అమృత్సర్ వద్ద పాకిస్తాన్ సరిహద్దు నుండి లేహ్ వరకు ఉన్న జాతీయ రహదారి From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 3, లేదా ఎన్‌హెచ్ 3, భారతదేశంలోని జాతీయ రహదారి. [1] ఇది భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు ప్రక్కనే, అమృత్సర్ సమీపంలోని అటారీ నుండి మొదలై హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి మీదుగా లడఖ్‌లోని లేహ్‌లో ముగుస్తుంది.[2]
National Highway 3 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH1 AH2 | ||||
నిర్వహిస్తున్న సంస్థ ఎన్హెచ్ఏఐ | ||||
పొడవు | 556 కి.మీ. (345 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | అత్తారి, పంజాబ్ | |||
జాబితా
| ||||
తూర్పు చివర | లేహ్, లడఖ్ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | అత్తారి, అమృతసర్, కర్తార్‌పూర్, జలంధర్, హోషియార్పూర్, గాగ్రేట్, నదౌన్, హమీర్పూర్, సర్కాఘాట్, కోట్లీ, మండి, కుల్లూ, మనాలి, గ్రామ్‌ఫూ, కైలాంగ్, లేహ్ | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
2010లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని జాతీయ రహదారులను పునర్వ్యవస్థీకరించిన తర్వాత, మునుపటి ఎన్‌హెచ్ 1, ఎన్‌హెచ్ 70లోని కొన్ని భాగాలను, పాత ఎన్‌హెచ్ 21లోని కొన్ని భాగాలతో కలిపి కొత్త ఎన్‌హెచ్ 3ని రూపొందించారు.
జాతీయ రహదారి 3లో కొంత భాగం హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ఎగువ ప్రాంతాల గుండా వెళుతుంది, కొన్ని ఎత్తైన పర్వత మార్గాలను దాటుతుంది. మనాలి తర్వాత మొదటి ప్రధాన కనుమ వస్తుంది, ఇది 3,978 మీటర్ల ఎత్తులో ఉన్న రోహ్తాంగ్ కనుమ. రోహ్తంగ్ కనుమ కులు లోయ, హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్, స్పితి లోయల మధ్య రవాణా సౌకర్యం కలిగిస్తోంది. ఎన్‌హెచ్3 పై తదుపరి ప్రధాన కనుమ జంస్కార్ పరిధిలో 4,890 మీటర్ల ఎత్తులో బరాలాచ లా వద్ద ఉంది. లేహ్ జిల్లాలో ఎన్‌హెచ్ 3, సముద్ర మట్టం నుండి 4,739 మీటర్ల ఎత్తున ఉన్న నకీ లా మీదుగా, 5,064 మీటర్ల ఎత్తున ఉన్న లాచులుంగ్ లా, తగాంగ్ లా ల గుండా వెళుతుంది.[3]
జాతీయ రహదారి 3 మూడు రాష్ట్రాల గుండా వెళుతుంది.
అత్తారి, అమృత్సర్, జలంధర్, హోషియార్పూర్ - హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు (178.44 కి.మీ.). [4]
పంజాబ్ సరిహద్దు - గాగ్రెట్, అంబ్, నదౌన్, హమీర్ పూర్, తౌని దేవి, ఆవా దేవి, సర్కాఘాట్, కోట్లి, మండి, కులు, మనాలి, గ్రామ్‌ఫూ, కైలాంగ్ - జమ్మూ కాశ్మీర్ సరిహద్దు (208) కి.మీ.). [5] [6]
కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఎన్హెచ్ఏఐ వారు జలంధర్ నుండి హోషియార్పూర్ వరకు ఉన్న ముక్కను నాలుగు వరుసలకు ఉన్నతీకరించడం ప్రారంభించారు. 58 కి.మీ.ల ఈ ముక్కలో అదంపూర్, రామ మండి వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది.[7] ఇందులో 39.4 కి.మీ. పంజాబ్ పబ్లిక్ వర్క్స్ విభాగానికి కేటాయించారు.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.