![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/98/Caspian_Sea_from_orbit.jpg/640px-Caspian_Sea_from_orbit.jpg&w=640&q=50)
కాస్పియన్ సముద్రం
From Wikipedia, the free encyclopedia
కాస్పియన్ సముద్రం ప్రపంచoలోనే అతిపెద్ద భూపరివేష్ఠిత జలాశయం. ప్రపంచంలోని అతిపెద్ద సరస్సుగాను, పూర్తి స్థాయి సముద్రం గానూ దీన్ని వర్గీకరించారు. ఇది యూరప్, ఆసియా ల మధ్య ఉన్న ఎండోరిక్ బేసిన్ (నీరు రావడమే గానీ, నీరు బయటికి పోయే మార్గం లేని బేసిన్). కాకసస్కు తూర్పున, మధ్య ఆసియా లోని విశాలమైన గడ్డిమైదానాలకు పశ్చిమాన, తూర్పు ఐరోపాలోని రష్యా దక్షిణ ప్రాంతపు సారవంతమైన మైదానాలకు దక్షిణాన, పశ్చిమ ఆసియాలోని పర్వతీయ ఇరానియన్ పీఠభూమికి ఉత్తరాన కాస్పియన్ సముద్రం ఉంది. ఇది 3,71,000 చ.కి.మీ. విస్తీర్ణంతో (అత్యంత ఉప్పటి నీటితో ఉండే గరబోగాజ్కోల్ మడుగును కలపకుండా), 78,000 కి.మీ.3 ఘనపరిమాణంతో ఉంది. కాస్పియన్ సముద్రపు లవణీయత 1.2% (12 గ్రా / లీటరు). ఇదిసముద్రపు నీటి సగటు లవణీయతలో మూడవ వంతు. దీనికి మధ్య-ఉత్తరం నుండి మధ్య-తూర్పు వరకు కజకిస్తాన్, మధ్య-ఉత్తరం నుండి మధ్య-పడమర వరకు రష్యా, నైరుతిలో అజర్బైజాన్, దక్షిణాన, ఆ ప్రక్కనే ఉన్న మూలల్లో ఇరాన్, తూర్పు తీరపు దక్షిణ భాగంలో తుర్కమేనిస్తాన్ లు సరిహద్దులుగా ఉన్నాయి.
కాస్పియన్ సముద్రం | |
---|---|
![]() టెర్రా ఉపోగ్రహం నుండి తీసిన కాస్పియన్ సముద్ర చిత్రం. 2003 జూన్ | |
ప్రదేశం | తూర్పు ఐరోపా, మధ్య ఆసియా, పశ్చిమాసియా |
అక్షాంశ,రేఖాంశాలు | 41°40′N 50°40′E |
రకం | పురాతన సరస్సు, ఎండోరిక్, ఉప్పునీటి, శాశ్వత, సహజ |
సరస్సులోకి ప్రవాహం | వోల్గా నది, ఉరల్ నది, కురా నది, టెరెక్ నది |
వెలుపలికి ప్రవాహం | ఆవిరి |
పరీవాహక విస్తీర్ణం | 3,626,000 కి.మీ2 (1,400,000 చ. మై.)[1] |
ప్రవహించే దేశాలు | అజర్బైజాన్ ఇరాన్ కజఖ్స్తాన్ రష్యా తుర్క్జ్మేనిస్తాన్ |
గరిష్ట పొడవు | 1,030 కి.మీ. (640 మై.) |
గరిష్ట వెడల్పు | 435 కి.మీ. (270 మై.) |
ఉపరితల వైశాల్యం | 371,000 కి.మీ2 (143,200 చ. మై.) |
సరాసరి లోతు | 211 మీ. (690 అ.) |
గరిష్ట లోతు | 1,025 మీ. (3,360 అ.) |
78,200 కి.మీ3 (18,800 cu mi) | |
నిల్వ సమయం | 250 ఏళ్ళు |
తీరంపొడవు1 | 7,000 కి.మీ. (4,300 మై.) |
ఉపరితల ఎత్తు | −28 మీ. (−92 అ.) |
ద్వీపములు | 26 |
ప్రాంతాలు | బాకు, నౌషహర్,రష్త్, అక్టౌ, మఖచ్కలా, తుర్క్మెన్బేసి |
మూలాలు | [1] |
1 Shore length is not a well-defined measure. |
కాస్పియన్ సముద్రం దాదాపు 1,200 చ.కి.మీ. లలో విస్తరించి ఉంది. ఉత్తర దక్షిణాల్లో సగటున 320 కి.మీ. వెడల్పు ఉంటుంది. దీని స్థూల ఉపరితల వైశాల్యం 3,86,400 చ.కి.మీ. దీని ఉపరితలం సముద్ర మట్టానికి సుమారు 27 మీటర్ల దిగువన ఉంటుంది. ఐరోపాలోకెల్లా పొడవైన నది, వోల్గా, ఈ సముద్రపు ఉత్తరపు కొనన దానిలో సంగమిస్తుంది. ఇది కాస్పియన్ సముద్రం లోకి వచ్చే ప్రధానమైన మంచినీటి ప్రవాహం. దీనికి ఉన్న రెండు లోతైన బేసిన్లు మధ్య, దక్షిణ మండలాలను ఏర్పరుస్తున్నాయి. వీటివలన కాస్పియన్ సముద్రపు ఉష్ణోగ్రత, లవణీయత, జీవావరణాల్లో క్షితిజ సమాంతరంగా తేడాలు ఏర్పడుతున్నాయి. సముద్రపు దక్షిణ భాగంలో సముద్రగర్భం సముద్రమట్టానికి దిగువన 1,023 మీటర్లు ఉంటుంది. ఇది బైకాల్ సరస్సు (1,180 మీటర్లు) తరువాత భూమిపై రెండవ అత్యంత లోతైన గొయ్యి. దాని తీరంలోని నివసించిన ప్రాచీనులు వ్రాసిన వృత్తాంతాలను బట్టి వారు కాస్పియన్ సముద్రాన్ని ఒక మహాసముద్రంగా భావించారు. బహుశా దాని లవణీయత, పెద్ద పరిమాణాల కారణంగా అలా భావించి ఉండవచ్చు.
కాస్పియన్ సముద్రం విస్తృతమైన జీవ జాతులకు నిలయం. కేవియర్, చమురు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. చమురు పరిశ్రమ నుండి వెలువడే కాలుష్యం ప్రధానం గాను, నదులపై నిర్మించిన ఆనకట్టలు కొంతమేరకూ దాని పర్యావరణానికి హాని కలిగించాయి.