జిల్లా ప్రజాపరిషత్
From Wikipedia, the free encyclopedia
జిల్లా ప్రజాపరిషత్ మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ. [1] ప్రభుత్వ ప్రకటన ద్వారా జిల్లా ప్రజాపరిషత్తులను ఏర్పరుస్తారు. సాధారణంగా ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది. పూర్తి పట్టణ జిల్లా అయితే జిల్లా పరిషత్తు వుండదు. మండల ప్రజాపరిషత్ తో పాటు జిల్లా ప్రజాపరిషత్తులకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.