From Wikipedia, the free encyclopedia
జైమిని పురాణాలలోని ఋషి, భారతీయ తత్వశాస్త్రంలోని పూర్వమీమాంస విభాగంలో ప్రసిద్ధుడు. ఇతడు వేద వ్యాసుని శిష్యుడు, పరాశర మహర్షి కుమారుడు..[1]
జైమినీ తన ఉత్కృష్ట కృతి అయిన పూర్వ మీమాంస సూత్రాలు (“తొలి అవలోకన”) యొక్క కృతికర్తగా ప్రసిద్ధిపొందాడు. దీనేనే కర్మ-మీమాంస అనికూడా అంటారు. ఈ పద్ధతిలో వేద or Karma-mimamsa (“Study of [Ritual] Action”), a system that investigates the nature of Vedic injunctions. ఈ గ్రంథమే ఆరు ప్రాచీన భారతీయ తత్త్వ దర్శనాలలో ఒకటైన పూర్వ మీమాంస శాఖకు మూలాధారము.[1]
క్రీ.పూ 3వ శతాబ్దానికి చెందిన ఈ కృతిలో మూడు వేల సూత్రాలు, మీమాంస శాఖకు ఆధారభూతమైన పాఠ్యము ఉన్నాయి. The text aims at an exegesis of the Vedas with regard to ritual practice (karma) and religious duty (dharma), commenting on the early Upanishads. Jaimini's Mimamsa is a ritualist conter-movement to the mysticist Vedanta currents of his day. క్రీస్తు శకంలోని తొలి శతాబ్దాలలో శబరుడు జైమిని యొక్క పూర్వమీమాంస వ్యాఖ్యానం చేశాడు.[2]
జైమిని మహాభారతం రచించాడు. దీనిని "జైమిని భారతం" అంటారు. దీనిలోని అశ్వమేధ పర్వం బాగా ప్రసిద్ధిచెందినది.[3]
బృహత్ పరాశర హోరశాస్త్రము తర్వాత అంతటి శ్రేష్టమైన కృతి జైమినీ సూత్రాలు లేదా ఉపదేశ సూత్రాలు. ఇందులో జైమినీ, బృహత్ పరాశర హోరశాస్త్రానికి టీకాతాత్పర్య సహిత విస్తృతమైన భాష్యాన్ని చెప్పి జైమినీ జోతిష్యశాస్త్రానికి శ్రీకారం చుట్టాడు.[4]
వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించినప్పుడు, నాలుగింటిని నలుగురు ప్రధాన శిష్యులకు బోధించాడు. ఋగ్వేదాన్ని పైలునికి, యజుర్వేదాన్ని వైశంపాయునికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, అథర్వణ వేదాన్ని సుమంతునికి బోధించాడు.[5]
హిందూ పురాణాలలో ప్రముఖమైన మార్కండేయ పురాణం జైమిని, మార్కండేయుడు మధ్య చర్చా విషయంగా వివరించబడింది.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.