From Wikipedia, the free encyclopedia
నార్ల తాతారావు (మార్చి 8, 1917 - ఏప్రిల్ 7, 2007) ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 మార్చి 8వ తేదీన నార్ల మహాలక్ష్మమ్మ, లక్ష్మణరావు దంపతులకు జన్మించాడు. కౌతవరం, మచిలిపట్నం లలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. గుంటూరులో పిజిక్స్ లో పట్ట భద్రుడైన తరువాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1941లో ఇంజినీరింగ్ పట్టా పొందారు. అమెరికా లోని ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ డిగ్రీ చదివారు.
తాతారావు మొదట టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ఉద్యోగిగా జీవితము ప్రారంభించాడు. ఆ తర్వాత 1949 లోమధ్యప్రదేశ్ విద్యుత్తు బోర్డులో బెరారు డివిజనల్ ఇంజినీరుగా ఉద్యోగ జీవితం మొదలు పెట్టాడు. అక్కడ కార్యదర్శి,ఛీఫ్ ఇంజినీర్, ఛైర్మన్ గా పదోన్నతి పోందారు. మధ్య ప్రదేశ్ విద్యుత్ శాఖలో పనిచేసిన కాలంలో (1949-1972) బెస్తారు కొండలలో నివసించే అదివాసి ప్రజలకు విద్యుత్తు వెలుగులు పంచి దేశంలోనే ఆ సంస్థను అగ్రగామిగా నిలిపాడు.
1972 -74 లలో కేంద్ర జల విద్యుత్తు మండలి సభ్యులుగా పనిచేసారు.
1974 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు (APSEB) ఛైర్మన్‌గా వచ్చి 1988 వరకూ 14 ఏళ్లపాటు తాతా రావు పనిచేసాడు. తన కాలంలో విద్యుత్తు ఉత్పత్తిని ఐదు రెట్లు పెంచి విద్యుత్తు సంక్షోభం నుండి రాష్ట్రాన్ని కాపాడారు.
థర్మల్ విద్యుత్తు కేంద్రాల డిజైన్లను మార్చడంద్వారా ఈ రంగంలో పెద్ద విప్లవమే తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ డిజైన్లు దేశానికంతటికీ ఆదర్శమయ్యాయి. విజయవాడ లో థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటులో విశ్హేషమైన కృషి చేసారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం, దిగువ సీలేరు లలో జల విద్యుత్తు ఉత్పాదక సామర్ధ్యము పెంచడంలో ప్రముఖ పాత్ర వహించాడు.[1]
రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వడాన్ని నార్ల తాతారావు గట్టిగా సమర్థించాడు. పేదలకు తక్కువ ధరకే విద్యుత్తు అందజేయాలనేది ఆయన లక్ష్యం. విద్యుత్తుతో వ్యాపారం చేయవద్దనేది ఆయన నినాదం.
నార్ల తాతారావు 2007 ఏప్రిల్ 7న హైదరాబాద్ నగరంలో గుండెపోటుతో మరణించాడు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు తాతారావుకు సోదరుడు.
వీరు విద్యుత్తు రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా విజయవాడ థర్మల్ విద్యుత్తు కేంద్రం కు డాక్టర్ నార్ల తాతా రావు థర్మల్ విద్యుత్తు కేంద్రం గా నామకరణం చేసారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.