అమెరికన్ సినిమా నటి From Wikipedia, the free encyclopedia
ఇటాలియా పెన్నినో కొప్పోలా (1912, డిసెంబరు 12 - 2004, జనవరి 21) అమెరికన్ సినిమా నటి.[1] ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా తీసిన వన్ ఫ్రమ్ ది హార్ట్, ది గాడ్ ఫాదర్ పార్ట్ II, ది గాడ్ ఫాదర్ పార్ట్ III వంటి సినిమాలలో నటించింది.[2] వంటకు ప్రసిద్ధి చెందిన ఇటాలియన్, మామా కొప్పోలాస్ పాస్తా బుక్ అనే వంట పుస్తకాన్ని కూడా ప్రచురించింది.[3][4]
ఇటాలియా కొప్పోలా | |
---|---|
జననం | ఇటాలియా పెన్నినో కొప్పోలా 1912 డిసెంబరు 12 న్యూయార్క్ , యుఎస్ |
మరణం | 2004 జనవరి 21 91) లాస్ ఏంజలెస్, కాలిఫోర్నియా, యుఎస్ | (వయసు
సమాధి స్థలం | శాన్ ఫెర్నాండో మిషన్ స్మశానవాటిక |
జీవిత భాగస్వామి | కార్మైన్ కొప్పోలా |
పిల్లలు | ఆగస్ట్ కొప్పోలా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా తాలియా షైర్ |
ఇటాలియా కొప్పోలా 1912, డిసెంబరు 12 న్యూయార్క్ నగరంలో జన్మించింది. ఇటలీలోని నేపుల్స్కు చెందిన అన్నా , స్వరకర్త ఫ్రాన్సిస్కో పెన్నినో దంపతుల ఆరుగురు పిల్లలలో ఆమె ఒకరు.[5] బ్రూక్లిన్‌లోని కుటుంబానికి చెందిన ఎంపైర్ థియేటర్లోని అపార్ట్మెంట్లో జన్మించింది. [6]
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1972 | ది గాడ్‌ఫాదర్ | వివాహ సన్నివేశంలో అదనపు పాత్ర | |
1974 | ది గాడ్‌ఫాదర్ పార్ట్ II | మామా కార్లియోన్ శరీరం | |
1981 | వన్ ఫ్రమ్ ది హార్ట్ | ఎలివేటర్ #2లో జంట | |
1990 | గాడ్ ఫాదర్ పార్ట్ III | సిగ్నోరా ఆల్టోబెల్లో |
ఇటాలియా పెన్నినో కొప్పోలా 2004, జనవరి 21న కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలెస్ లో మరణించింది. తన భర్తను ఖననం చేసిన శాన్ ఫెర్నాండో మిషన్ స్మశానవాటికలో ఈమెకూడా ఖననం చేయబడింది.[7][8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.