జాతీయ రహదారి 66
భారత పశ్చిమ తీరం వెంబడి సాగే జాతీయ రహదారి / From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 66 (ఎన్హెచ్ 66)[1] 1,640 కి.మీ. పొడవైన 4 వరుసల భారత జాతీయ రహదారి. ఇది భారత పశ్చిమ తీరం వెంబడి పశ్చిమ కనుమలకు సమాంతరంగా ఉత్తర-దక్షిణ దిశలో నడుస్తుంది. ఇది మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గుండా వెళ్తూ, ముంబైకి తూర్పున ఉన్న పన్వేల్ నగరాన్ని కన్యాకుమారికి కలుపుతుంది. గతంలో ఇది ఎన్హెచ్-17, ఎన్హెచ్-47లో భాగంగా ఉండేది.
National Highway 66 | ||||
---|---|---|---|---|
Map of the National Highway in red | ||||
మార్గ సమాచారం | ||||
Part of ![]() | ||||
పొడవు | 1,640 కి.మీ. (1,020 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
North చివర | ![]() | |||
Major intersections |
| |||
South చివర | ![]() | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు |
| |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
కర్ణాటకలో ఈ జాతీయ రహదారిని అంతర్జాతీయ ప్రమాణాలు, గ్రేడ్ సెపరేటర్లతో కూడిన 60 మీటర్ల వెడల్పు గల జాతీయ రహదారిగా మార్చే ఎన్హెచ్ఏఐ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో దీన్ని పెద్దయెత్తున ఉన్నతీకరిస్తున్నారు.[2] గోవా సరిహద్దు (కార్వార్ సమీపంలో) నుండి కేరళ సరిహద్దు (తలపాడు సమీపంలో) వరకు పూర్తి పొడవును నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు. భవిష్యత్తులో ఆరు వరుసలకు విస్తరించేందుకు వీలుగా స్థలం సేకరించారు.[3] భూములు కోల్పోతున్న ప్రజలు, సన్నపాటి రోడ్డుతో సరిపెట్టుకొమ్మని నిరసనలు వెలిబుచ్చారు. కానీ కర్ణాటక ప్రభుత్వం ఆ నిరసనలను పట్టించుకోలేదు.
కేరళలో 6 వరుసల జాతీయ రహదారి కోసం భూసేకరణ, టెండర్ ప్రక్రియ ముగిసింది. కొత్త బైపాస్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అధిక జనాభా సాంద్రత, అధిక భూమి విలువ కారణంగా, కేరళలో జాతీయ రహదారి 45 మీటర్ల వెడల్పు, 6 వరుసలుగా ఉంటుంది. గోవాలో కూడా ఇదే విధమైన అమరిక ఉంటుంది. కర్ణాటక, మహారాష్ట్ర విభాగాల్లో 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. మహారాష్ట్ర భాగాన్ని నాలుగు వరుసలతో ఫ్లెక్సిబుల్ పేవ్మెంట్ (తారు) రోడ్డుగా మార్చనున్నారు.[4][5][6]