కటీకల్ శంకరనారాయణన్ (1932 అక్టోబరు 15 - 2022 ఏప్రిల్ 24) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మహారాష్ట్ర[1], నాగాలాండ్[2], జార్ఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశాడు.

త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
కె. శంకరనారాయణన్
Thumb


పదవీ కాలం
22 జనవరి 2010  24 ఆగష్టు 2014
ముందు ఎస్.సి. జమీర్
తరువాత సి.హెచ్.విద్యాసాగర్ రావు

5వ జార్ఖండ్ గవర్నర్
పదవీ కాలం
26 జులై 2009  21 జనవరి 2010
ముందు సయ్యద్ సిబ్తే రాజీ
తరువాత ఎం.ఓ.హెచ్. ఫరూక్

13వ నాగాలాండ్ గవర్నర్
పదవీ కాలం
3 ఫిబ్రవరి 2007  28 జులై 2009
ముందు శ్యామల్ దత్తా
తరువాత గుర్బచన్ జగత్

పదవీ కాలం
26 జూన్ 2009  27 జులై 2009
ముందు శివ చరణ్ మాథుర్
తరువాత సయ్యద్ సిబ్తే రాజీ

పదవీ కాలం
4 సెప్టెంబర్ 2007  26 జనవరి 2008
ముందు శీలేంద్ర కుమార్ సింగ్
తరువాత జోగిందర్ జస్వంత్ సింగ్
పదవీ కాలం
7 ఏప్రిల్ 2007  14 ఏప్రిల్ 2007
ముందు ఎం.ఎం. జాకబ్
తరువాత ఎస్. కే. సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-10-15)1932 అక్టోబరు 15
పాలక్కాడ్ , బ్రిటిష్ ఇండియా
మరణం 2022 ఏప్రిల్ 24(2022-04-24) (వయసు 89)
శేఖరీపురం , భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ప్రొఫెసర్ కె రాధ
సంతానం 1 కుమార్తె
మూసివేయి

రాజకీయ జీవితం

కె. శంకరనారాయణన్ 1946లో విద్యార్థి రాజకీయాల ద్వారా తన కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆయన త్రిథాల నుండి ఐదవ కేరళ శాసనసభకు, శ్రీకృష్ణాపురం నుండి ఆరవ కేరళ శాసనసభకు, ఎనిమిదవ అసెంబ్లీకి ఒట్టపాలెం నుండి, 11వ అసెంబ్లీకి పాలక్కాడ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1977లో కె. కరుణాకరన్ మంత్రివర్గంలో వ్యవసాయం, పశుపోషణ, పాడిపరిశ్రమ అభివృద్ధి, సమాజాభివృద్ధి శాఖల మంత్రిగా,  2001 నుండి 2004 వరకు ఎకె ఆంటోనీ మంత్రివర్గంలో ఆర్థిక,  ఎక్సైజ్ శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన 1985 నుంచి 2001 వరకు 16 ఏళ్లపాటు కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్ (యూడీఎఫ్) కన్వీనర్‌గా ఉన్నాడు.

కె. శంకరనారాయణన్ నాగాలాండ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర రాష్ట్రాలకు గవర్నర్‌గా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాడు.

మరణం

కె. శంకరనారాయణన్ వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతూ కేరళలో పాలక్కాడ్‌లోని తన నివాసంలో 2022 ఏప్రిల్ 24న మరణించాడు. అతని భార్య రాధ మరణించింది. ఓ కుమార్తె అనుపమ ఉన్నారు.[3][4]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.