From Wikipedia, the free encyclopedia
కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ 35 నుండి 32 లక్షల సంవత్సరాల క్రితం నాటి ( ప్లియోసిన్ ) హోమినిన్ శిలాజం. దీన్ని 1999 లో కెన్యాలోని తుర్కానా సరస్సులో మీవ్ లీకీ బృందంలో సభ్యుడైన జస్టస్ ఎరుస్ కనుగొన్నాడు. [3]
కెన్యాంత్రోపస్ Temporal range: | |
---|---|
Scientific classification (disputed) | |
Domain: | Eukaryota |
Kingdom: | జంతువు |
Phylum: | కార్డేటా |
Class: | క్షీరదాలు |
Order: | Primates |
Suborder: | Haplorhini |
Infraorder: | Simiiformes |
Family: | Hominidae |
Subfamily: | Homininae |
Tribe: | Hominini |
Genus: | †Kenyanthropus M.G.Leakey, Spoor, Brown, Gathogo, Kiarie, L.N.Leakey & McDougall, 2001 |
Species | |
Synonyms[1] | |
ఈ శిలాజం ఓ కొత్త హోమినిన్ జాతికి, కొత్త ప్రజాతికీ చెందినదని లీకీ (2001) ప్రతిపాదించింది. కొందరు దీన్ని ఆస్ట్రలోపిథెకస్ ప్రజాతి లోని ఒక జాతిగా, ఆస్ట్రలోపిథెకస్ ప్లాటియోప్స్ అని, మరి కొందరు హోమో ప్రజాతిలో హోమో ప్లాటియోప్స్ అనీ అన్నారు. ఇంకొందరు దీన్ని ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ జాతికి చెందిన శిలాజంగా భావించారు.
2015 లో లోమెక్విలో చేసిన పురావస్తు తవ్వకాల్లో అత్యంత పురాతన పనిముట్లు కూడా లభించాయి. ఇవి ఓ హోమినిన్ వాడిన అత్యంత పురాతన పనిముట్లు. ఆ విధంగా పనిముట్లు వాడిన తొట్ట తొలి జీవి కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ కావచ్చునని ఇవి సూచించాయి. [4]
కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ అనే పేరు ఈ ప్రత్యేక జాతికి అనేక కారణాల వల్ల కేటాయించబడింది: కెన్యాలో అనేక హోమినిన్లను కనుగొన్నదానికి గుర్తుగా " కెన్యాంత్రోపస్ " అనే పేరును ఈ జాతికి పెట్టాలని ప్రతిపాదించారు. మానవ పరిణామాన్ని అర్థం చేసుకోవడంలో ఆ శిలాజాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. గ్రీకులో చదునైన అని అర్థం ఉన్న ప్లాటస్ ఈ జాతి చదునైన ముఖాన్ని సూచిస్తుంది. ఆప్సిస్ అంటే కనిపించడం. ఈ రెండు గ్రీకు పదాల నుండి ప్లాటియోస్ అనే పదం వచ్చింది.
1999 లో, మీవ్ లీకీ కెన్యాలో శిలాజాల కోసం వెతకడానికి ఒక యాత్ర చేపట్టింది. ఇది ఈ ప్రాంతంలో జ్రిగిన రెండవ యాత్ర. మొదటి యాత్ర 1998 లో జరిగింది, దీనిలో KNM-WT 38350 అనే పారాటైప్ను కనుగొన్నారు. [5] అనేక ప్రముఖ హోమినిన్ శిలాజాలను శాస్త్రవేత్తలకు అందించిన తుర్కానా సరస్సులో వాళ్ళు తవ్వకాలు మొదలు పెట్టారు. బృందంలోని సభ్యుడు, జస్టస్ ఎరుస్, సరస్సు పక్కనే ఉన్న లోమెక్వి వద్ద నాచుకుయ్ నిర్మాణంలో ఒక పుర్రెను కనుగొన్నాడు. రెండు యాత్రలలోనూ సేకరించిన మొత్తం శిలాజాల్లో టెంపొరల్ ఎముక, మూడు పాక్షిక కింది దవడలు, రెండు పాక్షిక మాక్సిల్లె, నలభై నాలుగు పళ్ళూ ఉన్నాయి. అయితే, శాస్త్రవేత్తల్లో ఆసక్తిని రేకెత్తించింది, KNM-WT 40000 గా పిలిచే పుర్రె. ఇది దాదాపు సంపూర్ణంగా ఉంది. గతంలో ఇతర శిలాజాల్లో చూసిన అనేక లక్షణాలు, దీనికి ఉన్నాయి. అయితే ఈ లక్షణాలు ఒకే స్పెసిమెన్లో ఉండడం ఇంతకు ముందెన్నడూ చూడలేదు; దీంతో ఇదొక ప్రత్యేకమైన, విశిష్టమైన జాతి అని శాస్త్రవేత్తలు గ్రహించారు.
KNM-WT 40000 తో పాటు ఇతర ఎముకలు అగ్నిపర్వత గులకరాళ్ళు, గట్టిపడిన కాల్షియం కార్బొనేటుతో కూడిన నల్లటి మట్టిరాళ్లలో దొరికాయి. KNM-WT 40000 స్పెసిమెన్ 35 లక్షల సంవత్సరాల నాటిదని, అది లభించిన చోట ఉన్న మట్టి పొర 35.3 లక్షల సంవత్సరాల నాటిదని తేలింది. ఆ పొరకు సరిగ్గా క్రింద KNM-WT 38341 స్పెసిమెన్ దొరికింది. ఇది ఇది 353 లక్షల సంవత్సరాల నాటిది. బి-తులు బోర్ టఫ్కు పైన వివిధ స్థలాల్లో లభించినన ఇతర స్పెసిమెన్లు సుమారు 33 లక్షల సంవత్సరాల నాటివి. ఈ మట్టి రాయి పెద్దగా లోతులేని సరస్సు దగ్గర ఉంది. హోమినిన్లు నదులు లేదా సరస్సులకు దగ్గరలో నివసించారని ఇది సూచిస్తోంది.
KNM-WT 40000 అనేది ఈ జాతికి చెందిన హోలోటైప్ -ఈ జాతిని నిర్వచించే లక్షణాలు కలిగిన స్పెసిమెన్. [5]
మధ్య ప్లయోసీన్ సమయంలో వర్గీకరణపరంగా హోమినిన్లు మరింత వైవిధ్యంగా ఉన్నాయని కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ శిలాజాలు సూచిస్తున్నాయి. ముందుకు పొడుచుకువచ్చి ఉండని దవడలు ఇంతకు ముందు అనుకున్నదానికంటే ముందే ఉద్భవించాయి. దాని ముఖ నిర్మాణం, ఉత్పన్నమైన లక్షణాలూ దాదాపు ప్రతి కపాల లక్షణంతో సహా పారాంత్రోపస్ కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. అందువల్ల కొత్త పుర్రెను పారాంత్రోపస్ జాతికి కేటాయించటానికి కారణమే లేదు. కపాల నిర్మాణంలో తేడాలు చాలా భిన్నంగా ఉన్నాయని ఇప్పటికీ భావిస్తున్నారు. హోమో, ఆర్డిపిథెకస్ల కంటే కూడా దీనిలో చాలా తేడాలున్నాయి. దాని కపాల నిర్మాణం ఆస్ట్రలోపిథెకస్తో కొన్ని సారూప్యతలు కూడా ఉన్నాయి - మెదడు పరిమాణం, ముక్కు భాగాలు, సబోర్బిటల్, టెంపొరల్ ప్రాంతాలు మొదలైనవి - తేడాలు చాలా సారూప్యతల కంటే చాలా ఎక్కువ. అంచేతనే దాన్ని కొత్త జాతిలో చేర్చారు.
హోమినిన్ల పరిణామాన్ని గుర్తించడం చాలా కష్టమైన పని అయినప్పటికీ, ఈ హోమినిన్ల గురించిన మానవుని పరిజ్ఞానం పెరుగుతోంది. హోమినిన్ల పరిణామ వంశవృక్షం చిత్రంలో సూచించినట్లుగా 1999 లో కెన్యాంత్రోపస్ దొరక్క ముందు, ఆస్ట్రలోపిథెకస్ సమూహం ప్రాచీనమైనవని అనుకునేవారు. వాస్తవానికి కెన్యాంత్రోపస్ ప్లాటియోప్స్ హోమినిన్ల పరిణామ పథాన్ని గందరగోళ పరచింది. ఎందుకంటే ఈ జాతి ఓ కొత్త రకం జాతిని, ప్రజాతినీ సూచిస్తోంది. అయితే, కెన్యాలో శిలాజాన్ని కనుగొన్న తరువాత, కె. ప్లాటియోప్స్ మునుపటి జాతులలో ఒకటనీ, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ నివసించిన సమయంలోనే ఇది కూడా నివసించేదనీ ఒక భావన ఏర్పడింది. K. ప్లాటియోప్స్ పుర్రెను కనుగొన్న తరువాత, సాధారణ పూర్వీకుడు A. అఫారెన్సిస్ కాదని, K. ప్లాటియోప్స్ అనీ మార్చారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.