గాలిబ్ ఉర్దూ కవి సామ్రాట్ గాలిబ్ పూర్తి పేరు మిర్జా అసదుల్లాఖాన్. కలంపేరు గాలిబ్. ఉర్దూ, పారశీ భాషలలో కవి గాను రచయిత గాను ఖ్యాతినొందాడు. బహాదుర్ షా జఫర్ (2వ బహాదుర్ షా) ఆస్థానకవి, గురువు కూడా. గజల్ వ్రాయడంలో దిట్ట. లేఖలు వ్రాయడంలో ప్రసిధ్ధి. గాలిబ్ టర్కీకి చెందిన ఐబక్ వంశీయుడు. వాళ్లలో తండ్రి ఆస్తి కూతురికి లభిస్తుంది, కొడుక్కికాదు.కొడుక్కి తండ్రి ఖడ్గం మాత్రమే వారసత్వంగా లభిస్తుంది.గాలిబ్‍ది మహావీరుల వంశం.గాలిబు గారి తాతా 'సమర్‍ఖంద్' నుండి షాఃఆలం రాజుకాలంలో భారతదేశం వచ్చాడు. గాలిబు తంద్రిపేరు అబ్దుల్లాబేక్‍ఖాన్.గాలిబ్ తమ్మునుపేరు యూసుఫ్ ఖాన్. గాలిబ్ కు 5 సంవత్సరాల వయస్సులో, అన్వర్ సంస్థానంలో పనిచేస్తున్న తండ్రి శత్రువుల చేతుల్లోహతమైయ్యాడు. పినతండ్రికూడా గాలిబు తొమ్మిదో యేట మరణించాడు.గాలిబు తండ్రి, పినతండ్రి మరనాంతరం ప్రభుత్వంనుండి 1857 వరకు, ఆయనకు ఏడాదికి 7 వందలరూపాయల ఆర్థిక సహాయం అందేది.1857లో సిపాయి పితూరి కారణంగా మూడేళ్లు సహాయం నిలచిపోయిచాలా కష్టాలు పడ్డాదు.
మిర్జా అసదుల్లాహ్ ఖాన్ గాలిబ్ | |
కలం పేరు: | అసద్, గాలిబ్ |
---|---|
జననం: | ఆగ్రా | 1796 డిసెంబరు 27
మరణం: | 1869 ఫిబ్రవరి 15 72) ఢిల్లీ | (వయసు
వృత్తి: | కవి |
జాతీయత: | భారతీయుడు |
శైలి: | గజల్ |
Subjects: | ప్రేమ, తత్వము |
ప్రభావాలు: | మీర్ తఖి మీర్, అబ్దుల్ ఖాదిర్ బే-దిల్ |
ప్రభావితులు: | ఉర్దూ కవిత్వం, ఇక్బాల్, అల్తాఫ్ హుసేన్ హాలి, బహాదుర్ షా జఫర్ |
గాలిబ్ జీవితం పై సినిమా మీర్జా గాలిబ్ తీశారు. ఈ సినిమాకు మొదటిసారిగా జాతీయ అవార్డును ప్రవేశపెట్టి, ఉత్తమ సినిమా అవార్డు ప్రదానం చేశారు. ఈ సినిమాలో గాలిబ్ పాత్రను ప్రముఖ హిందీనటుడు భరత్ భూషణ్ పోషించాడు. గులామ్ మహమ్మద్ సమకూర్చిన సంగీతంతో ఈసినిమా గీతాలు అమరగీతాలయ్యాయి.
సినీ రచయిత, దర్శకుడు గుల్జార్ 'మిర్జా గాలిబ్' టి.వి.సీరియల్ తీశాడు. నసీరుద్దీన్ షా గాలిబ్ గా నటించాడు. జగజీత్ సింగ్, చిత్రాసింగ్ నేపథ్యగానంలో జగజీత్ సింగ్ సంగీతంలో ఈ టి.వి.సీరియల్ ప్రజానీకానికి విశేషంగా ఆకట్టుకొంది.
జీవిత విశేషాలు
గాలిబ్ జీవిత చరిత్రను యద్‌గారె-గాలిబ్ అనేపేర వ్రాసిన ఖాజా అల్తాఫ్ హుస్సేన్ హాలీ ఉర్దూలోని నవ్యకవితకు మూలపురుషుడు, గాలిబ్ శిష్యుడు. అతడు అందులో గాలిబ్ దాంపత్య జీవితం గురుంచి పలు విషయములు తెలిపినాడు. అతడు (గాలిబ్) " పరిహాస ప్రకృతిగల ఆమహాకవి వ్రాతల్ని చూచి అతనికి తన భార్యయెడ అయిష్ఠభావం ఉంటుందని అందరు అనుకోవచ్చును. కాని నిజానికి ఆదంపతులు అన్యోన్యానురాగం కలవారని, ఒకరి సుఖంకోసం ఒకరు ప్రయత్నించేవారని వ్రాసాడు."
ఆబే హయత్ అనే ఉర్దూ సాహిత్య చరిత్ర వ్రాసిన మొహెమ్మెద్ హుస్సేన్ ఆజాద్ కూడా అలాగే అభిప్రాయ పడ్డాడు.గాలిబ్ ను దర్సించిన ఆనాటి విద్వాంసులు తమ మిత్రులకు వ్రాసుకున్న జాబుల్లో అలాంటి భావాన్నే ప్రకటించారు.కాని గాలిబ్ తన మిత్రులకు, శిష్యులకు వ్రాసిన ఉత్తరాలలోను, అక్కడక్కడ తన కవితలలోను దానికి వ్యతిరేకమైన సూచనలు చేసాడు. ఉమ్రాన్ సింగ్ గాలిబ్ శిష్యుడు.అతని కళత్రం మరణించింది. మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు.ద్వితీయ కళత్రం కూడా మరణించింది. ఆసంగతి వేరిక శిష్యునివలన గ్రహించి ఆశిష్యునికి గాలిబ్ ఇలా వ్రాసాడు: ఉమ్రాన్ సింగ్ అదృష్టం చూస్తే నాకు అసూయ కలుగుతుంది. 60ఏళ్ళ నుంచి నామెడకు పడిన గడియ విడివడనేలేదు. అతనికి అప్పటికప్పటికే రెండుసార్లు విముక్తి లభించింది.
50ఏళ్ళు ఢిల్లీలోనే గాలిబ్ సొంతైల్లు కట్టించుకోలేదు. కొననూలేదు. మాటిమాటికి మారుస్తూ ఎప్పుడూ అద్దె ఇళ్ళలోనే ఉండేవాడు. ఒక తడవ క్రొత్త ఇల్లొకటి చూచి వచ్చాడు. భార్యను కూడా వెళ్ళి చూచిరమ్మన్నాడు. ఆమెకు ఇల్లు నచ్చలేదు. ఎందుకు అంటే అందులో భూతముందన్నాడట అన్నదామె. గాలిబ్ నవ్వి, నువ్వుండగా వేరే భూతమా!! అన్నాడట.ఈ కథ హాలీ చెప్పెనది.ఇల్లు పొందింహుకోవాలని అభిలషిస్తే అదేమో అడివై కూర్చున్నది అని ఇంకొక కవితలో అన్నాడు.
నిజానికి గాలిబ్ దంతా పరాచికమే-ఎంతటి విషాద వృత్తాంతాన్నయినా, ఎట్టి గంభీర విషాదాన్నయినా పరిహాస రూపంలో ప్రకటించే స్వభావం ఆతనిది. అతడు జీవించిన కాలమే ఒడిదొడుకుల్తో కూడినది. అయినా అయ్యో అనిపించే మాటేదీ అతడనలేదు.ఔరా అనిపించేటట్లే అన్నాడు ఏదన్నా.
గాలిబ్ కు సంతతి లేదు. కలుగలేదని కాదు.7గురు పిల్లలు కలిగి ఏడాది రెండేడ్లు బ్రతికి మరణించారు.వృద్ధాప్యంలో భార్య అక్కకొడుకును పెంచుకున్నాడు గాలిబ్.అతనిపేరు జైన్ లా బుద్దీన్ ఆరిఫ్.అరిఫ్ ప్రయోజకుడయిన యువకుడు.గాలిబ్ శైలిలో కవిత వ్రాయగల నేర్పరి.కాని ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత అతను అతని భార్య సం. కాల వ్యవధిలో మరణించారు.ఆరిఫ్ మరణం గాలిబ్ హృదయాన్ని కలచివేసింది. అప్పుడతను మర్సియా ఆరిఫ్' అనుపేర వ్రాసిన ఒకచిన్న కావ్యం ఆతని హృదయబాధను తెలుపుతుంది.తరువాత ఆరిఫ్ కొడుకులిద్దరినీ అతిగారబంగా పెంచుకున్నారు గాలిబ్ దంపతులు. వారిలో ఒకరికి లాహోరులో సంపద కుటుంబానికి చెందిన యువతితో పెళ్ళి చేసారు. వారికి 3 పిల్లలు పుట్టినంత వరకు గాలిబ్ జీవించాడు.
దీర్ఘకాలం వ్యాధితో తీసుకొన్న తర్వాత 15వ ఫిబ్రవరి 1869న అతని పరిస్థితి విషమించింది. మనవరాలు జీవన్ ను స్మరిస్తూ స్పృహతప్పిపడిపోయాడు. ఆమెవచ్చి అతని చెవిదగ్గర వంగి దాదాజాన్ అని పిలువగా ఒకసారి కళ్ళుతెరచి ఆమెనుమాత్రం చూచి మళ్ళీ మూసుకున్నాడు.ఆ కళ్ళు ఇక తెరువలేదు.
గాలిబ్ మరణించిన తర్వాత ఆయన భార్య ఉమ్రావు బేగం అనుభవించిన కష్టానికి అంతులేదు.70ఏళ్ళ వృద్ధ విధవ.సంతానమూ లేదు, ఆధారమూ లేదు. భర్తకిచ్చిన భరణంలో తనకు కొంత ఇప్పించవలసినదని ఆంగ్ల ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నది. ఆమె ఆఫీసుకు వెళ్ళి స్వయంగా గ్రహించే పక్షంలో నెలకు 10రూపాయలీయటానికి ప్రభుత్వం అంగీకరించించి.కానీ అఫీసుకు వెళ్ళటం ఆమెకు సమ్మతం కాలేదు. ఆ ఆశ వదులుకొని ఉమ్రావు బేగం రామపూర్ నవాబు కొక అర్జీ పంపుకున్నది.కాని అక్కడనుండి జవాబే రాలేదు.భర్త సంవత్సరీకం నాడు సరిగా అదే రోజున ఆమె పరమపదించింది. ఎన్ని కష్టాలను అనుభవించినా 60ఏళ్ళ వరకు ఒక మహాకవికి సహధర్మచారిణి అయినందున ఆమె ధన్యురాలు.
రచనలు
దీవాన్ ఎ గాలిబ్ (కవితలు) (భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, ఉర్దూ భాష సిలబస్ లో గలదు).
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.