![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0c/Kaikala_Satyanarayana_%2528cropped_from_File-_Suddala_Ashokteja_08%2529.jpg/640px-Kaikala_Satyanarayana_%2528cropped_from_File-_Suddala_Ashokteja_08%2529.jpg&w=640&q=50)
కైకాల సత్యనారాయణ
ప్రముఖ నటుడు / From Wikipedia, the free encyclopedia
కైకాల సత్యనారాయణ (1935 జూలై 25 - 2022 డిసెంబరు 23) తెలుగు సినీమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.
త్వరిత వాస్తవాలు కైకాల సత్యనారాయణ, జననం ...
కైకాల సత్యనారాయణ | |
---|---|
![]() కైకాల సత్యనారాయణ | |
జననం | (1935-07-25) 1935 జూలై 25 (వయసు 89)[1] |
మరణం | 2022 డిసెంబరు 23(2022-12-23) (వయసు 87) హైదరాబాదు |
ఇతర పేర్లు | నవరస నటసార్వభౌమ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సినిమాలు, రాజకీయం |
జీవిత భాగస్వామి | నాగేశ్వరమ్మ |
పిల్లలు | 4; కైకాల లక్ష్మీనారాయణ, కైకాల రామారావు (చిన్నబాబు), కైకాల రమాదేవి లతో సహా మరో కూతురు |
తల్లిదండ్రులు |
|
బంధువులు | కైకాల నాగేశ్వరరావు, సినీ నిర్మాత (సోదరుడు) |
మూసివేయి