From Wikipedia, the free encyclopedia
ఆత్మ అనేది హిందూమతములోను, సంబంధిత సంప్రదాయాలలోను తరచు వాడబడే ఒక తాత్విక భావము. దీని గురించి వివిధ గ్రంథాలలో వివిధములైన వివరణలున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సమస్త జీవులు కేవలం మనకు కనిపించే శరీరాలు కావని, ఆ శరీరాలు నశించినా నశించని జీవుడు ఒకడున్నాడని, ఆ నాశనరహితమైన జీవుడే "ఆత్మ" అని చెప్పవచ్చును.
ఆత్మ అనగా ప్రతీ మనిషి లోనూ ఉండే భగవంతుని అంశ. కనుక దానికి కుల, మత, వర్గ, రూప భేదాలు ఉండవు. దీనినే "అంతరాత్మ" అని అనవచ్చును. అంతర్లీనంగా ఉండి, మానవునికి సరి అయిన మార్గమును, న్యాయ-అన్యాయాలు, తప్పు-ఒప్పులను నిస్పక్షపాతంగా చెపుతూ, ఆ మానవునికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది.ఇది ఎప్పుడూ, మంచిని చెప్పే ఒక ఆత్మీయునిలాగ, ధర్మాన్ని తెలియజెప్పే ఒక గొప్ప యోగిలాగ, మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియజెప్పే ఒక న్యాయమూర్తిలాగ ప్రవర్తిస్తుంది. మానవులందరిలోనూ ఈ అంతరాత్మ ఒకే విధంగా ఆలోచిస్తుంది. ఒక విషయాన్ని ఒకే విధంగా వివరిస్తుంది. అంతరాత్మ విషయంలో మానవులలో ఏవిధమైన తేడాలూ లేవు. ఎందుకంటే ఇది ఆ పరమాత్ముని అంశే కనుక.ఆయన ఒక్కడే కనుక. ఆయన నుండి వేరుపడి, వివిధ రూపాలు కలిగిన శరీరాలలో ప్రవేశించి జీవనం సాగిస్తుంది కనుకనే ఎంత వీలయితే అంత తొందరగా ఆ భగవంతునిలో లీనం కావాలని తాపత్రయ పడుతూ ఉంటుంది. ఆత్మకు రూపం లేదు. అది ఒక దివ్య శక్తి . ఈ శక్తిని తెలుసుకోమనే గొప్ప గొప్ప మహాత్ములందరూ తమ బోధలలో చెప్పేది. మరి మానవుల ఆలోచనావిధానం లోనూ, ఆచరణావిధానం లోనూ ఇన్ని తేడాలు ఎలా వచ్చాయి? సాధారణంగా మానవులు రూపంలోకానీ, చేష్టలలో కానీ, ఆలోచనా విధానంలోకానీ ఒకరితో ఒకరికి పోలికలు ఉండవు. ఎక్కడో అక్కడ చిన్న తేడా అయినా ఉంటుంది. కానీ విచిత్రంగా, అంతరాత్మ విషయంలో అందరూ ఒకేలాగ, ఒకే పోలికతో ఉంటారు. తేడా అల్లా ఎవరు ఎంత శాతం అంతరాత్మకు విలువ ఇస్తున్నారు? అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనుషులు ఒకరితో ఒకరికి పోలిక లేకుండా పోతుంది. ఈ పరిస్థితికి కారణం "మనస్సు". ఇది కూడా మనలో ఆత్మచేసే బోధకు సమాంతరంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మనస్సు పరిస్థితులకు, కారణాలకు, ఇంద్రియాలకు, పురుషార్థాలకు, గుణాలకు లోబడి మనకు మార్గము చూపుతూ ఉంటుంది.ఈ మార్గం సమయాను సారంగా మారుతూ ఉంటుంది. ఈ మార్గమును ఎవరు, ఎంత శాతం వరకూ అనుసరిస్తారు? అన్న దానిమీద ఆధారపడి ఉంది.మరి, ఆత్మ, దేనికి లోబడక, ఏ పరిస్థితులకూ, సమయానికీ కూడా లోబడకుండా ఎప్పుడూ న్యాయమార్గాన్నే చూపుతూ ఉంటుంది. మనుషులలో తేడాలు, ఈ రెండు మార్గాలలో దేనికి ఎంత విలువనిస్తారు? అన్న దానిమీద ఆధారపడి ఉంటాయి.
హిందూమతం లోని ఆధ్యాత్మిక, ఉపనిషత్తుల సారమే ఈ నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి. ఆ మహావాక్యాలు :-
ఈ మహావాక్యాలు ఆత్మ తత్వాన్ని సూచిస్తున్నాయి.
ఇక్కడ ఆత్మ, బ్రహ్మము అనేవి ఒకటే అని చెప్పబడింది. ఇందుకు సముద్రము, అందులోని కెరటము దృష్టాంతముగా తీసికొన్నారు. ఒకో కెరటము ప్రత్యేకమైన ఉనికి ఉన్న వస్తువుగా అనిపిస్తుంది. కాని ఆకెరటం ఒడ్డును తాకి పడిన తరువాత కెరటానికి, సముద్రానికి తేడా లేదని తెలుస్తుంది. [1]
శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ రెండు విధాలు. 1. జీవాత్మ 2. పరమాత్మ. విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి 'పరమాత్మ'అని, జీవులలో ఉండే తన అంశను 'జీవాత్మ'అని వివరించాడు. ఈ జీవాత్మే 'ఆత్మ. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. ఇంతేకాక "అహం బ్రహ్మస్మి" అయమాత్మ బహ్మ" అనే ఉపనిషద్ వాక్యాలు కూడా నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు
మనిషి పాతచొక్కా విడిచి కొత్త చొక్కా వేసుకున్నట్లు ఆత్మ పునర్జన్మ పొందుతుందని హిందువులు నమ్ముతారు.
తెనుగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెనుగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిన్ తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసెద పునర్జన్మంబు లేకుండగన్ -పోతన
పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు. అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మేవాడు. ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మేవాడు. గ్రీక్ తత్వవేత్త ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు.
ఆత్మ ఇండోయూరోపియన్ మూలం (*ēt-men (శ్వాస) ) నుండి ఉద్భవించింది.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.