క్రాంతి కుమార్
సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత / From Wikipedia, the free encyclopedia
క్రాంతి కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన స్రవంతి అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.[1] 1991 లో ఆయన దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనవరాలు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[2]
త్వరిత వాస్తవాలు క్రాంతి కుమార్, జననం ...
క్రాంతి కుమార్ | |
---|---|
జననం | తలశిల క్రాంతి కుమార్ |
మరణం | 2003, మే 9 |
విద్యాసంస్థ | సి.ఆర్.రెడ్డి కళాశాల |
వృత్తి | దర్శకుడు నిర్మాత రచయిత |
పిల్లలు | తలశిల అనిల్ కుమార్, తలశిల సునీల్ కుమార్ |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/3/36/9nelalu.jpg/220px-9nelalu.jpg)
2001 లో ఆయన దర్శకత్వం వహించిన, సౌందర్య ప్రధాన పాత్ర పోషించిన 9 నెలలు అనే సినిమా టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3]