మొదటి బేతరాజు లేదా గరుడ బేతరాజు (:996-1051) పశ్చిమ చాళుక్యులకు సామంతునిగా వ్యవహరించాడు. హన్మకొండ ఇతనే అని అభిప్రాయంఉంది. ఇతనిని గరుడ బేతరాజు అని కూడా వ్యవహరిస్తారు. అతనికి "చోళచమూవార్థి ప్రమదన" అనే బిరుదు ఉంది.[1]

అతను గుండ్యన కుమారుడు. అతని తండ్రి గుండ్యన చనిపోయేనాటికి అతను పిన్నవాడు. అతని మేనత్త కామసాని అతనికి అండగా వుండి, తన భర్త ఐన చాళుక్య సేనాని ఎర్రన ద్వారా చాళుక్య చక్రవర్తి చేత అనుమకొండ పై ఆధిపత్యం ఇప్పించింది. ఈవిధంగా కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు విధేయ సామంతులుగా అనుమకొండ విషయాధినేతలయ్యారు.
మొదటి బేతరాజు 1051 వరకు జీవించి వున్నట్టు, అనగా 50 సంవత్సరాలకు పైగా ఏలాడని, శాసనాలు తెల్పుతున్నాయి. తని సేనాని రేచర్ల బ్రహ్మ చాళుక్య త్రైలోక్య సోమేశ్వరుని తరపున చోళరాజధాని కంచి పై దాడి చేశాడు.

గరుడ బేతరాజు కుమారుడు మొదటి ప్రోలరాజు. ఇతను 1053 లో "శనిగరం" శాసనం వేయించాడు.

రేచర్ల బమ్మసేనాని కాకతీయ మొదటి (గరుడ) బేతరాజు వద్ద సేనాధిపతిగా పనిచేసి కాంచీపుర చోళులను జయించాడు. పాలంపేట, పిల్లలమర్రి, చిట్యాలంపాడు, మాచాపూర్ శాసనాలు ఇతడి గురించి తెలుపుతున్నాయి. [2]

ఇతడు విరియాల కామసాని సహాయంతో రెండవ తైలపుని వద్ద నుండి హనుమకొండ రాజ్యాన్ని పొంది చాళుక్య సామంతునిగా సుదీర్ఘకాలం పరిపాలించాడు. ఈ కాలంలో ఇతడు నాలుగు తరాల పశ్చిమ చాళుక్య చక్రవర్తులకు సామంతులుగా వారి దండయాత్రలలో పాల్గొన్నాడు. 997 నుండి 1008 వరకు సత్యాశ్రయుడు, 1008 నుండి 1015 వరకు విక్రమాదిత్యుడు, 1015 నుండి 1042 వరకు రెండవ జయసింహుడు, 1042 నుండి మొదటి సోమేశ్వరుడు. ఈ కాలంలో చాళుక్య చోళ రాజ్యాల మధ్య ఎడతెగని యుద్ధాలు జరిగాయి. చాళుక్య చక్రవర్తుల ఆదరాభిమానాలకు పాత్రుడైన బేతయ తన రాజ్యాన్ని క్రమంగా విస్తరించాడు. శనిగరంలోని 1051 నాటి బేతన శాసనం ఇందుకు నిదర్శనం. బేతరాజుకు చోళ చమూవార్థి ప్రమధన అని బిరుదు ఉన్నట్లు బ్రహ్మసేనాని పాలంపేట శాసనం, దుర్గరాజు కాజీపేట శాసనం పేర్కొంటాయి. బేతరాజు అతని సేనాని రేచర్ల బ్రహ్మ ఆహవమల్ల సోమేశ్వరుని కంచి దండయాత్రలో పాల్గొన్నట్లు శాసనాధారాలు ఉన్నాయి. 1047లో చోళ చక్రవర్తి రాజాధిరాజు చాళుక్యరాజ్యంపై దండెత్తి కళ్యాణి నగరాన్ని దోచుకుని దగ్ధం చేశాడు. దానికి ప్రతీకారంగా సోమేశ్వరుడు 1049లో చోళ రాజ్యంపై నడచి కంచిని ఆక్రమించాడు ఆ సమయంలోనే బేతరాజుకు చోళ చమువార్థి ప్రమధన అని బిరుదు లభించింది.

మూలాలు

వనరులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.