవినో థామస్ లుక్స్ & స్టైల్ కోసం 2018లో కొచ్చి టైమ్స్ ప్రచురించిన కేరళకు చెందిన అత్యంత ఆదరణ కలిగిన పురుషులలో మొదటి స్థానంలో నిలిచాడు.[7][8]