![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e1/Ardi.jpg/640px-Ardi.jpg&w=640&q=50)
ఆర్డిపిథెకస్
ఆర్డిపిథెకస్, హోమినినే ఉపకుటుంబానికి చెందిన, అంతరించిపోయిన ప్రజాతి / From Wikipedia, the free encyclopedia
ఆర్డిపిథెకస్, హోమినినే ఉపకుటుంబానికి చెందిన, అంతరించిపోయిన ప్రజాతి. ఇది అంత్య మయోసీన్లోను, తొలి ప్లియోసీన్ లోనూ ఇథియోపియా లోని అఫార్ ప్రాంతంలో జీవించింది. చింపాంజీల నుండి మానవులు వేరుపడిన తరువాత, వారి తొట్టతొలి పూర్వీకులలో ఒకటిగా దీన్ని భావించారు. ఈ ప్రజాతికి మానవ పూర్వీకులతో ఉన్న సంబంధం ఏమిటి, ఇది హోమినిన్నేనా కాదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.[1] ఈ ప్రజాతికి చెందిన రెండు శిలాజ జాతులను - 44 లక్షల సంవత్సరాల క్రితం తొలి ప్లయోసీన్లో నివసించిన ఆర్డిపిథెకస్ రామిడస్, [2] సుమారు 56 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన ఆర్డిపిథెకస్ కడబ్బా (అంత్య మయోసీన్లో) లను - శాస్త్ర సాహిత్యంలో వివరించారు. [3] ప్రవర్తనా విశ్లేషణను బట్టి ఆర్డిపిథెకస్కు చింపాంజీలతో చాలా దగ్గరి పోలికలున్నాయి. తొలి కాలపు మానవ పూర్వీకులు, ప్రవర్తనలో బాగా చింపాంజీలా ఉండేవారని ఇది సూచిస్తుంది.
ఆర్డిపిథెకస్ Temporal range: Late Miocene - Early Pliocene, 5.77–4.4 Ma PreꞒ
Ꞓ
O
S
D
C
P
T
J
K
Pg
N
↓ | |
---|---|
![]() | |
ఆర్డిపిథెకస్ రామిడస్ స్పెసిమెన్, ఆర్డి అని పేరు పెట్టారు. | |
Scientific classification ![]() | |
Domain: | Eukaryota |
Kingdom: | జంతువు |
Phylum: | కార్డేటా |
Class: | క్షీరదాలు |
Order: | Primates |
Suborder: | Haplorhini |
Infraorder: | Simiiformes |
Family: | Hominidae |
Subfamily: | Homininae |
Tribe: | Hominini |
Subtribe: | Hominina |
Genus: | †Ardipithecus టిమ్ వైట్ తది, 1995 |
Species | |
†ఆర్డిపిథెకస్ కడబ్బా |