![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/01/Nonmetals.png/640px-Nonmetals.png&w=640&q=50)
అలోహం
From Wikipedia, the free encyclopedia
అలోహం (Nonmetal) రసాయన శాస్త్రం ప్రకారం లోహాలు (Metals) కాని మూలకాలన్నింటికి కలిపి ఉపయోగిస్తారు. ఆధునిక ఆవర్తన పట్టిక ప్రకారం అన్ని మూలకాలను వాటి భౌతిక, రసాయన లక్షణాలను బట్టి లోహాలు, అలోహాలుగా విభజించారు.అలోహాలం ద్యుతి గుణం, ధ్వని గుణం వంటి లోహ ధర్మాలను కలిగి ఉండవు ఇవి నీటితో ఆమ్లాలతో చేరి చర్య జరపవు. ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి. బ్రోమిన్ తప్ప మిగతా అన్ని అలోహాలు ఘనస్థితిలో ఉంటాయి.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/01/Nonmetals.png/640px-Nonmetals.png)
ఆలోహలు సహజమైన పదార్థాలు, ఇవి వేడి లేదా విద్యుత్తును ఉత్పత్తి చేయవు, నిర్మాణాత్మకంగా పెళుసుగా ఉంటాయి . రసాయనికంగా, హైడ్రోజన్, కార్బన్, నత్రజని, ఆక్సిజన్, భాస్వరం, ఆర్సెనిక్, సెలీనియం ఆవర్తన పట్టికలోని లోహరహిత అంశాలు.[1]
అంటే ద్రవస్థితిలో ఉండే రెండు మూలకాలు- పాదరసం, బ్రోమిన్. మిగతా మూలకాలన్నీ ఎక్కువగా ఘన లేదా వాయు స్థితిలో ఉంటాయి.[2]
హైడ్రోజన్ ఒక ఆలోహం. వంట నూనెల హైడ్రోజినేషన్లో హైడ్రోజన్‌ను ఉపయోగిస్తారు.
అమోనియాను పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడానికి అధిక మొత్తంలో హైడ్రోజన్‌ను ఉపయోగిస్తారు.
అమ్మోనియా, నైట్రిక్ ఆమ్లం, ఎరువుల తయారీకి, నత్రజనిని ఉపయోగిస్తారు.
నీటి శుద్ధీకరణ కోసం, క్లోరిన్ ఉపయోగించబడుతుంది,
రాకెట్ ఇంధనంగా హైడ్రోజన్ చాలా ఉపయోగపడుతుంది.
అలోహాల్లో కార్బన్ ముఖ్యమైంది. జీవరసాయనాలైన పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లలో కార్బన్
ఉంటుంది. వజ్రం శుద్ధమైన కార్బన్. గ్రాఫైట్ రూపంలోని కార్బన్ ను లెడ్ పెన్సిళ్ల, ఎలక్ట్రోడ్ల తయారీలో ఉపయోగిస్తారు.