ఇందిరా కల్
From Wikipedia, the free encyclopedia
పశ్చిమ ఇందిరా కల్, సముద్ర మట్టం నుండి 5,988 మీటర్లు (19,646 అ.) ఎత్తున, కారాకోరం శ్రేణిలోని సియాచిన్ ముజ్తాగ్ వద్ద, ఇందిరా రిడ్జ్‌పై ఉన్న కల్ [గమనిక 1] లేదా కనుమ మార్గం. ఇది భారత భూభాగం లోని సియాచిన్ హిమానీనదం, చైనా నియంత్రణలో ఉన్న ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్‌ల మధ్య సరిహద్దులో ఉంది. ఇది భారతదేశం, పాకిస్తాన్, చైనా ల ట్రై పాయింట్‌కి దగ్గరగా ఉంది. సియాచిన్ ప్రాంతంలోని ఇండియా-పాకిస్థాన్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (AGPL) ఈ కనుమ దగ్గరే ముగుస్తుంది. [2] [3] [4] [5] చైనా, భారతదేశాల నియంత్రణలో ఉన్న ఉత్తర, దక్షిణ వైపులు రెండిటి నుండి ఈ కనుమను అధిరోహించడం సాధ్యమవుతుంది. [6]
ఇందిరా కల్ | |
---|---|
పశ్చిమ ఇందిరా కల్, ప్రధాన ఇందిరా కల్ | |
సముద్ర మట్టం నుండి ఎత్తు | 5,764 m (18,911 ft) |
ప్రదేశం | చైనా నియంత్రణలో ఉన్న ట్రాన్స్-కారకోరం ట్రాక్టుకు, సియాచెన్ హిమానీనదానికీ మధ్య ఉన్న సరిహద్దులో.[1] |
శ్రేణి | పశ్చిమ కారకోరం శ్రేణి |
Coordinates | 35.6644°N 76.7978°E / 35.6644; 76.7978 |
తూర్పు ఇందిరా కల్ (35°39′40″N 76°48′10″E ) అనేది, [7] ఇందిరా రిడ్జ్‌పై, పశ్చిమ ఇందిరా కల్ నుండి 2.4 కి.మీ తూర్పున, సముద్ర మట్టం నుండి 5,764 మీటర్లు (18,911 అ.) ఎత్తున ఉన్న మరొక కల్. దీన్ని మెయిన్ ఇందిరా కల్ అనీ, ఇందిరా కల్ [8] [9] అనీ అంటారు. చైనా నియంత్రణలో ఉన్న ఉత్తరం వైపు నుండి దీన్ని ఎక్కడం, దిగడం చాలా కష్టం, కానీ భారతభూభాగం లోని దక్షిణం వైపు నుండి సులభం. [7]
ఇండియా శాడిల్ (35°39′50″N 76°48′20″E ), అనే భౌగోళిక శాడిల్,[గమనిక 2] తూర్పు ఇందిరా కల్, పశ్చిమ ఇందిరా కల్ లను కలుపుతుంది. [7]
ఇందిరా రిడ్జ్, ఉత్తరాన చైనా నియంత్రణలో ఉన్న ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్నూ, దక్షిణాన ఉన్న సియాచిన్ గ్లేసియరునూ వేరు చేస్తుంది. వాస్తవ క్షేత్రస్థితి రేఖ (AGPL) తుది బిందువు, పశ్చిమ ఇందిరా కల్, తూర్పు ఇందిరా కల్, ఇందిరా శాడిల్, ఉత్తర తుర్కెస్తాన్ లా, తూర్పు తుర్కెస్తాన్ లా లు ఇందిరా రిడ్జ్‌పై వరసగా పశ్చిమం నుండి తూర్పుగా ఉన్నాయి. [7] [10]