గోల్‌పారా జిల్లా, భారతదేశం, అస్సాం రాష్ట్రం లోని జిల్లాలలో ఒకటి. గోల్‌పారా పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది.

త్వరిత వాస్తవాలు Goalpara district, Country ...
Goalpara district
District
Thumb
Tea plantation in Goalpara district
Thumb
Goalpara district's location in Assam
Countryభారత దేశము
Stateఅసోం
ప్రధాన కార్యాలయంగోల్‌పారా
విస్తీర్ణం
  Total1,824 కి.మీ2 (704 చ. మై)
జనాభా
 (2011)
  Total10,08,959
  జనసాంద్రత550/కి.మీ2 (1,400/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-AS-GP
Websitehttp://goalpara.gov.in/
మూసివేయి

చరిత్ర

గోల్‌పరా రాజబక్షి రాజుల రాజాస్థానంగా ఉంది. ప్రస్తుతం ఇది కొక్రఝార్, బొంగైగావ్, ధుబ్రి, గోల్‌పరా జొల్లాలుగా విభజించబడింది. జిల్లాలో అధికంగా కోచ్ రాజబక్షి ప్రజలు, బెంగాలీ, హిందువులు, ముస్లిములు నివసిస్తున్నారు. జిల్లాలో బెంగాలీ, అస్సామీ, గోల్‌పరియా భాషలు వాడుకలో ఉనాయి.

పేరు వెనుక చరిత్ర

గోల్‌పరా అనే పేరుకు మూలం " గ్వాలితిప్పకా " అంటే గువాలి గ్రామం లేక పాలవారి ఇల్లు.[1] గోల్‌పరా చరిత్ర పలు శతాబ్ధాలకు ముందు నాటిది. చైనాయాత్రీకుడు " హూయన్‌త్సాంగ్ " వ్రాతలను అనుసరించి కుమార్ భాస్కర్ వర్మన్ రాజ్యానికి గోల్‌పరా లేక కూచ్‌బెహర్ రాజధానిగా ఉండేదని భావిస్తున్నారు. 1765లో ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం వశమైంది. ముందుగా ఈ ప్రాంతం కూచ్ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. 1826లో బ్రిటిష్ అస్సాంను ఆక్రమించుకున్న తరువాత 1874లో గోల్‌పరా అస్సాం ప్రాంతంలో చేర్చబడింది. అలాగే ధుబ్రి జిల్లాకు కేంద్రంగా చేయబడింది. 1983 జూలై 1 న గోల్‌పరా నుండి 2 జిల్లాలు విభజించబడ్డాయి.[2] 1989 సెప్టెంబరు 29న బొంగైగావ్ జిల్లా, కోక్రఝార్ ఏర్పాటు చేయబడ్డాయి.[2]

భౌగోళికం

గోల్‌పరా జిల్లా వైశాల్యం 1824చ.కి.మీ.[3] వైశాల్యపరంగా గోల్‌పరా జిల్లా దక్షిణ కొరియా లోని జెజు-డోకు సమానం.[4]

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గోల్‌పరా జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న అస్సాం రాష్ట్ర 11జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]

విభాగాలు

జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: దుధ్నోయి, తూర్పు గోల్‌పరా, పశ్చిమ గోల్‌పరా, జలేశ్వర్.[6] దుధోని నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేకించబడింది.[6] దుధోని గౌహతీ పార్లమెంటు నియోజక వర్గంలో భాగంగా ఉంది. మిగిలిన 3 నియోజకవర్గాలు ధుబ్రి పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది.[7]

2001 లో గణాంకాలు

మరింత సమాచారం విషయాలు, వివరణలు ...
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,008,959, [8]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. మొంటానా నగర జనసంఖ్యకు సమం.[10]
640 భారతదేశ జిల్లాలలో. 444వ స్థానంలో ఉంది.[8]
1చ.కి.మీ జనసాంద్రత. 555 .[8]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.74%.[8]
స్త్రీ పురుష నిష్పత్తి. 962:1000 [8]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 68.67%.[8]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ముస్లిములు 441,516 (53.71%),
హిందువులు 314,157
క్రైస్తవులు 64,662
ప్రజలు బెంగాలీ ముస్లిములు, బెంగాలీ హిందువులు, రభ, గారో, హజాంగ్, కలిత, కోచ్ రాజ్బక్షి, దింస, బోడో
మూసివేయి

పర్యాటక ఆకర్షణలు

గోల్‌పరా జిల్లా ప్రకృతి సౌందర్యానికి పుట్టినిల్లుగా ఉంది.

  • గోల్‌పరా జిల్లాలోని పర్యాటక ఆకర్షణలు:
  • శ్రీ సూర్య పహర్: అస్సాంలోని అఙాతంగా ఉన్న పూరాతత్వ ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న కొండ ప్రాంతంలో జైనిజం, బుద్ధిజం, హిందదూయిజానికి సంబంధించిన స్మారకచిహ్నాలు ఉన్నాయి.
  • దాడన్ హిల్: దాడన్ హిల్ శిఖరంలో శివాలయం ఉంది. సోనిత్ పూర్ రాజు బాణుని సైన్యాధ్యక్షుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ ఆలయాన్ని చుట్టి పలు పురాణకథనాలు ప్రచారంలో ఉన్నాయి.
  • పీర్ మఝర్: ఇది గోలాపరా కేంద్రంలో ఉంది. ఇక్కడ సన్యాసి " హజారత్ సయ్యద్ అబ్దుల్ కాసెం ఖరసని " సమాధి ఉంది. సయ్యద్ హిందువులు, ముస్లిముల చేత సమానంగా ఆదరించి గౌరవించబడ్డాడు.
  • హులుకండా హిల్: ఇది గోలాపరా కేంద్రంలో ఉంది.
  • జిల్లాలోని ఇతర ఆకర్షణలలో శ్రీ తుక్రేశ్వరి హిల్, బార్భిటా వద్ద ఉన్న పగ్లర్‌టెక్ బాబా, ఉరిపాడ్ బీల్, లఖింపూర్‌లో ఉన్న ధామర్ రైసెన్ బీల్ మొదలైనవి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.