From Wikipedia, the free encyclopedia
ఆస్ట్రోశాట్ అనేది భారతదేశం ఖగోళ పరిశోధన కోసం మొట్టమొదటిసారిగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చే పీఎస్ఎల్వీ సీ-30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 2015 సెప్టెంబరు 28 న ప్రయోగించిన ఉపగ్రహం.
మిషన్ రకం | Space observatory |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
COSPAR ID | 2015-052A |
SATCAT no. | 40930 |
మిషన్ వ్యవధి | 5 సంవత్సరాలు Elapsed : 9 సంవత్సరాలు, 14 రోజులు |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
అంతరిక్ష నౌక | Astrosat |
లాంచ్ ద్రవ్యరాశి | 1,513 కి.గ్రా. (3,336 పౌ.) |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | సెప్టెంబరు 28, 2015[1][2] |
రాకెట్ | PSLV-C30 |
లాంచ్ సైట్ | సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్, శ్రీహరికోట |
కాంట్రాక్టర్ | ISRO |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | భూమధ్యరేఖ-సమీప |
సెమీ మేజర్ ఆక్సిస్ | 7020 km |
Perigee altitude | 643.5 km |
Apogee altitude | 654.9 km |
వాలు | 6.0° |
వ్యవధి | 97.6 min |
Main | |
తరంగ దైర్ఘ్యములు | దూరపు అతినీలలోహిత నుండి X- రే |
Instruments | |
UltraViolet imaging telescope (UVIT) Soft X-ray telescope (SXT) LAXPC CZTI | |
ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన పదేళ్ల కృషి ఫలితమే భారత తొలి ప్రయోగ ఖగోళ అధ్యయన ఉపగ్రహం ఆస్ట్రోశాట్. దీనిని విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి తెలుసుకునేందుకు, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్ వంటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం మన గెలాక్సీ అవతలి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దీనిని ప్రయోగించారు. దీనిని ' మినీ హబుల్ ' గా పరిగణిస్తారు.
ఈ ఉపగ్రహంలో మొత్తం 750 కిలోల ద్రవ్యరాశి కలిగిన ఆరు సాధనాలను అమర్చారు.
ఆస్ట్రోశాట్ లో అమర్చిన ఈ ఉపకరణాల విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు మరో నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ ఉపగ్రహ జీవితకాలాన్ని ఐదు సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.