From Wikipedia, the free encyclopedia
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (ఆంగ్లం : Banaras Hindu University) (BHU), హిందీ: काशी हिन्दू विश्वविद्यालय, ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం, వారణాసి సమీపంలో గలదు.[1] ఇది ఆసియా లోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం.[2]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
స్థాపితం | 1916 |
---|---|
వైస్ ఛాన్సలర్ | పంజాబ్ సింగ్ |
స్థానం | వారణాసి, భారతదేశం |
జాలగూడు | http://www.bhu.ac.in/ |
బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంను మదన్ మోహన్ మాలవ్యా 1916లో డా.అనీ బెసెంట్ సహాయంతో ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయానికి స్థలము కాశీ నరేష్ కేటాయించాడు, అలాగే మొదటి ఉపకులపతిగా కాశీ నరేష్ నియుక్తుడయ్యాడు.[3]
ఈ విశ్వవిద్యాలయపు పేరులో "హిందూ" అని పేర్కొన్ననూ, ఇందులో అన్ని మతస్తులవారికి ప్రవేశమున్నది. విద్యార్థులు, బోధన బోధనేతర సిబ్బందిలో వివిధ మతస్తుల వారున్నారు. దీని అధికారిక వెబ్సైటులో ఈ సందేశం చూడవచ్చు:
"భారత్ కేవలం హిందువులది మాత్రమేగాదు[4] ఇది, ముస్లిములదీ, క్రైస్తవులదీ, పారశీకులది కూడాను. భారత్ పరిపుష్టి కావాలంటే, అన్ని మతాలవారు కులాలవారు పరస్పర సహాయసహకారాలతో శాంతియుతంగా జీవించాలి. ఈ విజ్ఞాన కేంద్రం జ్ఞానవంతులను తయారు చేస్తుందని, వీరు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మేధావులకు ఏమాత్రం తీసిపోరని నా ఆశ, ప్రార్థన. ఇచ్చటి విద్యార్థులు ఓ ఉన్నతమైన జీవితాన్ని పొందుతారని, జీవిస్తారని, తమ దేశాన్ని ప్రేమిస్తారని, అలాగే ఆ పరమేశ్వరుడికి లోబడి వుంటారని ఆశిస్తున్నాను.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.