కొడంగల్
వికారాబాదు జిల్లా, కొడంగల్ మండలానికి కేంద్రం / From Wikipedia, the free encyclopedia
కొడంగల్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, కొడంగల్ మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం. ఇది పురపాలక సంఘ హోదాగల పట్టణం.[1] ఇది సమీప పట్టణమైన తాండూర్ నుండి 18 కి. మీ. దూరంలో కర్ణాటక సరిహద్దులో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ పట్టణం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్ రాష్ట్ర రహదారి ఈ పట్టణం నుంచే వెళ్తుంది. హైదరాబాదు నుంచి నైరుతి వైపున100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ఉత్తరాన రంగారెడ్డి జిల్లా సరిహద్దును కల్గిఉంది. తాండూర్ పట్టణం ఇక్కడి నుంచి 17 కిలో మీటర్ల దూరాన ఉంది.గతంలో ఈ గ్రామం మహబూబ్ నగర్ జిల్లాలో వుండేది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.107°N 77.627°E /, రాష్ట్రం ...
కొడంగల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వికారాబాద్, కొడంగల్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.107°N 77.627°E / 17.107; 77.627 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వికారాబాద్ |
మండల కేంద్రం | కోడంగల్ |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 53,673 |
- పురుషులు | 26,545 |
- స్త్రీలు | 27,128 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.15% |
- పురుషులు | 58.77% |
- స్త్రీలు | 33.34% |
పిన్కోడ్ | 509338 |
మూసివేయి