From Wikipedia, the free encyclopedia
అశ్వగంధ ( పెన్నేరుగడ్డ ) | |
---|---|
ఢిల్లీలోని టాల్కోతార గార్డెన్లో అశ్వగంధ మొక్క | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | Asterids |
Order: | |
Family: | |
Genus: | Withania |
Species: | W. somnifera |
Binomial name | |
Withania somnifera | |
Synonyms | |
Physalis somnifera |
అశ్వగంధ (ఆంగ్లం Ashwagandha) ఒక విధమైన ఔషధ మొక్క. దీనినే విథనీయా సోమ్నఫెరా, ఇండియన్ జిన్సెంగ్ అని కుడా వ్యవహరిస్థారు. అశ్వగంధ ఆయుర్వేదం వైద్యంలో చాలా ముఖ్యమైనది . దీనిని "king of Ayurveda" అంటారు. మహావృక్షాలు మొదలకుని గడ్డిపరకలదాకా ప్రకృతిలో మానవునికి కావలసిన ఔషధ వనరుల్ని సమకూర్చేవే. మానవ మనుగడకి దోహదం చేసేవే. అదీకాక, ఈ వనరులన్నీ మనకి అందుబాటులో ఉన్నవే. అయితే చాలావాటిని మనం అశ్రద్ధ చేస్తున్నాం అనడంలో పొరపాటేమీ లేదు. ప్రతి మొక్కనీ మనం ఇష్టపూర్వకంగా శ్రద్ధగా పెంచితే 'పెరటి చెట్టు వైద్యానికి పనికిరాకుండా పోదు. అనేక రకాల మొక్కల్లో కొన్ని పొదలమాదిరిగా పెరుగుతాయి. అటువంటిదే అశ్వగంధ. దీని శాస్త్రీయనామం విధానియా సోమ్నిఫెరా. ఇది సొలనేసీ కుటుంబానికి చెందిన మొక్క. ఇది కేవలం 35-75 సెంటీమీటర్ల ఎత్తులో అంటే, 1.25 మీటర్ల ఎత్తులో గుబురుగా పొదలా పెరిగే మొక్క. దీని కాండం నుండి చిరుకొమ్మలు విశాలంగా పెరిగి, దట్టమైన ఆకులు పెరుగుతాయి. కాండం, కొమ్మలతో మొత్తం మొక్క నూగు వెంట్రుకల మాదిరిగా ఉంటుంది. దీని పువ్వులు ఆకుపచ్చరంగులో ఉండి, పండ్లు ఎరుపు, ఆరంజి రంగుల్లో ఉంటాయి. అశ్వగంధ మొక్క వేళ్ళు పొడవుగా, ఉండి చాలా ఔషధగుణాలు కలిగివుంటాయి. ఇది సాధారణంగా సమశీతోష్ణ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. అందులోను మన భారతదేశంలో విస్తారంగా లభ్యమవుతుంది.
దీనిని వ్యవసాయ రీతుల్లో మధ్యప్రదేశ్, పంజాబ్, సింధీ, రాజస్థాన్‌ల్లో విరివిగా పండి స్తున్నారు. దీనిని బెంగాలీలో అశ్వగంధ అనీ, గుజరాతీలో ఘోడాకూన్, ఆసన్, అసోడా అనీ, హిందీలో అస్గంధ్ అనీ, కన్నడలో అంగర్‌బేరు, అశ్వగంధి అని, మలయాళంలో అముక్కురమ్ అనీ, మరాఠీలో అస్కంథ అనీ, తమిళంలో అముక్కిర, అసువగంధి అనీ, తెలుగులో పెన్నేరుగడ్డ, పన్నీరు, పులివేండ్రము, పిల్లివేండ్రము, దొమ్మడోలు, మాదావి, వాజిగంధి అని పలుపేర్ల వ్యవహరిస్తూవుంటారు. దీని వేరు, ఆకులు, పండ్లు, విత్తనాలు కూడా చాలా ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యపరంగా అశ్వగంధి లేహ్యం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.
అశ్వగంధి మత్తు కలిగించే ఔషధంగాను, మంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, ఉదరసంబంధవ్యాధులకు దివౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, కేన్సర్‌కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే, ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివా రించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రా ణని దగ్గరకి రానివ్వదు. కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అలా గే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆర్థ్రైటిక, యాంటీ బాక్టీరియల్, యాంటీ డిప్రెసంట్‌గా అశ్వగంధి అవెూఘంగా పనిచేస్తుంది. ఈ అశ్వగంధిలో విథనోలైడ్స్, ఆల్కలైడ్స్, మళ్ళీ వీటిలో విథ నోన్, విథాఫెరిన్ ఎ, విథనొలైడ్ 1, విథసోమిడినెస్, విథనోలై డ్ సి, కస్కో హైగ్రైన్, అన హైగ్రైన్, ట్రొఫైన్, సూడో ట్రోఫైన్, అన ఫెరైన్, ఇసో పెల్లా, టిరైన్, 3-ట్రిపిల్‌టీ గ్లోరైట్‌నే రసాయనాలు ఉంటాయి. ఇవికాక, ప్రొలైన్, వలైన్, ట్రయోసిన్, అలనైన్, గ్లైసిన్, హైడ్రాక్సిప్రొలైన్, అస్పార్టిక యాసిడ్, గ్లుటా మిక యాసిడ్, సిస్టయిన్, గ్ల్రైకోసైడ్, గ్లూకోస్, క్లోరోజనిక యాసిడ్, టానిన్, ప్లానోనాయిడ్స్, విథనోలైడ్స్, అల్కలాయిడ్ అనే ఇతర మూల క రసాయనాలు కూడా ఉంటాయి.
అశ్వగంధి పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. డిహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. పళ్ళని గట్టిపరుస్తుం ది. దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది. కీళ్ళ నొపðలు నయం చేస్తుంది. దీని ఆకులు, వేర్లు, పుష్పాలు, కాయలు కురుపులకి, కడుపులో అల్సర్స్‌ని రాకుండా అరికడుతుంది, తగ్గిస్తుంది. వెూకాలు నొపðలకి ఇది మంచి ఔషధం. శరీర ధారుఢ్యాన్ని పెంపొందించ డంలో దీనికిదే సాటి. జీర్ణశక్తిని పెంపొంది స్తుంది. లివర్ సంబంధవ్యాధుల్ని అరికడు తుంది. కేన్సర్, అల్సర్ వంటి వ్యాధుల్ని సమూలంగా నిర్మూలిస్తుంది. కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి ప్రసాదించే గుణం ఈ అశ్వగంధికే ఉందని వైద్యశాస్త్ర నిపుణులు వక్కాణించారు. ఇన్ని గుణాలున్న అశ్వగంధి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉండటం చేత వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యతని కూడా సంతరించుకుంది. ఆయుర్వేద వైద్య విధా నాల్లో తయారవుతున్న అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి మొదలైనవి ఏనాటినుంచో మంచి ప్రాచుర్యం పొంది, అధిక సంఖ్యలో ఎగుమతి అవుతు న్నాయి. దీనిలో ముఖ్యముగా "ఆల్కలోయిడ్లు ", " స్తేరోయిడల్ లాక్తోన్స్" ఉంటాయి . ఆల్కలోయిడ్లు (Alkaloids) :
వితానిన్ (withanine), సోమఫెరిన్ (somniferine), సోమ్నిన్ (somnine), సోమ్ని ఫెరేనిన్ (somniferinie), వితనానిన్ (withananine), సూడో వితనిన్ (pseudoWithanine), త్రోపిన్ (Tropine), సూడో త్రోపిన్ (pseudoTropine),
స్తీరోయిడాల్ లాక్టన్ (Steroidal Lactones) :
వితనోలిదీస్ (withanolides),
ఇవి కాకుండా రెండు ఎకిల్ స్తేరిల్ గ్లుకోసైడ్స్ (Acyl Steryl Glucosides), ఉన్నాయి . పై రసాయనాలు అన్నీ నరాలను ఉత్ప్రేరణ చేయడం, నరాలు వినాచనం కాకుండా కాపాడుతాయి . అశ్వగంధతో ఏ మందు తీసుకున్న దాని పనితనము మెరుగు పరుస్తుంది (It enhanses the property of co-existing molecule), వైద్యపరంగా :
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.