అరేబియా ద్వీపకల్పం

From Wikipedia, the free encyclopedia

అరేబియా ద్వీపకల్పంmap

అరేబియా ద్వీపకల్పం (Arabian Peninsula) (అరబ్బీ: شبه الجزيرة العربية shibah al-jazīrat al-ʻarabīyah or جزيرة العرب jazīrat al-ʻArab), దీనినే అరేబియా, అనీ పిలుస్తారు, [1] ఇది పశ్చిమాసియా లోని ఒక ద్వీపకల్పం, ఈశాన్య ఆఫ్రికా దిశన ఉంది. అరేబియన్ ఫలక పై విస్తరించి యున్నది. దీనిలో లెబనాన్, సిరియా, యెమెన్, ఒమన్, ఖతార్, బహ్రయిన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, జోర్డాన్, తూర్పు సినాయి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.[2]

Thumb
1720 నాటి జర్మన్ ప్రకాశకుడు క్రిష్టఫర్ వీగెల్ చే ముద్రితమైన అరేబియా ద్వీపకల్ప పటం.
This video was taken by the crew of Expedition 29 on board the ISS on a pass from Western Europe to the Arabian Peninsula.

నేటి నవీన కాలానికి ముందు అరేబియా ద్వీపకల్పం ప్రధానంగా నాలుగు ప్రాంతాలుగా వుండేది : హిజాజ్, నజ్ద్, దక్షిణ అరేబియా, తూర్పు అరేబియా. హిజాజ్, నజ్ద్ లు కలిపి నేటి సౌదీఅరేబియా ఏర్పడింది. దక్షిణ అరేబియా నేటి యెమన్, అరేబియా, ఒమన్ లోని కొన్ని ప్రాంతాలు. తూర్పు అరేబియాలో సముద్రతీరప్రాంతాలు, పర్షియన్ గల్ఫ్ (పర్షియన్ గల్ఫ్ యొక్క అరబ్ దేశాలు (The Khaleej - ఖలీజ్ ప్రాంతాలు) . ఈ ప్రాంతాలన్నీ పెట్రోలు, సహజవాయువులకు ప్రసిద్ధి.

నైసర్గిక స్వరూపం

Thumb
ఆఫ్రికా, అరేబియా ఉపఖండం (ఆసియా),, యురేషియా.

అరేబియా ద్వీపకల్పం ఆసియా ఖండంలో ఉంది. దీని చుట్టూ (సవ్య దిశలో) ఈశాన్యంలో పర్షియన్ అఖాతము, తూర్పున హార్ముజ్ జలసంధి, ఒమన్ అఖాతము, ఆగ్నేయము, దక్షిణాన అరేబియా సముద్రము, దక్షిణాన ఎడెన్ అఖాతము, నైరుతి దిశన బాబ్ అల్-మందబ్, నైరుతి, పశ్చిమాన ఎర్ర సముద్రం సరిహద్దులు కలిగి ఉంది.[3] ఈ ద్వీపకల్ప ఉత్తర ప్రాంతం సిరియా ఎడారిలో మిళితం అయింది. సిరియా, సౌదీ అరేబియా, కువైట్ దేశాల సరిహద్దులు ఇక్కడే ఉన్నాయి.[3]

ఈ ద్వీపకల్ప ప్రధాన లక్షణం ఎడారి ప్రాంతం. కానీ నైరుతీ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదౌతుంది. హర్రత్ అష్ శాం (సిరియా ఎడారి) ఓ పెద్ద అగ్నిశిలా ప్రాంతం, వాయువ్య అరేబియా ప్రాంతం నుండి జోర్డాన్ వరకు, దక్షిణ సిరియా వరకూ వ్యాపించి యున్నది.[4]

రాజకీయ హద్దులు

Thumb
అరేబియా ద్వీపకల్పం.

ఈ ద్వీపకల్పంలో దేశాలు ఉత్తరం నుండి దక్షిణానికి (సవ్య దిశలో) కువైట్, బహ్రయిన్, కతర్,, యు.ఏ.ఇ. తూర్పున, ఒమన్ ఆగ్నేయాన, యెమన్ దక్షిణాన, సౌదీఅరేబియా మధ్యభాగాన ఉన్నాయి.[3]

జనాభా

2014 వరకు, అరేబియా ద్వీపకల్ప దేశాలలో దాదాపు 8 కోట్ల జనాభా గలదు.[5]

ప్రజలు

ఇస్లాంకు పూర్వం నుండి ఇక్కడ కొద్ది పాటి యూదులు, క్రైస్తవులు నివసించేవారు. ఎక్కువ ప్రజలు ప్రాంతీయ అరబ్ జాతి తెగలు. నేటికినీ అరేబియా ద్వీపకల్పంలో క్రైస్తవులు, యూదులు కానవస్తారు. వీరిని అరబ్ యూదులని, అరబ్ క్రైస్తవులని, అలాగే ముస్లింలను అరబ్ ముస్లింలని పిలుస్తారు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.