అహలె బైత్ (అరబ్బీ: أهل البيت, టర్కిష్: ఎహల్ - ఇ బేయిత్ ) ఒక పదము, సాహితీభాషలో "పరివార సభ్యులు". ఇస్లామీయ సాహిత్యములో ప్రవక్త ఐన ముహమ్మద్ యొక్క కుటుంబ పరివారం.[1]

పదవ్యుత్పత్తి

అహ్ల్ అనగా ప్రజలు లేదా సభ్యులు. బైత్ అనగా "ఇల్లు" లేదా నివాసం, లేదా నిలయం. అహలె బైత్ లేదా ఆహ్లల్ బైత్, అనగా కుటుంబ సభ్యులు, కుటుంబంలో నివసించే సభ్యులు.[2]

ఖురాన్ లో అహలె బైత్

ఖురాన్లో "అహలె బైత్" అనే పదజాలము రెండు సార్లు ముహమ్మద్ ప్రవక్త భార్యలను సగౌరవంగా ఉద్యేశించి వర్ణింపబడింది.[3] మొదటి ఉదాహరణ ముహమ్మద్ ప్రవక్త గారి భార్యల గురించి [ఖోరాన్ 33:33] ఐతే, రెండవ ఉదాహరణ ఇబ్రాహీం ప్రవక్త భార్య ఐన సారాహ్ గురించి .[ఖోరాన్ 11:73]

షియా ఇస్లాం ప్రకారం అహలె బైత్

షియాల ప్రకారం అహలె బైత్ అహ్ల్ అల్-కిసా లను, ఇమాం లను కూడా అహలె బైత్ గా భావిస్తారు. అహలె బైత్ లను పవిత్రంగానూ, ముస్లిం సమూహానికి గురువులుగానూ భావిస్తారు. అహలె బైత్ గా క్రింది వారిని గుర్తిస్తారు :

- ముహమ్మద్ ప్రవక్త
- ఫాతిమా జహ్రా
- ఇమాం అలీ ఇబ్న్ అబీ తాలిబ్
- ఇమాం హసన్ ఇబ్న్ అలీ
- ఇమాం హుసైన్ ఇబ్న్ అలీ
- ఇమాం అలీ ఇబ్న్ హుసైన్
- ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అలీ
- ఇమాం జాఫర్ ఇబ్న్ ముహమ్మద్
- ఇమాం మూసా ఇబ్న్ జాఫర్
- ఇమాం అలీ ఇబ్న్ మూసా
- ఇమాం ముహమ్మద్ ఇబ్న్ అలీ
- ఇమాం అలీ ఇబ్న్ ముహమ్మద్
- ఇమాం హసన్ ఇబ్న్ అలీ
- ఇమాం హుజ్జత్ ఇబ్న్ హసన్ [4]

ఇవీ చూడండి

నోట్స్

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.