భారత్‌లో 2013 లో నిర్మించిన విమాన వాహక నౌక From Wikipedia, the free encyclopedia
class="infobox" style="width:25.5em;border-spacing:2px;"
INS విక్రాంత్
| |
History | |
---|---|
India | |
పేరు: | విక్రాంత్ |
Namesake: | Vikrant (1961) |
ఆపరేటరు: | భారత నావికా దళం |
Ordered: | 2004 |
నిర్మాణ సంస్థ: | కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ |
వెల: | ₹23,000 crore (US$2.9 billion)[1][2] |
నిర్మాణం మొదలైనది: | 2009 ఫిబ్రవరి 28 |
జలప్రవేశం: | 2013 ఆగస్టు 12 |
సేకరించినది: | 2022 జూలై 28[3] |
కమిషనైనది: | 2022 సెప్టెంబరు 2 |
Homeport: | INS కదంబ, కార్వార్ |
Identification: | పెన్నంట్ సంఖ్య: R11 |
Motto: |
|
మారుపేర్లు: | IAC-1 |
స్థితి: | సేవలో ఉంది[4][5] |
Badge: | |
సాధారణ లక్షణాలు | |
తరగతి, రకం: | విక్రాంత్-class విమాన వాహక నౌక |
డిస్‌ప్లేస్‌మెంటు: |
|
పొడవు: | 265 మీ. (869 అ.) |
బీమ్: | 62 మీ. (203 అ.) |
ఎత్తు: | 59 మీ. (194 అ.)[7] |
డ్రాట్: | 8.4 మీ. (28 అ.) |
లోతు: | 25.6 మీ. (84 అ.) |
డెక్‌లు: | 14 |
స్థాపిత సామర్థ్యం: |
|
ప్రొపల్షన్: | రెండు షాఫ్టులు |
వేఘం: | 30 kn (56 km/h; 35 mph)[9] |
పరిధి: | 8,000 nmi (15,000 కి.మీ.; 9,200 మై.)[10] |
సిబ్బంది: | 196 officers, 1,449 sailors (including air crew)[11] |
సెన్సార్లు, ప్రాసెసింగ్ వ్యవస్థలు: |
|
ఎలక్ట్రానిక్ యుద్ధ & డికాయ్‌లు: | |
ఆయుధాలు: | |
విమానాలు: | |
వైమానిక సౌకర్యాలు: | 12,500 m2 flight deck[21] |
ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ భారత్ దేశీయంగా నిర్మిస్తున్న తొట్ట తొలి విమాన వాహక నౌక. విక్రాంత్ వాహక నౌకల తరగతికి చెందిన తొలినౌక ఇది. కొచ్చిన్ షిప్‌యార్డ్ ఈ నౌకను నిర్మిస్తోంది. ఈ నౌక జయమ్ సమ్ యుద్ధి స్పర్ధః అనే ఋగ్వేద శ్లోకాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. నన్ను ఎదుర్కొనేవారిని ఓడిస్తాను అని దీనర్థం.
1999 లో నౌక డిజైను మొదలైంది. 2009 ఫిబ్రవరి 28 న నౌక వెన్నుగాడి వేసారు. 2011 డిసెంబరు 29 న నౌక డ్రైడాక్ నుండి బయటికి నడిచింది.[22] 2015 లో నౌకను లాంచ్ చేసారు. ప్రస్తుతం నౌకలో అంతర్భాగాలు, యంత్ర సామాగ్రి మొదలైన వాటిని అమరుస్తున్నారు. ఇది 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.[23] అయితే నౌకాదళం మాత్రం 2018 నాటికి నౌకను పాక్షికంగా కమిషను చెయ్యవచ్చని భావిస్తోంది. నౌక నిర్మాణ ఖర్చు పెరిగి 2014 నాటికి రూ.19,341 కోట్లకు చేరింది.[24]
ఇదే తరగతిలో రెండో నౌకను నిర్మించేందుకు కొచ్చిన్ షిప్‌యార్డు ప్రతిపాదించినప్పటికీ, నౌకాదళం మాత్రం దీనికంటే పెద్దదైన అణుచోదిత వాహక నౌక నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.[24]
ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ 262 మీ. పొడవు, 60 మీ. వెడల్పుతో 40,000 టన్నుల బరువుంటుంది. దీనిలో స్కీ జంప్‌తో పాటు, షార్ట్ టేకాఫ్ బట్ అరెస్టెడ్ రికవరీ (STOBAR) వ్యవస్థ ఉంటుంది.[25] మిగ్-29K విమానాలు ఎగరగలిగేలా దీని డెక్ ఉంటుంది. 30 విమానాలను మోసుకెళ్ళగలదు. వీటిలో 24–26 వరకు విమానాలు.[26] (ప్రధానంగా మిగ్-29K) కాగా, 10 వరకు కమోవ్ Ka-31 గానీ, వెస్ట్‌లాండ్ సీకింగ్ గానీ హెలికాప్టర్లుంటాయి. తేజస్ మార్క్-2 నౌకాదళ రూపాన్ని మితిమీరిన బరువు కారణంగా 2016 డిసెంబరు 2 న నౌకాదళం తిరస్కరించింది.[27] Ka-31 ఆకాశ నిఘాను నిర్వహించగలదు. సీకింగులు జలాంతర్గామి ఛేదక శక్తిని సమకూర్చుతాయి.[28][29]
విక్రాంత్‌లో 80 మెగావాట్ల సామర్థ్యం కల జనరల్ ఎలక్ట్రిక్ వారి నాలుగు LM2500+ గ్యాస్ టర్బైన్లుంటాయి. ఇవి రెండు షాఫ్టులను తిప్పుతాయి. గేరుబాక్సులను ఎలెకాన్ ఇంజనీరింగువారు సరఫరా చేసారు.[22][30][31]
విక్రాంత్ డిజైన్‌ను నేవల్ డిజైను డైరెక్టొరేట్ చెయ్యగా, నిర్మాణంలో అనేక ప్రైవేటు సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. రష్యా AB/A రకం స్టీలును సరఫరా చెయ్యాల్సి ఉండగా, అది సమస్యల్లో పడింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా డిఫెంస్ మెటలర్జికల్ లాబొరేటరీస్ లిమిటెడ్ (DMRL), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ఆ స్టీలును భారత్‌లోనే తయారు చేసారు.[22][28] భిలాయ్, రూర్కెలాల్లోని కర్మాగారాల్లో నౌకకు అవసరమైన మూడు రకాల స్టీలును తయారుచేసారు. ఈవిధంగా విక్రాంత్ పూర్తిగా దేశీయంగా తయారైన స్టీలుతో నిర్మించిన తొలినౌకగా నిలిచింది.[32]
ప్రధాన స్విచ్ బోర్డు, స్టీరింగు గేరు, నీరు చొరరాని తలుపులను లార్సెన్ & టూబ్రో నిర్మించింది. అధిక సామర్థ్యం కల ఎయిర్ కండిషనింగు, రిఫ్రిజిరేషను వ్యవస్థలను కిర్లోస్కర్ సంస్థ తయారుచేసింది. బెస్ట్ & క్రాంప్టన్ సంస్థ పంపులను ఇచ్చింది. ప్లాట్ఫార్ం నిర్వహణ వ్యవస్థను భెల్ తయారుచెయ్యగా, ఇటలీ సంస్థ ఏవియో అమర్చుతోంది. ఎలక్ట్రికల్ కేబుళ్ళను నిక్కో సంస్థ సరఫరా చేసింది.[33]
నౌకను మాడ్యూళ్ళుగా తయారుచేసారు. నౌక దేహం 874 వివిధ బ్లాకుల కూర్పు. వెన్నుగాడి వేసేనాటికే, 8,000 టన్నుల బరువైన 423 బ్లాకులు సిద్ధమైపోయాయి.[34] నిర్మాణ ప్రణాళిక ప్రకారం 2010 నాటికి నౌకను లాంచి చెయ్యాలి. అప్పటికి నౌక బరువు 20,000 టన్నులుంటుంది. అంతకంటే బరువును తయారీ బే మొయ్యలేదు. రీఫిట్ బేలో మరో సంవత్సరపు నిర్మాణం తరువాత, నౌకను సర్వ చోదక వ్యవస్థలతో సహా లాంచి చెయ్యవచ్చని తలచారు. ఆయుధ వ్యవస్థలు, సంబంధిత వ్యవస్థలను ఆ తరువాత బిగిస్తారు. 2013 లో సముద్ర పరిఅక్షలను మొదలు పెట్టి, 2014 లో నౌకను కమిషను చెయ్యాలనేది తొలి సంకల్పం.[35][36]
2012 మార్చిలో ఎలికాన్ గేరు బాక్సులను సరఫరా చెయ్యడంలో జాప్యం జరిగింది. పొడవాటి ప్రొపెల్లరు షాఫ్టుల కారణంగా గేరుబాక్సుల డిజైనులో మార్పులు చెయ్యాల్సివచ్చిందని సంస్థ తెలిపింది.[37] ఓ డీజిలు జనరేటరులో జరిగిన ప్రమాదం వలనా, దాని ఎలైన్మెంటుతో తలెత్తిన ఇబ్బందుల వలనా కూడా ఆలస్యం జరిగింది.[38] 75% నౌక నిర్మాణం పూర్తైందని, 2011 డిసెంబరులో లాంచి చేస్తామనీ 2011 ఆగస్టులో రక్షణ శాఖ లోక్‌సభకు తెలిపింది.[39][40] 2011 డిసెంబరు 29 న 14,000 టన్నుల బరువున్న నౌక దేహాన్ని డ్రైడాక్ నుండి బయటికి తీసుకువచ్చారు.[30] 2012 మధ్య వరకు అంతర్గత పనులు చేసి, తిరిగి డ్రైడాక్‌లో నిలిపి ప్రప్ల్షన్కు సంబంధించిన పనులు చేస్తారు.[10][22]
2012 జూలైలో టైమ్స్ ఆఫ్ ఇండియాలోను,[41] నవంబరులో NDTV లోనూ వచ్చిన కథనాల ప్రకారం, నౌక నిర్మాణం ఆలస్యమవడంతో 2018 లోగానీ అది నౌకాదళంలోకి చేరదని తెలిసింది.[42]
2013 ఆగస్టు 12 న అప్పటి రక్షణ మంత్రి భార్య, ఎలిజబెత్ ఆంటోనీ నౌకను లాంచి చేసింది.[43]దీంతో నౌక నిర్మాణపు మొదటి దశ పూర్తైంది.
లాంచి సమయానికి 83% ఫ్యాబ్రికేషను పని 75% నిర్మాణపు పనీ పూర్తైందని అడ్మిరల్ రాబిన్ ధోవన్ చెప్పాడు. 90% దేహము, of the 50% ప్రొపల్షన్ వ్యవస్థ, 30% ఆయుధ వ్యవస్థ దేశీయంగా డైజైను చేసి తయారుచేసామని కూడా ఆయ్న చెప్పాడు.[44] నౌకను తిరిగి డ్క్లో చేర్చి, రెండవ దశ నిర్మాణం మొదలుపెట్టారు. ఈ దశలో వివిధ ఆయుధాలు, సెన్సర్లు, ప్రొపల్షను వ్యవస్థలనూ అమర్చుతారు. ప్లైట్ డెక్ ను విమాన కేంద్రంతో అనుసంధానం చేస్తారు.[33] విక్రాంత్‌ను 2018 లో కమిషను చేస్తారని 2014 డిసెంబరులో వార్తలు వెలువడ్డాయి.
దేహ నిర్మాణ పనులు పూర్తయ్యాక, 2015 జూన్‌లో విక్రాంత్‌ను డాక్ నుండి బయటికి తెచ్చారు, కేబుళ్ళు, పైపులైనులు, వెంటిలేషను మొదలైన పనులు 2017 నాటికి పూర్తౌతాయి. ఆ తరువాత సముద్ర పరీక్షలు మొదలౌతాయి.[45] 2015 అక్టోబరు నాటికి ఫ్లైట్ డెక్ పనులు జరుగుతున్నాయి.[46] 2016 జనవరి నాటికి యంతర్ సామాగ్రి, పైపులైన్లు, ప్రొపెల్లరు షాఫ్టుల స్థాపన జరుగుతోంది. నౌక ఏవియేషను వ్యవస్థలోని యంత్ర భాగాలను సరఫరా చెయ్యడంలో రష్యావైపున జాప్యం జరుగుతోందని తెలియవచ్చింది.[47]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.