కొలనుపాక
From Wikipedia, the free encyclopedia
కొలనుపాక (Kolanupaka),తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలంలోని గ్రామం.[1] ఇది జిల్లా కేంద్రమైన భువనగిరి నుండి 28 కీ. మీ, ఆలేరు నుండి 7 కి. మీ. దూరం లోను, జనగామ జిల్లా జనగాం పట్టణం నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. కొలనుపాక గ్రామం భువనగిరి జిల్లాలో ఒక మేజరు గ్రామ పంచాయితి. వరంగల్ - హైదరాబాదు మార్గంలో హైదరాబాదు నుండి కొలనుపాక 65 కి.మీ దూరంలో ఉంది[2][3]. ఈ గ్రామంలో అనేక చారిత్రక వివిధ మతాల మందిరాలు, మఠాలు, పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలోని కొలనుపాక మ్యూజియం ఉంది.[4] పల్లెల్లోని కుల, మత భేదా లేని లౌకిక, మత సామరస్యతకు ప్రతీక ఈ గ్రామం.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.699374°N 79.034462°E /, రాష్ట్రం ...
కొలనుపాక | |
— రెవిన్యూ గ్రామం — | |
కొలనుపాక జైన ఆలయం | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17.699374°N 79.034462°E / 17.699374; 79.034462 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి |
మండలం | ఆలేరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి |
జనాభా (2011) | |
- మొత్తం | 8,860 |
- పురుషుల సంఖ్య | 4,431 |
- స్త్రీల సంఖ్య | 4,429 |
- గృహాల సంఖ్య | 2,289 |
పిన్ కోడ్ | 508102 |
ఎస్.టి.డి కోడ్ | 08685 |
మూసివేయి