From Wikipedia, the free encyclopedia
అర్మకొండ, తూర్పు కనుమల ఉత్తర భాగంలో ఉన్న పర్వత శిఖరం. ఇది గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు గ్రామానికి ఉత్తరాన మాడుగుల కొండ ఉప-శ్రేణిలో ఉంది. దీన్ని సీతమ్మ కొండ అని, జిందగడ కూడా అంటారు.[3][4]
అర్మ కొండ | |
---|---|
సీతమ్మ కొండ, జిందగడ | |
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 1,680 మీటర్లు (5,512 అ.)[1] |
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ | 1,290 మీటర్లు (4,232 అ.)[1] |
టోపోగ్రాఫిక్ ఐసొలేషన్ | 907 కిలోమీటర్లు (564 మై.)[1] |
నిర్దేశాంకాలు | 18°13′41″N 82°43′23″E[2] |
భౌగోళికం | |
స్థానం | ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని, డుంబ్రిగుడ మండలం, హుకుంపేట మండలాల సరిహద్దులో |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు |
పర్వత శ్రేణి | తూర్పు కనుమలు |
అధిరోహణం | |
సులువుగా ఎక్కే మార్గం | నడక / కాళ్ళూ చేతులతో ఎక్కడం |
సముద్రమట్టం నుండి 1,680 మీటర్లు (5,510 అ.) ఎత్తున్న ఆర్మ కొండ, తూర్పు కనుమలలో కెల్లా ఎత్తైన శిఖరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కూడా ఎత్తైన పర్వత శిఖరం ఇదే. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లలో ఈ శిఖరానికి సీతమ్మ కొండ అని పేరు పెట్టారు. [5]
ఆర్మ కొండ టోపోగ్రాఫిక్ ఐసోలేషను [గమనిక 1] పరంగా భారతదేశంలో అనముడి తర్వాత రెండవ స్థానంలో ఉంది. అర్మకొండ ఐసొలేషను 907 కిలోమీటర్లు (564 మై.). [6]
మాడుగుల కొండ శ్రేణిలో ఉన్న ఇతర శిఖరాలు - గాలి కొండ (1,643 m), సింక్రం గుట్ట (1,620 m). [4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.