From Wikipedia, the free encyclopedia
కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. eతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
ఏనుగుల వీరాస్వామి మద్రాసు నుండి కాశీకి రెండుసార్లు కాలి మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ వివరాలు కాశీయాత్ర చరిత్ర అనే గ్రంథంగా 1838 లో కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లై అనే విద్వాంసుడు అచ్చు వేయించాడు. వీరాస్వామి మద్రాసు సుప్రీం కోర్టు శాఖలో ఇంటర్ప్రిటర్గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయనకు ధర్మబుద్ధి, పలుకుబడి ఎక్కువే. సకుటుంబ సపరివారంగా డేరాలతో సహా ఆయన చేసిన ప్రయాణాలలో మనకు అద్భుతం కల్గించే అంశాలు ఎన్నో ఉన్నాయి.
1941 లో దిగవల్లి వేంకట శివరావు ఈ గ్రంథాన్ని సంస్కరించి ఎన్నో క్లిష్టతరమైన ఆలనాటి తెలుగు-ఉరుదూ-తమిళం కలిసియున్న మాటలకు అర్ధములతో సరళమైన తెలుగు భాషలో వెలువరించి 3 వ సంకలనము ప్రచురించారు. వీరస్వామి వ్రాసింది తెలుగు భాషలోనే. ఐతే అది రెండు వందల సంవత్సరాల నాటి జనవ్యవహార భాష కావటంతో మూడవసంకలనములో చేసిన సంస్కరణలుకు భాషా శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం లభించి, గిడుగు రామమూర్తి పంతులుగారి మన్ననలకు పాత్రమయింది. వెళ్ళేటప్పుడు మద్రాసు, హైదరాబాద్, నాగపూర్, అలహాబాదుల మీదుగా వీరాస్వామిగారు కాశీ చేరారు. వచ్చేటప్పుడు గయ, ఛత్రపురం, భువనేశ్వర్, విశాఖపట్నం, ఒంగోలు, కావలి, నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట మద్రాసు చేరారు. మొదటి రెండు సంకలనములలో క్లిష్టమైన భాషాశైలే కాక పేరాలుగానీ, విశేషములవారి విభజనలుగానీ లేవు. మూడవ సంకలనము నకు సంపాదకులు దిగవల్లి వేంకటశివరావుగారు ఆ పుస్తకముయొక్క గ్రంథకర్త అయిన ఏనుగుల వీరస్వామయ్య గారి జీవిత చరిత్రపై దీర్ఘ పరిశోధన జరిపారు, మొదటి రెండు సంకలనములలోగల క్లిష్టమైన భాషా శైలిని మచ్చుచూపించుటకు కొన్ని కొన్ని నమునాల ముఖపత్రములను తన సంకలనములో చేర్చాడు. ఆ కాలమునాటి మాటల అర్ధములకొరకు అనేక చారిత్రక గ్రంథములలోనుండి సేకరించి మూడవ సంకలనములో విశేషములవారీగా పేరాగ్రాఫ్ విభజనలుచేసి వివరణలిచ్చాడు. ఏనుగుల వీరస్వామయ్య జీవితవిశేషములు, రాజకీయ సాంఘిక పరిస్థితులను గూర్చి వివరణ, 39 పుటల అకారాది సూచిక, అనేక చిత్రపఠములు ఉన్నాయి. 3వ సంకలన మొదటిముద్రణలో యాత్ర మార్గసూచికాపఠము (route map) లేదు. 1991 సంవత్సరము రెండవముద్రణలో అప్పటికి 94 సంవత్సరముల వయస్సు గల సంపాదకుడు దిగవల్లి వేంట శివరావు వీరస్వామయ్య ప్రయాణించిన మార్గసూచికాపఠమును (route map) ను 1991లో ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ క్రొత్త ఢిల్లీ వారు చేసిన రెండవముద్రణలో జతచేశాడు.
క్షేత్ర మహాత్మ్య కథలు, తీర్ధశార్ధ విధులు మతధర్మ చర్చలు, దేశచరిత్రాంశములు మొదలగునవి. గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవితవిశేషములు, రాజకీయ సాంఘిక పరిస్థితులను గూర్చి వివరణ,
1975 లో ఆంధ్రప్రదేశ్ ఆర్కైవ్సు వారు ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్రచరిత్ర ఇంగ్లీషులో ప్రచురణచేశారు
"గుర్తింపుకు నోచుకోని బహుముఖ ప్రజ్ఞాశాలి దిగవల్లి శివరావు" కంచి వాసుదేవరావు, వ్యక్తులు వ్యక్తిత్వాలు 121, శ్రీవాణి అక్టోబరు 2001
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.