కొబ్బరి పాలు
From Wikipedia, the free encyclopedia
కొబ్బరి పాలు అనేది కొబ్బరికాయ తురుము నుండి వచ్చిన ద్రవ పదార్థం. ఇది ఒక పరిపక్వమైన కొబ్బరికాయ యొక్క కొబ్బరి నుండి తయారయ్యే తీయని, పాలవంటి వంటలో ఉపయోగించే పదార్థం. ఈ పాల రంగు, కమ్మని రుచికి కారణం, అందులోని అధికమైన నూనె పదార్థం, చక్కెరలు. కొబ్బరి పాలు అనే పదం, కొబ్బరి నీరు (కొబ్బరి పానీయం) ఒకటి కాదు, కొబ్బరి నీరు అనేది కొబ్బరికాయ లోపలివైపు సహజంగా ఉత్పన్నమయ్యే ద్రవం.[1] కొబ్బరి పాలు చాలా రుచిగా ఉండటమే కాక, చాలా ఎక్కువ నూనె శాతం ఉంటుంది. ఈ పాలల్లో ఉండే కొవ్వు ఎక్కువగా సంతృప్త కొవ్వు ఆమ్లం ఉంటుంది. దక్షిణ తూర్పు ఆసియాలోను, దక్షిణ ఆసియాలోనూ, దక్షిణ చైనాలోను, కరేబియా, ఉత్తర, దక్షిణ అమెరికాల్లోనూ ఎక్కువగా వంటల్లో ఈ పాలను వాడుతుంటారు.