కజకస్తాన్
From Wikipedia, the free encyclopedia
కజక్‌స్తాన్ (కజక్ భాష : Қазақстан) మధ్య ఆసియా, తూర్పు ఐరోపా లోని దేశం. దీని అధికారిక నామం కజఖ్‌స్తాన్ రిపబ్లిక్. ఇది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద భూపరివేష్టిత దేశం.[2][3] దీని విస్తీర్ణం 27,27,300 చ.కి.మీ. (ఇది పశ్చిమ ఐరోపా విస్తీర్ణం కంటే ఎక్కువ). దీనికి ఉత్తరాన రష్యా, తూర్పున చైనా, దక్షిణాన కిర్గిజిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు సరిహద్దులుగా ఉన్నాయి. నైఋతి సరిహద్దులో కాస్పియన్ సముద్రం ఉంది.మంగోలియా సరిహద్దు కజక్‌స్తాన్ నుండి 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. కజఖస్తాన్‌లో పీఠభూములు, గడ్డి మైదానాలు (స్టెప్పీలు), తైగ, రాక్ కేనియన్, కొండలు, నదీముఖద్వారాలు, మంచు శిఖరాలతో కూడిన పర్వతాలు, ఎడారి ప్రాంతాలూ ఉన్నాయి. 2014 గణాంకాలను అనుసరించి దేశ జనాభా 1.8 కోట్లు.[4]
Қазақстан Республикасы Qazaqstan Respublïkası Республика Казахстан రెస్పబ్లికా కజఖ్‌స్తాన్ రిపబ్లిక్ ఆఫ్ కజకస్తాన్ |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం |
||||||
రాజధాని | ఆస్తానా 51°10′N 71°30′E | |||||
అతి పెద్ద నగరం | అల్మాటి | |||||
అధికార భాషలు | కజక్ (రాజభాష), రష్యన్ | |||||
ప్రజానామము | కజక్స్తానీ [1] | |||||
ప్రభుత్వం | గణతంత్రం | |||||
- | రాష్ట్రపతి | నూర్ సుల్తాన్ నజర్బయేవ్ | ||||
- | ప్రధానమంత్రి | కరీమ్ మాసిమోవ్ | ||||
స్వాతంత్రం | సోవియట్ యూనియన్ నుండి | |||||
- | 1వ ఖనాతే | 1361 - తెల్ల హోర్డ్ | ||||
- | 2వ ఖనాతే | 1428 నుండి ఉజ్బెక్ హోర్డ్ గా | ||||
- | 3వ ఖనాతే | 1465 నుండి కజక్ ఖనాతే గా | ||||
- | ప్రకటించుకున్నది | డిసెంబరు 16, 1991 | ||||
- | సంపూర్ణమైనది | డిసెంబరు 25, 1991 | ||||
విస్తీర్ణం | ||||||
- | మొత్తం | 2,724,900 కి.మీ² (9వ) 1,052,085 చ.మై |
||||
- | జలాలు (%) | 1.7 | ||||
జనాభా | ||||||
- | జనవరి 2006 అంచనా | 15,217,711 National Statistics Agency of Kazakhstan (62వ) | ||||
- | 1999 జన గణన | 14,953,100 | ||||
- | జన సాంద్రత | 5.4 /కి.మీ² (215వ) 14.0 /చ.మై |
||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $145.5 బిలియన్లు (56వ) | ||||
- | తలసరి | $9,594 (66వ) | ||||
జినీ? (2003) | 33.9 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.774 (medium) (79వ) | |||||
కరెన్సీ | టెంజి (KZT ) |
|||||
కాలాంశం | West/East (UTC+5/+6) | |||||
- | వేసవి (DST) | గుర్తించలేదు (UTC+5/+6) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .kz | |||||
కాలింగ్ కోడ్ | +7 |
కజక్‌స్థాన్ జనసంఖ్య పరంగా ప్రపంచదేశాలలో 61వ స్థానంలో ఉంది. జనసాంధ్రత చాలా తక్కువగా 6 / చ.కి.మీ. రాజధాని నూర్ సుల్తాన్. గతంలో దీన్ని అస్తానా అనేవారు. అంతకుముందు రాజధానిగా ఉన్న అల్మాటీ నుండి 1997 లో అస్తానాకు మార్చారు.
చారిత్రికంగా కజక్‌స్తాన్‌లో ఆరంభకాలంలో నివసించిన ప్రజలు దేశద్రిమ్మరులు అని భావిస్తున్నారు. 13వ శతాబ్దంలో చెంగీజ్ ఖాన్ ఈ దేశాన్ని ఆక్రమించాడు. విజయం సాధించిన వారి సంభవించిన అంతర్గత కలహాల కారణంగా అధికారం తిరిగి నోమాడుల హస్థగతం అయింది. 16వ శతాబ్దం నాటికి కజకీలు మూడు జుజ్ (ప్రాచీన స్థానికులు) బృందాలుగా ఏర్పడ్డారు. 18వ శతాబ్దం నుండి రష్యన్లు కజక్ గడ్డి మైదానాల్లోకి చొచ్చుకొని వచ్చారు. 19వ శతాబ్దం నాటికి కజక్‌స్తాన్ ప్రాంతం మొత్తం రష్యా సామ్రాజ్యంలో భాగంగా మారింది. 1917 రష్యన్ తిరుగుబాటు, ఆపై జరిగిన అంతర్యుద్ధం తరువాత కజకస్తాన్ అనేకమార్లు పుంర్వ్యవస్థీకరణకు గురైంది. 1936లో కజక్‌స్తాన్ సోవియట్ యూనియన్‌లో భాగం అయింది.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిన తరువాత స్వతంత్రం ప్రకటించిన చివరి దేశం కజక్‌స్థాన్. స్వతంత్రం ప్రకటించిన తరువాత కజ్క్స్థాన్ మొదటి అధ్యక్షునిగా నూర్ సుల్తాన్ నజర్బయేవ్ అధ్యక్షునిగా నియమించబడి దేశానికి నాయకత్వం వహించాడు. కజక్త్సాన్ విదేశీసంబధాలలో సమతుల్యత వహిస్తుంది. అలాగే దేశ ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తుంది. ప్రత్యేకంగా హైడ్రోకార్బన్ పరిశ్రమ మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.[5] హ్యూమన్ రైట్స్ వాచ్ కజక్‌స్తాన్ సభాసమావేశాలు, స్వతంత్ర భావప్రకటన, మతావలబన మీద తీవ్రమైన నిబంధనలు విధిస్తుంది" అని అభిప్రాయపడుతుంది.[6] కజక్‌స్తాన్ మానవహక్కుల రక్షణ బలహీనంగా ఉందని స్వతంత్ర పర్యవేక్షకులు భావిస్తున్నారు. కజక్‌స్తాన్‌లో 131 సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వీరిలో కజకీలు 63%, రష్యన్లు, ఉజ్బెకియన్లు, జర్మన్లు, తాతర్లు, ఉయ్ఘూర్ ప్రజలు ఉన్నారు.[7] ఇస్లాం మతస్థులు 70%, 26% క్రైస్తవులు ఉన్నారు.[8] కజక్‌స్తాన్ మతస్వాతంత్ర్యాన్ని అనుమతిస్తుంది. కజక్ భాష దేశ అధికారభాషగా ఉంది. రష్యన్ భాష కూడా అధికార భాషకు సమానస్థాయిలో ఉంది. [9][10]