కానూ సన్యాల్, (1932[1] 23 మార్చి 2010),[2] కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. నక్సల్బరీ ఉద్యమంలో ముక్యమైన నాయకుడు. 1969లో స్థాపించబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) కు వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[3] అతను 2010 మార్చి 23న ఆత్మహత్య చేసుకున్నాడు.[4]

త్వరిత వాస్తవాలు కానూ సన్యాల్, జననం ...
కానూ సన్యాల్
Thumb
కానూ సన్యాల్
జననం
కృష్ణకుమార్ సన్యాల్

1932
మరణం2010 మార్చి 23(2010-03-23) (వయసు 77–78)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సి.పి.ఐ (ఎం.ఎల్) నాయకుడు
రాజకీయ పార్టీసి.పి.ఐ (ఎం.ఎల్)
సి.పి.ఐ (మార్క్సిస్టు)
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
మూసివేయి

జీవిత విశేషాలు

కానూ సన్యాల్ 1932లో జన్మించాడు. చిన్న వయసులోనే కమ్యూనిస్టు రాజకీయాలవైపు వచ్చారు. ఆనాడు సిపిఎం పార్టీ ఆయనను డార్జిలింగ్‌ జిల్లాకు ఆర్గనైజర్‌గా పంపింది. టీ తోటల కార్మికులనూ ఆదివాసులనూ పోరాటాలలోకి ఆర్గనైజ్‌ చేశాడు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలనూ, టీ తోట కార్మికుల హక్కుల కొరకు అనేక పోరాటాలను నిర్వహించాడు. 1967లో భూస్వాములకు వ్యతిరేకంగా ఈ ప్రాంత కార్మికులు, రైతాంగం కలిసి భూమి పంపకాన్ని చేపట్టారు. ఆనాటి ఐక్యసంఘటనా ప్రభుత్వం పాశవికంగా తుపాకీ కాల్పులు జరిపి 8 మందిని హతమార్చింది. ఇదే నక్సల్బరీ ఉద్యమంగా ప్రసిద్ధిచెందింది. ఐక్యసంఘటన ప్రభుత్వంలో సిపిఎం భాగస్వామిగా ఉండటంతో అది తీవ్ర ఆంతరంగిక చర్చకు దారితీసి దేశవ్యాపితంగా సిపిఎం నుండి కమ్యూనిస్టు విప్లవకారులు విడివడ్డారు. [5]

సి.పి.ఐ (ఎం.ఎల్) స్థాపన, అభివృద్ధి

కానూ సన్యాల్ కమ్యూనిస్టు రాజకీయాలలోకి మొట్టమొదట సి.పి.ఐ సభ్యునిగా చేరాడు. తరువాత సి.పి.ఐ (ఎం) లోకి చేరాడు. తరువాత అతను సి.పి.ఐ (ఎం.ఎల్) కు నాయకునిగా తన సేవలనందించాడు. అతను అసలైన సి.పి.ఐ (ఎం.ఎల్) పార్టీ ప్రారంభాన్ని 1969లో వ్లాదిమిర్ లెనిల్ పుట్టినరోజున కలకత్తాలో జరిగిన ప్రజా ర్యాలీలో ప్రకటించాడు. సాయుధ పోరాటం ద్వారా విప్లవాన్ని సాధించడానికి 1969 సిపిఐ (ఎంఎల్)ను స్థాపించిన వారిలో ఆయన ఒకరు. నక్సల్బరీ ఉద్యమ నేత చారు మజుందార్ కు ఆయన సమకాలికుడు.[6][7]

కానూ సన్యాల్ 1970 ఆగస్టులో ఆరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు నిరసనగా పెద్ద యెత్తున హింస చెలరేగింది. పార్వతీపురం కుట్ర కేసులో ఆయన ఏడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జైలులో ఉన్నారు.[8] ఆయన 1977 లో జైలు నుంచి విడుదలయ్యారు. 1985లో సన్యాల్ ఐదు నక్సల్స్ గ్రూపులతో కలిసి కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) ను ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయే సమయానికి న్యూసిపిఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.

పార్వతీపురం కుట్ర కేసులో అతను మొదటి ముద్దాయి. ఈ కేసులోనే ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో ఏడేళ్ళు మగ్గారు. జైలు జీవితంలోనే ఆయన తన సైద్ధాంతిక దృక్పధంనుండి బయటపడడంతో, జ్యోతిబసు చొరవకూడా తోడై విడుదల చేయబడ్డాడు. [9]

సిపిఐ(ఎంఎల్) ఆవిర్భావం

1967 జూలై 5 వ తేదీన సాయుధ పోరాట నాయకులను లొంగిపోవాలని ప్రభుత్వం కోరింది. ఆగస్టు నెలాఖరుకల్లా వేలాది మంది సాయుధపోరాట యోధులు అరెస్టయ్యారు. కానూ సన్యాల్, చారు ముజుందార్, విశ్వనాథ్ ముఖర్జీ లాంటి ముఖ్య నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పశ్చిమ దినాజ్ పూర్, జల్పాయిగురి లాంటి చుట్టుపక్కల జిల్లాల్లో తలదాచుకున్నారు. రెండేళ్ళ తరువాత 1969 మేడే రోజున కోల్ కతాలోని ఆక్టర్ లూనీ స్మారక చిహ్నం దగ్గర జరిగిన అతిపెద్ద మేడే ర్యాలీలో కానూ సన్యాల్ చరిత్రాత్మక ప్రకటన చేశాడు. అదే దేశంలో మూడో వామపక్ష పార్టీ సిపిఐ(ఎంఎల్)ను స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు (దీనినే ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పేరు మార్చారు). [10]

సి.ఓ.ఐ (ఎం) ఆవిర్భావం

1985లో అతను తన గ్రూపుతో పాటు ఐదు గ్రూపులను "కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)" లో విలీనం చేసాడు. ఆ వర్గానికి నాయకుడయ్యాడు.[11]

తరువాత సంవత్సరాలు

డార్జిలింగ్ పరిసరాల్లో తేయాకు తోటల కార్మికులు, ఆదివాసీల హక్కుల కోసం కానూ సన్యాల్ పోరాటం చేసాడు. 2006 తరువాత సింగూరు రైతులు భూపోరాటంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. [12] నక్సల్బరీ ఉద్యమానికి ముందు సిపిఐ, సిపిఎంలలో ఆయన ఆ ప్రాంతంలో కీలక నాయకునిగా ఎదిగారు. వ్యక్తిగత హింసావాదాన్ని వ్యతిరేకించిన కానూ సన్యాల్‌ చారుమజుందార్‌తో తెగతెంపులు చేసుకున్నాడు. కానూ సన్యాల్‌ 2008లో పక్షవాతం వచ్చినప్పటి నుండీ నక్సల్బరీ గ్రామం హధీఘీషాల్‌లో వుంటూ కార్యకలాపాలు సాగించాడు.

మరణం

2010 మార్చి 23న పశ్చిమ బెంగాల్లోలి సిలిగురి కి 25 కి.మీ దూరంలో ఉన్న సెఫ్టుల్లాజోట్ లో గల తన నివాసంలో ఉరి తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. [13]

ప్రసిద్ధ సంస్కృతిలో

సన్యాల్, నక్సలైట్ ఉద్యమంలో అతని పాత్రలను 2013 లో జుంపా లహరి తన "ద లోలాండ్" నవలలో వివరించింది. [14]

మూలాలు

బయటి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.