కడలూర్ జిల్లా, (తమిళం: கடலூர் மாவட்டம்) తమిళనాడు జిల్లాలలో ఒకటి. కడలూర్ నగరం జిల్లాకు ప్రధానకేంద్రంగా ఉంది. జిల్లాలోని మరుంగూర్ గ్రామంలో పురాతన సమాధుల త్రవ్వకాలలో మొదటిసారిగా సా.శ..పూ 1వ శతాబ్ధానికి చెందిన భ్రాహ్మీ భాషాకు చెందిన శిలాశాసనాలు లభించాయి.

త్వరిత వాస్తవాలు కడలూరు జిల్లా கடலூர் மாவட்டம்Katalur district, దేశం ...
కడలూరు జిల్లా
கடலூர் மாவட்டம்
Katalur district
జిల్లా
Thumb
చిదంబరం, పాండిచ్చేరి మధ్య వరి పొలాలు.
Thumb
తమిళనాడు; భారతదేశం.
దేశం India
రాష్ట్రంతమిళనాడు
జిల్లాల జాబితాకడలూరు
ప్రధానకేంద్రంకడలూరు
తాలూకాలుచిదంబరం కడలూరు, కాట్టుమన్నార్ కోయిల్, బంరూట్టి, Titakudi, విరుదాచలం,
Government
  కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్క్రిలాష్ కుమార్ ఐ.ఎ.ఎస్
జనాభా
 (2011)[1]
  Total22,85,395
  జనసాంద్రత702/కి.మీ2 (1,820/చ. మై.)
భాషలు
  అధికారికతమిళం ఆంగ్లం
Time zoneUTC+5:30 (భారతీయ కాలప్రమాణం.)
పోస్టల్ పింకోడ్
607xxx
టెలిఫోన్ కోడ్91 04142
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationTN 31 [2]
అతిపెద్ద నగరంకడలూరు
సమీపనగరంపాండిచేరి (నగరం), చెన్నై
మానవలింగ నిష్పత్తి984 /
అక్షరాస్యత79.04%%
Legislature typeelected
అసెంబ్లీ నియోజకవర్గంకడలూరు
సరాసరి వేసవి ఉష్ణోగ్రత41 °C (106 °F)
సరాసరి శీతాకాల ఉష్ణోగ్రత20 °C (68 °F)
మూసివేయి

భౌగోళికం

కడలూరు జిల్లా వైశాల్యం 3,564 చదరపు కిలోమీటర్లు. కడలూరు జిల్లాకు ఉత్తరదిశలో విళుపురంజిల్లా, తూర్పున బంగాళాఖాతం, దక్షిణదిశలో నాగపట్టణంజిల్లా అలాగే పడమర దిశలో పెరంబలూర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

గణాంకాలు

మరింత సమాచారం సంవత్సరం, జనాభా ...
సంవత్సరంజనాభా±% p.a.
19018,68,748    
19119,74,673+1.16%
19219,57,148−0.18%
193110,12,603+0.56%
194110,76,237+0.61%
195111,45,551+0.63%
196113,00,513+1.28%
197115,69,323+1.90%
198118,27,917+1.54%
199121,22,759+1.51%
200122,85,395+0.74%
201126,05,914+1.32%
source:[3]
మూసివేయి
మరింత సమాచారం మతాలు ప్రకారం కడలూరు జిల్లా జనాభా (2011) ...
మతాలు ప్రకారం కడలూరు జిల్లా జనాభా (2011)[4]
మతం శాతం
హిందూ
 
91.78%
ముస్లిం
 
4.75%
క్రైస్తవలు
 
3.20%
ఇతరులు
 
0%
మూసివేయి

2011 భారత జనాభా గణాంకాలను అనుసరించి కడలూరు జిల్లా జనసంఖ్య 2,600,880.[5] జనసంఖ్యా పరంగా కడలూరు దాదాపు కువైత్ జనసంఖ్యకు[6] లేక అమెరికా లోని నెవాడాకు సమానంగా ఉంది..[7] భారతదేశంలోని 640 జిల్లాలలో కడలూరు జనసంఖ్యాపరంగా 158వ స్థానంలో ఉంది.[5] కడలూరు జిల్లా జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు 702.[5]

2001-2011 మధ్య కడలూరు జిల్లా జనసంఖ్య 13.8% వృద్ధిచెందింది.[5] కడలూరు జిల్లా లోని స్త్రీపురుష నిష్పత్తి 984:1000.,[5] అలాగే నగరప్రాంత అక్షరాస్యత శాతం 79.04%.[5] 2001లో జిల్లా జనసంఖ్య 22,85,395 ఉంది. జిల్లా 33.01% నగరీకరణ చేయబడి ఉంది. [8] జిల్లా అక్షరాస్యత 71.85%. కడలూరు జిల్లా అక్షరాస్యత రాష్ట్ర అక్షరాస్యత కంటే తక్కువ ఉంది.

ఆర్ధికం

2006లో పంచాయితీ మంత్రిత్వశాఖ 640 భారతదేశ జిల్లాలలో 250 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగాగుర్తించింది. వీటిలో కడలూరు జిల్లా ఒకటి.[9] అలాగే 30 తమిళనాడు జిల్లాలలో 6 జిల్లాలను వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించబడిన " బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ " (బి.ఆర్.జి.ఎఫ్) నుండి కడలూరు జిల్లాకు నిధులు అందుతున్నాయి.[9]

వ్యవసాయం

కడలూరు జిల్లా పనస, జీడిపప్పు పంటలకు ప్రసిద్ధిచెందింది.


విభాగాలు

కడలూర్ జిల్లాలో 7 తాలూకాలు, 13 తాలూకాలు, 5 పురపాలికలు, 18 పంచాయితీలు ఉన్నాయి.

తాలూకాలు

  • కడలూరు పట్టణం
  • చిదంబరం పట్టణం
  • బరూట్టి పట్టణం
  • విరుదునగర్ పట్టణం
  • నైవేలీ, వడలూరు
  • నెల్లిపాక్కం
  • మేల్ పట్టంబాక్కం
  • సేదియతోప్
  • కట్టుమన్నార్ కోయిల్

పర్యాటక ఆకర్షణలు

  • పిచ్చవరం: ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులలో ఒకటి
  • సిల్వర్ బీచ్: దేవనాంపట్నం (కడలూరు)
  • వీరనం సరస్స: కట్టుమన్నార్ కోయిల్
  • మెరైన్ బయాలజీ, పరంగిపేట్టాయ్, చిదంబరం తాలూకా
  • సామియార్‌పేట్టాయ్ బీచ్, పరంగిపేట్టాయ్ సమీపంలో, చిదంబరం తాలూకా
  • పాటలీశ్వర దేవాలయం:7వ శతాబ్దంలో నిర్మించబడిన హిందూ దేవాలయం.ఇది కడలూరులో అత్యంత ప్రముఖమైంది. తిరుపతిపులియూర్ అనే పేరు ఈ ఆలయం వెనుక ఉన్న పురాణంతో ముడిపడి ఉంది. 7వ శతాబ్దానికి చెందిన శైవ సాధువులు తిరుజ్ఞానసంబందర్ తేవారంలో వారి రచనలలో ఈ ఆలయం గురించి వివరించారు.
  • చిదంబరం నటరాజ ఆలయం
  • దేవనాథస్వామి ఆలయం:తిరువంతిపురంలో ఉన్న కడలూరు శివార్లలో ఉన్న మరొక హిందూ పుణ్యక్షేత్రం.
  • వీరట్టనేశ్వర ఆలయం: పన్రుటి
  • శ్రీ బూవరాహ స్వామి ఆలయం, శ్రీ నీతీశ్వర ఆలయం, శ్రీముష్ణం ఆలయాలు

మూలాలు

వెలుపలి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.