From Wikipedia, the free encyclopedia
గ్రీకు భాష ఇండో ఐరోపా భాషా కుటుంబంలోని స్వతంత్ర శాఖకు చెందిన భాష. గ్రీస్, సైప్రస్, అల్బేనియా ఇంకా తూర్పు మధ్యదరా ప్రాంతం, నల్ల సముద్ర ప్రాంతాల్లో పుట్టిన భాష ఇది. ఈ భాషకు ఇండో యూరోపియన్ భాషలన్నింటిలోకి అత్యధికంగా 3400 సంవత్సరాల సుదీర్ఘ లిఖిత చరిత్ర ఉంది.[1] ఈ భాషను రాయడానికి గ్రీకు అక్షరాలను ఉపయోగిస్తారు. ఈ లిపి సుమారు 2000 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. అంతకు మునుపు కూడా దీన్ని లీనియర్ బి, సైప్రియట్ సిలబరీలో అక్షరబద్ధం చేయబడి ఉన్నది.[2] ఈ అక్షరమాల ఫోనీషియన్ లిపి నుంచి ఉద్భవించింది. ఇది లాటిన్, సిరిలిక్, ఆర్మేనియన్, కాప్టిక్, గోతిక్ లాంటి మరెన్నో అక్షరమాలలకు ఆధారమైంది.
పాశ్చాత్య ప్రపంచ చరిత్రలో గ్రీకు భాష ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.[3] హోమర్ రాసిన ఇతిహాసాలతో ప్రారంభించి ప్రాచీన గ్రీకు సాహిత్య రచనలు యూరోపియన్ కానన్ లో ప్రాముఖ్యమైన రచనలుగా ఉన్నాయి. సైన్సు, తత్వ శాస్త్రాలకు సంబంధించిన అనేక ప్రాథమిక రచనలు ఈ భాషలోనే రాయబడి ఉన్నాయి. క్రైస్తవ మతానికి చెందిన న్యూ టెస్టమెంట్ కూడా గ్రీకు భాషలోనే రాయబడింది.[4][5] ఆధునిక గ్రీకు భాష గ్రీస్, సైప్రస్ దేశాలలో అధికారిక భాష, యూరోపియన్ యూనియన్ గుర్తించిన 24 అధికారిక భాషల్లో ఒకటి. గ్రీస్, సైప్రస్, ఇటలీ, అల్బేనియా, టర్కీ, ఇంకా ఇతరదేశాలను కలుపుకుంటే ఈ భాషను 1 కోటి 35 లక్షలమందికిపైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇతర భాషల్లో పదాలను ప్రతిపాదించడానికి గ్రీకు పదాలను తరచుగా వాడుతుంటారు. గ్రీకు, లాటిన్ భాషలను అంతర్జాతీయ సైన్స్ సమాజం ప్రబలమైన మూల భాషలుగా వాడుకుంటుంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.