From Wikipedia, the free encyclopedia
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్ الدولة الإسلامية في العراق والشام (Arabic) ad-Dawlah al-Islāmīyah fil 'Irāq wa ash-Shām (transliteration) Participant in the Iraq War (2003–2011) and Insurgency (2011–present), the Syrian Civil War and its spillover, the 2014 Libyan Civil War, and the Sinai insurgency. Primary target of the 2014 military intervention against ISIL, the intervention in Iraq and Syria, as well as the Iranian and Turkish interventions, and the Global War on Terrorism | |
---|---|
జండా | |
Military situation as of 15 December 2014, in Iraq and Syria. Controlled by the Islamic State of Iraq and the Levant Controlled by al-Nusra Controlled by other Syrian rebels Controlled by Syrian government Controlled by Iraqi government
Controlled by Syrian Kurds Controlled by Iraqi Kurds Occupied by Israel Note: Syria and Iraq contain large desert areas with limited population which are mapped as under the control of forces holding roads and towns within them.Map of the current military situation in Iraq | |
Areas controlled (as of 15 December 2014) Areas in which ISIL claism to have presence or control[3] Rest of Iraq and Syria Note:This map not shows ISIL control or claim outside Iraq and Syria | |
Administrative center | Ar-Raqqah, Syria (de facto)[4][5] |
అతిపెద్ద నగరం | Mosul, Iraq |
Ideologies | Sunni Islamism Anti-Shiaism[6] Salafist Jihadism Takfirism Wahhabism |
Type | Self proclaimed Islamic state and Caliphate |
Military strength & operation areas | Inside Iraq and Syria 200,000[11][12](Kurdish claim) Outside Iraq and Syria |
నాయకులు | |
• Self proclaimed Caliph | Abu Bakr al-Baghdadi [13] |
• Field commander | Abu Omar al-Shishani[14][15][16] |
• Spokesman | Abu Muhammad al-Adnani[17][18] |
Establishment | |
• Formation (as Jamāʻat al-Tawḥīd wa-al-Jihād) | 1999[19] |
• Joined al-Qaeda | October 2004 |
• Declaration of an Islamic state in Iraq | 13 October 2006 |
• Claim of territory in the Levant | 8 April 2013 |
• Capture of Fallujah and beginning of major territorial gains | 4 January 2014 |
3 February 2014[22] | |
• Declaration of "Caliphate" | 29 June 2014 |
13 November 2014 | |
విస్తీర్ణం | |
• Estimate only of controlled areas | 32,133 కి.మీ2 (12,407 చ. మై.)[23] |
జనాభా | |
• 12 June 2014 The New York Times estimate | 8,000,000 in controlled areas[24] |
కాల విభాగం | UTC+2 and +3 (Eastern European Time and Arabia Standard Time) |
Website Al Furqan Media[25] |
ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్ ఒక తీవ్రవాద సంస్థ. మనదేశంలో దీని కార్యకలాపాలపై 2014 డిసెంబరు 16న ప్రభుత్వం నిషేధం విధించింది [26] దీన్నే ఐసిస్, అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్్ అండ్ సిరియా అనీ, క్లుప్తంగా ఐఎస్ అనీ పిలుస్తారు. అరబిక్ భాషలో దీన్ని దాయెష్ గా పేర్కొంటారు. ఐసిస్ సంస్థ ఇరాక్, సిరియాల్లో చురుకుగా పని చేస్తున్న సున్నీ తెగకు చెందిన జిహాదీ సంస్థ. ఇరాక్, సిరియాలలో సున్నీలు నివసిస్తున్న ప్రాంతాలతో పాటు లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, సైప్రస్, దక్షిణ టర్కీలకు చెందిన భూభాగంలో ఇస్లామిక్ సల్తనత్ పేరిట స్వత్రంత్ర రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఆ సంస్థ పనిి చేస్తోంది.
ఈ సంస్థ 1999 లోనే జమాత్ అల్ - తాహిద్ వల్ - జిహాద్ పేరుతో ఆవిర్భవించింది. 2003 లో అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాల సేనలు ఇరాక్ పై దురాక్రమణ జరిపినప్పుడు మరో తీవ్రవాద సంస్థ అల్ ఖైదాతో చేతులు కలిపింది. ఇరాక్ అంతటా తమ కార్యకలాపాలను విస్తరించింది. తర్వాత పలు ఇతర దేేశాలకు కూడా తమ తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించి తమను ప్రపంచ వ్యాప్త ఖలీఫేట్ గా ప్రకటించుకుుంది. అప్పటి నుంచి తమను ఐఎస్ గా పిలుచుకోవడం ప్రారంభించింది. ఖలీఫేట్ గాా తమకు ప్రపంచంలోని ముస్లింలందరిపైనా మతపరమైన, రాజకీయమైన, సైనికపరమైన ఆధిపత్యం ఉందని అది చెప్పుకుంటోంది. దానిి ఈ చర్యలన్నింటినీ ఐక్యరాజ్యసమితి సహా అనేేక దేశాల ప్రభుత్వాలు, ఇతర ప్రధాన ముస్లిం బృందాలు కూడా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నాయి.
సిరియాలో ఐఎస్ అటు ప్రభుత్వ సేనల పైనా, ఇటు ప్రభుత్వ వ్యతిరేక దళాలపైనా కూడా దాడులు జరుపుతూ వచ్చింది. 2015 డిసెంబర్ నాటికి తూర్పు సిరియా, పశ్చిమ ఇరాక్ ల్లో దాదాపు 2.8 నించీ 8 మిలియన్ల ప్రజలు నివసించే పెద్ద పెద్ద భూభాగాలను తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతాల్లో షరియా చట్టాన్ని తమకు ఇష్టం వచ్చిన రీతిలో అమలు చేసింది. ఐఎస్ తీవ్రవాద సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 18 దేేశాల్లో పని చేస్తోందని అంచనా వేశారు. అందులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మాలి, ఈజిప్టు, సోమాలియా, బంగ్లాదేశ్, ఇండోనేేషియా, ఫిలిప్పీన్స్ లు ఉన్నాయి. 2015 నాటికి ఐఎస్ తీవ్రవాద సంస్థకు ఒక బిలియన్ అమెరికా డాలర్ల దాకా వార్షిక బడ్జెట్ ఉందనీ, 30,000 మంది దాకా దళాలు ఉన్నాయనీ లెక్క గట్టారు.
పాశ్చాత్య దళాలు, ఇరాకీ సైన్యాల దాడుల కారణంగా 2017 జులై నాటికి ఐఎస్ ఇరాక్ లోని అతి పెద్ద నగరమైన మోసుల్ పై తమ పట్టును కోల్పోయింది. ఈ భారీ ఓటమి తర్వాత ఐఎస్ మిగిలిన దేశాల్లో కూడా అనేక భూభాగాల మీద తమ పట్టును కోల్పోతూ వచ్చింది. 2017 నవంబర్ నాటికి దాని ఆధిపత్యం కింద దాదాపు ఏ ప్రాంతమూ లేకుండా పోయింది. ఆ ఏడాది డిసెంబరు నాటికి ఐఎస్ బృందం చేతిలో అది గతంలో ఆధిపత్యం వహించిన దాంట్లో రెండో వంతు భూభాగం కూడా మిగలలేదని అమెరికా తదితర దేశాల సైనిక నిఘా వర్గాలు విశ్లేషించాయి. 2017 డిసెంబర్ 10 వ తేదీన ఇరాక్ ప్రధానమంత్రి హైదర్ అల్ అబదీ ఐఎస్ ను తమ సైనిక దళాలు దేశంలోంచి పూర్తిగా తరిమి కొట్టాయని ప్రకటించారు. సరిగ్గా అంతకు మూడేళ్ల ముందు, అంటేే 2014 లో ఐఎస్ ఇరాక్ లో మూడో వంతు భూభాగాన్ని ఆక్రమించుకుని ఉంది. 2019 మార్చి నాటికి ఐఎస్ ఇరాక్ లో తమ చేతిలో మిగిలిన చిట్టచివరి భూభాగాన్ని కూడా కోల్పోయింది.
ఇస్లామిక్ స్టేట్ సలాఫీ లేదా వహాబీ సిద్ధాంతాన్ని పాటించే బృందం. సున్నీ ఇస్లాంలో కఠినమైన, ఛాందసవాద భావాలను ఇది అనుసరిస్తుంది. ఇది మతపరమైన హింసాకాండను ప్రోత్సహిస్తుంది. తొలి రోజుల నాటి ఇస్లాంను ఇది పాటిస్తుందని విశ్లేషకులు భావిస్తారు. ఐఎస్ ఇంకా జిహాదీ సూత్రాలను కూూడా అనుసరిస్తుంది. అల్ ఖైదా వంటి ఇతర ఆధునిక జిహాదీ బృందాల మాదిరిగానే కఠినమైన ఛాందసవాదాన్ని పాటిస్తుంది. ఈ బృందం అధీనంలో ఉన్న పాఠశాలల్లో సౌదీ అరేబియా నుంచి తెెచ్చి న వహాబీ మతగ్రంధాలలోని మత విషయాలు నేర్పిస్తారు. మొత్తం మీద ఇస్లాంలోని ఆధునిక మార్పులన్నింటిినీ తృణీకరించి తొలి రోజుల నాటి సిద్ధాంతాలనే పాటించాలని ఈ బృందం విశ్వసిస్తుంది. అప్పటి శుద్ధ ఇస్లాంను, ఖలీఫేట్ పద్ధతిలో నడిచిన మత విశ్వాసాలను ఒట్టోమాన్ సామ్రాజ్యం వదిలిపెట్టిి పక్క దారులు పట్టిందని ఐఎస్ విమర్శిస్తుంది. జిహాద్ సమయాల్లో తమ వంటి శుద్ధ బృందాలకే నాయకత్వం వహించే హక్కు ఉంటుందనీ, పాలస్తీనా లోని హమస్ వంటి ఆధునిక బృందాలకు ఉండదనీ ఐఎస్ భావిస్తుంది.
2004 నించీ ఐఎస్ బృందం ప్రధాన లక్ష్యం ఒకటే. సున్నీ ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యం అది. అంటే ఒక ఖలీఫా, ఆయన కింద పలువురు మతప్రముఖుల ఆధిపత్యం గల ఖలీఫేట్ ను రూపొందించాలని ఆశయంతో ఈ బృందం పని చేస్తోంది. 2014 జూన్ 29న అల్ బాగ్దాదీని తమ ఖలీఫ్ గా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఏకం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. తమ జెండాను తూర్పు, పశ్చిమ ప్రాంతాలన్నింటిలోనూ స్థాపిస్తామని పేర్కొన్నారు. ప్రపంచాన్నంతటినీ తమ ఆధిపత్యం కిందికి తెచ్చుకోవాలనేది కూడా దీని లక్ష్యం. అందుకోసం మొదట ముస్లిం ప్రాంతాలను, తర్వాత ముస్లిమేతర ప్రాంతాలను ఆక్రమించాలని ఆశిస్తోంది.
పై లక్ష్యాల సాధన కోసం సిరియా ఉత్తర ప్రాంతాన్ని, తర్వాత ఇరాక్ లో పలు ప్రాంతాలను ఆక్రమించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఒక్క 2017 లోనే జూన్ 6న టెహ్రాన్ లోనూ, మే 22న యుకెలోని మాంచెస్టర్ లోనూ, జూన్ 3న లండన్ లోనూ జరిగిన తీవ్రవాద దాడులు తాము జరిపినవేనని ప్రకటించింది. సిరియా, ఇరాక్ ల్లో తరచుగా ప్రభుత్వ, పాశ్చాత్య దళాలు రెండింటికీ వ్యతిరేకంగా బాంబు దాడులు తదితరాలు జరుపుతూ వచ్చింది. పలువురు పాశ్చాత్య, ఇతర దేశాలకు చెందిన సైనికులు, పాత్రికేయులు, సహాయక కార్యక్రమాలు నిర్వహించేవారు, తదితరుల తలలు నరికి ఆ వీడియోలను అంతర్జాతీయంగా విడుదల చేయడం ద్వారా భయభ్రాంతులు సృష్టించింది.
ఐఎస్ బృందానికి నాయకుడిగా అబు బకర్ అల్ - బాగ్దాదీ వ్యవహరిస్తున్నాడు. ఆ బృందం ఆయనను ఖలీఫాగా భావిస్తుంది. ఇతన్ని వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలో అమెరికా సేనలు , సైనిక శునకాలు వెంబడించగా రహస్య సొరంగ మార్గం ద్వారా భూగృహంలో (బంకర్) తన శరీరానికున్న బాంబుల జాకెట్‌ను పేల్చుకుని 2019 అక్టోబరు 27 న చనిపోయాడు.[27] ఆయన కింద ఇద్దరు ప్రధాన ఉపనాయకులు ఉండేవారు. ఇరాక్ లో అబు ముస్లిం అల్ - తుర్కమనీ, సిరియాలో అబు అలీ అల్ - అన్బరీ. వీరు కాక పలువురు ఇతర నాయకులు అల్ బాగ్దాదీకి ఆర్థిక, సైనిక, నాయకత్వ, చట్టపరమైన అంశాల్లో సలహాలిచ్చేందుకు కృషి చేస్తారు. వారి కింద వివిధ మండళ్లు, స్థానిక నాయకులు ఉన్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఐఎస్ లోని నాయకులందరూ దాదాపుగా గతంలో ఇరాక్ లో సైనిక, నిఘా విభాగాల్లో పని చేసిన వారే. ముఖ్యంగా చాలా మటుకు సద్దాం హుసేన్ పాలనలో ఆయన నాయకత్వంలోని బాత్ పార్టీ ప్రభుత్వం కింద పని చేసిన వారే. ఆయన ప్రభుత్వాన్ని పాశ్చాత్య దేశాలు పడగొట్టిన తర్వాత వారంతా ఇలాంటి కార్యక్రమాల వైపు మళ్లి చివరకు ఐఎస్ లోకి చేరుకున్నారు. అందుకే పశ్చిమ దేశాలు ఇరాక్ పై దురాక్రమణ జరపకపోతే ఐఎస్ బృందం ఏర్పడి ఉండేదే కాదని అమెరికాలోని పలువురు విశ్లేషకులు, తీవ్రవాద వ్యతిరేక సంస్థల్లో నిపుణులు (డేవిడ్ కిల్ కులన్ వంటి వారు) పేర్కొన్నారు. ఇరాక్ వారితో పాటు సిరియాకు చెందిన పలువురు నాయకులు కూడా ఐఎస్ లో ఉన్నారు. స్థానిక సున్నీలు ఉండడం వల్ల అక్కడ తమ పోరాటం ఎక్కువ కష్టం లేకుండా జరుగుతుందని భావించిన ఐఎస్ నాయకత్వం స్థానిక నాయకులనే ఎక్కువగా ఆయా పదవుల్లో నియమించింది. ఐఎస్ లో వివిధ స్థాయిలు గల నిఘా/గూఢచార వ్యవస్థ కూడా ఉందనీ, అది 2014 నించీ పని చేస్తోందనీ 2016 ఆగస్టులో వెలువడిన పలు మీడియా వార్తలు వెల్లడించాయి. దీనికి సిరియాకు చెందిన సీనియర్ ఐఎస్ నాయకుడు అబు మహమ్మద్ అల్ - అద్నానీ నాయకత్వం వహిస్తున్నాడు.
2014 లో ఐఎస్ ఆధిపత్యం కింద గల ప్రాంతాల్లో ఎనిమిది మిలియన్ల మంది సామాన్య ప్రజలు నివసిస్తున్నట్టు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక లెక్కగట్టింది. వీరిని తమ కఠిన నియంత్రణ కింద ఐఎస్ ఉంచుతుందనీ, తమ మాట పాటించే వారికే వివిధ సేవలు అందేలా చూస్తుందనీ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమీషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ప్రజలు ఐఎస్ అనుసరించే షరియా చట్టాన్ని పాటించి తీరాలి.
ఐఎస్ కింద రెండు లక్షల మంది దాకా సైనికులున్నారనీ, అందులో సగం మంది విదేశీయులేననీ (ఇరాక్, సిరియా వారు కాకుండా) 2015 లో అంచనా వేశారు. దాదాపు 80 దేశాలకి చెందిన పదిహేను వేల మంది సైనికులు ఐఎస్ లో ఉన్నారని 2014 నవంబర్ లో ఐక్యరాజ్యసమితి లెక్క గట్టగా, 2015 ఫిబ్రవరి నాటికి 20,000 మంది విదేశీ సైనికులున్నారనీ, అందులో 3,400 మంది పాశ్చాత్యులనీ అమెరికా నిఘా వర్గాలు లెక్క గట్టాయి. 2015 సెప్టెంబర్ నాటికి ఐఎస్ లో 30,000 మంది విదేశీ దళాలు ఉన్నాయని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ అంచనా వేసింది. విదేశీ సైనికులకు తిండీ బట్టా ఇవ్వడం తప్ప వేతనాలేవీ ఇవ్వరనీ, సిరియా సైనికులకు మాత్రం జీతాలిస్తారనీ గతంలో ఐఎస్ లో సీనియర్ నాయకుడైన అబు హజ్జర్ ఒకసారి వెల్లడించాడు.
ఐఎస్ ప్రధానంగా సాంప్రదాయ ఆయుధాలనే ఉపయోగిస్తుంది. సద్దాం హుసేన్ పాలనా కాలంలో ఇరాక్ లో ఆయన హయాంలో పోగేసిన ఆయుధాలనే ఈ బృందం చాలా వరకూ ఉపయోగిస్తూ వస్తోంది. అప్పట్లో స్వాధీనం చేసుకున్న తుపాకులు, కొన్ని విమానాలు తదితరాలను, వాటితో పాటు సిరియాలో అంతర్యుద్ధంలో ఇరు పక్షాలు వాడే ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుని ఉపయోగిస్తోంది. ట్రక్కు కారు బాంబులు, ఆత్మాహుతి బాంబర్లను కూడా ఈ బృందం ఉపయోగిస్తుంది. ఒకటి రెండు సార్లు రసాయన ఆయుధాలను కూడా ఉపయోగించినట్టు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఐఎస్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నించి తమ బృందంలోకి కొత్త సభ్యులని చేర్చుకుంటూ వచ్చింది. జిహాద్ లేదా పవిత్ర యుద్ధం పేరుతో వీరిని ఆకర్షించి సైనికులుగానూ, ఇతర పలు స్థాయుల్లోనూ చేర్చుకుంటుంది. ఈ సైనికులని ముజాహిదీన్ గా పిలుస్తారు. నర్సులు గానూ, వంట వారిగానూ, ప్రధమ చికిత్స తదితరాల కోసం మహిళలని కూడా ఐఎస్ చేర్చుకుంటుంది. ఐఎస్ లోని విదేశీ పాశ్చాత్య దళాలలో పది శాతం మంది పాశ్చాత్య మహిళలు ఉన్నారని 2015లో అంచనా వేశారు.
ఐఎస్ తమ బృందం గురించిన ప్రచారం కోసం వీడియోలు, సీడీలు, డీవీడీలు, పోస్టర్లు, పాంప్లెట్లు తదితరాలను ఉపయోగించడంతో పాటు ఇంటర్నెట్ ఆధారంగా కూడా ప్రచారం చేస్తుంది. కొన్ని టీవీ ఛానెళ్ల ద్వారా తమ అధికారిక ప్రకటనలుు కూడా విడుదల చేస్తుందిి. 2014 లో పాాశ్చాత్యదేశాల్లో వారికిి తమ వార్తలు ప్రసారంం చేసేందుకు అల్ హయత్ మీడియా కేంద్రం పేరిట ఒక ప్రాపగాండా యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. దాని ద్వారా 23 భాషల్లో ప్రసారాలుు చేసిందిి. 2014 జుులైలో దబీక్్ పేరిట డిజిటల్ పత్రికనుు ప్రారంభించింది. అది ఇంగ్లీషు తో సహా పలు భాాషల్లో ముద్రించింది. తర్వాత మరిన్ని రకాలుగా కూడ ప్రచారాలుు చేసిింది. ఇవే కాకుండా సోషల్ మీీడియాలో కూడా తమ సిద్ధాంతాల గురించి ప్రచాారం చేసి యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేేసింది.
ఐఎస్ బృందానికి ప్రధానంగా అయిదు మార్గాల గుండా ఆదాయం లభించిందని 2015 లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.