మొగలిగుండ్ల బాగారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]

త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
ఎం.బాగారెడ్డి

మాజీ ఎమ్మెల్యే , మాజీ ఎంపీ
నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 17 జూన్‌ 1930
మలిచల్మ గ్రామం , జహీరాబాద్ మండలం , మెదక్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం
మరణం 4 జూన్‌ 2004
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి యశోద రెడ్డి
సంతానం ఒక కుమార్తె , ఇద్దరు కుమారులు(మోగిలిగుండ్ల జైపాల్ రెడ్డి)
నివాసం హైదరాబాద్
మూసివేయి

జననం, విద్యాభాస్యం

ఎం.బాగారెడ్డి 17 జూన్‌ 1930లో తెలంగాణ రాష్ట్రం , మెదక్ జిల్లా , జహీరాబాద్ మండలం , మలిచల్మ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం

  1. మలిచల్మ గ్రామ సర్పంచ్‌[2]
  2. 1957 నుండి 1972 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు
  3. 1957 నుండి 1962 జహీరాబాద్‌ శాసనసభ్యుడు
  4. 1962 నుండి 1964 మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్
  5. 1962 నుండి 1967 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
  6. 1967 నుండి 1972 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
  7. 1972 నుండి 1978 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
  8. 1978 నుండి 1983 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
  9. 1978 నుండి 1983 - రాష్ట్ర పంచాయతీరాజ్, భారీ పరిశ్రమలు, రెవెన్యూ శాఖ మంత్రి [3]
  10. 1983 నుండి 1985 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
  11. 1984 - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్
  12. 1985 నుండి 1989 - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత
  13. 1985 నుండి 1989 - జహీరాబాద్‌ శాసనసభ్యుడు
  14. 1989 నుండి 1991 - మెదక్‌ లోక్‌సభ ఎంపీ
  15. 1991 నుండి 1996 - మెదక్‌ లోక్‌సభ ఎంపీ
  16. 1996 నుండి 1998 - మెదక్‌ లోక్‌సభ ఎంపీ
  17. 1998 నుండి 1999 - మెదక్‌ లోక్‌సభ ఎంపీ

ఆయన చివరిసారి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆలె నరేంద్ర చేతిలో ఓడిపోయాడు.[4][5]

మరణం

ఎం.బాగారెడ్డి 4 జూన్‌ 2004లో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ మరణించాడు.[6]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.