From Wikipedia, the free encyclopedia
అండొర్రా (ఆంగ్లం : Andorra), అధికారిక నామం ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండొర్రా (ప్రిన్సిపాలిటీ ఆఫ్ వ్యాలీస్ ఆఫ్ అండొర్రా) అని కూడా అంటారు.[1] పశ్చిమ యూరప్ లోని ఒక చిన్న భూపరివేష్టిత దేశం. ఈ దేశం పైరెనీస్ పర్వతాలకు తూర్పున ఈ దేశానికి స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.[2] ఇది ఇబారియా ద్వీపకల్పంలో ఉన్న భూబంధిత దేశం. దీనిని చార్లెమాగ్నే స్థాపించాడని విశ్వసిస్తున్నారు. 988 వరకు అండొర్రాను ఉర్గెల్ కౌంట్ పాలించాడు. తరువాత 1278 లో ఇది " రోమన్ కాథలిక్ డియోసె ఆఫ్ ఉర్గెల్ "కు బదిలీ చేయబడింది. ప్రస్తుత రాజ్యాన్ని ఒక చార్టర్ స్థాపించాడు. దీనిని ఇద్దరు పాలకులు పాలిస్తున్న రాజ్యంగా గుర్తిస్తున్నారు; కాథలిక్ బిషప్ ఆఫ్ ఉర్గెల్ (స్పెయిన్), ఫ్రెంచి రిపబ్లిక్ అధ్యక్షుడు.
[Principat d'Andorra] Error: {{Lang}}: text has italic markup (help) ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండొర్రా |
||||||
---|---|---|---|---|---|---|
నినాదం ["Virtus Unita Fortior"] Error: {{Lang}}: text has italic markup (help) (లాటిన్) "Strength United is Stronger" |
||||||
జాతీయగీతం |
||||||
Location of అండొర్రా (circled in inset) on the European continent (white) — [Legend] |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Andorra la Vella 42°30′N 1°31′E | |||||
అధికార భాషలు | Catalan | |||||
ప్రజానామము | Andorran | |||||
ప్రభుత్వం | Parliamentary democracy and Co-principality | |||||
- | Episcopal Co-Prince | Joan Enric Vives Sicília | ||||
- | French Co-Prince | Nicolas Sarkozy | ||||
- | Head of Government | Albert Pintat | ||||
Independence | ||||||
- | en:Paréage | 1278 | ||||
- | జలాలు (%) | 0 | ||||
జనాభా | ||||||
- | 2007 అంచనా | 71,822 (194th) | ||||
- | 2006 జన గణన | 69,150 | ||||
జీడీపీ (PPP) | 2005 అంచనా | |||||
- | మొత్తం | $2.77 billion (177th) | ||||
- | తలసరి | $38,800 (unranked) | ||||
కరెన్సీ | Euro (€)1 (EUR ) |
|||||
కాలాంశం | CET (UTC+1) | |||||
- | వేసవి (DST) | CEST (UTC+2) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ad2 | |||||
కాలింగ్ కోడ్ | +376 | |||||
1 | Before 1999, the French franc and Spanish peseta. Small amounts of Andorran diners (divided into 100 centim) were minted after 1982. | |||||
2 | Also .cat, shared with Catalan-speaking territories. |
అతిచిన్న ఐరోపాదేశాలలో అండొర్రా 6 వ స్థానంలో ఉంది. దేశవైశాల్యం 468 చ.కి.మీ. అండొర్రా ప్రజలు కాటలిన్ మూలాలు కలిగిన రోమన్ సంతతికి చెందిన ప్రజలుగా గుర్తించబడుతున్నారు.[3] అండొర్రా వైశాల్యపరంగా అతిచిన్న ప్రపంచదేశాలలో 16 వ స్థానంలో ఉంది. జనసంఖ్యాపరంగా ప్రపంచంలో 11 వ స్థానంలో ఉంది.[4] దీని రాజధాని " అండొర్రా లా వెల్లా ". ఐరోపాలో ఇది అత్యంత ఎత్తైన రాజధాని నగరంగా (సముద్రమట్టానికి 1,023 మీ) గుర్తించబడుతుంది.[5] అండొర్రాకు కాటలాన్ అధికార భాషగా ఉంది. స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచి భాషలు కూడా వాడుకలో ఉన్నాయి.[6][7]
అండోరా దేశాన్ని వార్షికంగా 10.2 మిలియన్ల మంది ప్రజలు సందర్శిస్తున్నారు.[8] అండొర్రా ఐరోపా సమాఖ్యలో సభ్యదేశం కానప్పటికీ దేశీయ కరెన్సీగా యూరో వాడుకలో ఉంది. 1993 నుండి ఇది ఐక్యరాజ్యసమితి సభ్యదేశంగా ఉంది.[9] 2013 లో " గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డీసెస్ స్టడీ " అండొర్రాను ప్రపంచంలో అత్యధిక ఆయుఃపరిమితి (81 సంవత్సరాలు) కలిగిన దేశంగా గుర్తించింది.[10]
అండోరా అనే పదం మూలం తెలియనప్పటికీ పేరు గురించి పలు కథనాలు రూపొందించబడ్డాయి Archived 2015-02-17 at the Wayback Machine. అండొర్రా అనే పదాన్ని పురాతన గ్రీకు చరిత్రకారుడు పాలిబియస్ (ది హిస్టరీస్ 3, 35, 1) మొదటిసారిగా పేర్కొన్నాడని భావిస్తున్నారు. అండోర్రా లోయలో ముందుగా ఐబీరియా పూర్వ-రోమన్ తెగ ఆండోసిన్లు నివసించారని భావిస్తున్నారు. ప్యూనిక్ యుద్ధాల సమయంలో పైరినీస్ మీదుగా పయనిస్తున్న కార్థేజినియన్ సైన్యాన్ని వీరు ఎదుర్కొంటున్నట్లు వివరించబడుతుంది. అండోసిని (అండోసిన్స్) అనే పదం బాస్క్ హ్యాండియా నుండి ఉద్భవించింది. దీని అర్ధం "పెద్దది" ("బృహత్తరం").[11] బాస్క్యూ భాష ఆధారంగా అండోరన్ భౌగోళికరూపం ఈ పేరుకు తగినట్లు భావించబడుతుంది. మరొక సిద్ధాంతం ఆధారంగా అండోరా అనే పదం బాస్క్యూ పదం ఉర్ (నీరు) కలిగి ఉన్న పాత పదం అనోరా నుండి ఉద్భవించిందని సూచిస్తుంది.[12]
మరొక సిద్ధాంతం అండోరా అరబ్బు పదం అల్-దుర్రా (అంటే "అటవీ" (الدرة) నుండి ఉద్భవించిందని సూచిస్తుంది. అరబ్బులు, మూర్సు ఐబీరియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకున్న సమయంలో హై పైరినీస్ లోయలు పెద్ద అటవీ ప్రాంతాలతో కప్పబడి ఉన్నాయి. భౌగోళిక ఇబ్బందుల కారణంగా ఈ ప్రాంతాలు ముస్లింలు పరిపాలించని ప్రాంతాలుగా ఉన్నాయి.[13]
ఇతర సిద్ధాంతాలు ఈ పదం నవారో-అరగోనీస్ ఆండ్రియల్ నుండి ఉద్భవించిందని దీనికి "పొదలతో కప్పబడిన భూమి" ("స్క్రబ్లాండ్") అర్ధం సూచిస్తుంది.[14]
జానపద శబ్దవ్యుత్పత్తి శాస్త్రం ఆధారంగా చార్లెమాగ్నే ఈ ప్రాంతానికి బైబిలులో ఎండోర్ (అండోర్ (మిడియానీయులు) ) కన్నానిటే లోయ అన్న పేరు సూచించబడింది. మూర్లను "అడవి"లో ఓడించిన తరువాత అతని వారసుడు, కుమారుడు లూయిస్ లే డెబోన్నైర్ ఈ ప్రాంతానికి ఈ పేరు ఇచ్చాడు.[15]
శాంట్ జూలియా డి లోరియా వద్ద పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న లా బాల్మా డి లా మార్గినేడా క్రీ.పూ 9,500 లో పైరినీస్ ప్రర్వతం రెండు వైపుల మద్య ప్రయాణించే మానవుల స్థావరంగా ఉండేదని భావిస్తున్నారు. సీజనల్ స్థావరంగా ఉపయోగించబడిన ఈ స్థావరం అరీజ్, సెగ్రే వేటగాళ్ళ సమూహాల వేట, చేపలు పట్టడం వంటి వృత్తులు కొనసాగించడానికి కచ్చితంగా ఉంది.[16]
క్రీ.పూ 6640 లో నవీన శిలాయుగంలో మాడ్రియు లోయకు (ప్రస్తుతం ఎస్కాల్డెస్-ఎంగోర్డనీలో ఉన్న నేచురల్ పార్క్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది) తరలించబడి ఒక సమూహం దానిని శాశ్వత శిబిరంగా ప్రకటించారు. లోయకు చేరుకున్న ప్రజలు ఈ ప్రాంతంలో తృణధాన్యాలు పండించి, పశువుల మందలను పెంచి సెగ్రే, ఆక్సిటానియా ప్రజలతో వాణిజ్య సంబంధాలు అభివృద్ధి చేసుకున్నారు.[17][18]
ఇతర పురావస్తు నిక్షేపాలలో కనుగొనబడిన సమాధులు సెగుడెట్ (ఆర్డినో), ఫీక్సా డెల్ మోరో (సంట్ జూలియా డి లోరియా) రెండూ క్రీ.పూ 4900–4300 నాటి అండోరాలోని ఉర్ను సంస్కృతికి ఉదాహరణగా ఉన్నాయి.[17][18] కాంస్య యుగంలో ఈ చిన్న స్థావరాలు సంక్లిష్టమైన పట్టణంగా పరిణామం చెందడం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న పురాతన అభయారణ్యాలలో లభించిన ఇనుము, పురాతన నాణేలు, అవశేషాల లోహపు వస్తువులు ఇందుకు ఉదాహరణగా చూడవచ్చు.
అండోరాలోని కానిల్లో పారిషు ఉన్న రోక్ డి లెస్ బ్రూయిక్స్ (మంత్రగత్తెల రాయి) అభయారణ్యంలో లభించిన పురావస్తు అవశేషాలు, అంత్యక్రియల గుర్తులు, పురాతన గ్రంథాలు, చెక్కిన రాతి కుడ్యచిత్రాల వివరణలు బహుశా ఈప్రాంతం అతి ముఖ్యమైన నిర్మాణ సముదాయంగా ఉందని తెలియజేస్తున్నాయి. [19][18]
లోయ నివాసులు సాంప్రదాయకంగా ఐబీరియన్లతో సంబంధం కలిగి ఉన్నారు. చారిత్రాత్మకంగా క్రీస్తుపూర్వం 7 - 2 వ శతాబ్దాలలో అండోరాలో ఐబీరియా తెగ అండోసిన్స్ (అండోసిని) గా ఉన్నారు. అక్విటానియాస్, బాస్క్యూ, ఐబీరియా భాషల ప్రభావంతో స్థానికులు కొందరు ప్రస్తుత భాషాను అభివృద్ధి చేశారు. క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దానికి చెందిన గ్రీకు రచయిత పాలిబియస్ తన చరిత్రక రచనలలో వివరించిన ప్యూనిక్ యుద్ధాల వివరణలు ఈ సమూహానికి సంబంధించిన ప్రారంభ వ్రాతపూర్వక ఆధారాలుగా భావించబడుతున్నాయి.[20][21][18][22]
ఈ యుగానికి చెందిన చాలా ముఖ్యమైన అవశేషాలలో ప్రారంభ మార్కా హిస్పానికాలోని " కాజిల్ ఆఫ్ ది రోక్ డి ఎన్క్లార్ (రాక్ డి ఎంక్లేర్ కోట) [23] లెస్ ఎస్కాల్డెస్లోని ఎల్ అన్క్సియు, ఎన్క్యాంపులోని రోక్ డి లోరల్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. [18][22] క్రీ.పూ 2 వ శతాబ్దం నుండి సా.శ. 5 వ శతాబ్దం వరకు రోమన్ల ఉనికి నమోదు చేయబడింది. ఎక్కువ రోమన్ ఉనికిని కలిగి ఉన్న ప్రదేశాలలో సంట్ జూలియా డి లోరియాలోని క్యాంపు వెర్మెల్ (రెడ్ ఫీల్డ్), ఎన్క్యాంపులోని కొన్ని ప్రదేశాలలో, అలాగే రోక్ డి ఎన్క్లార్ ఉన్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేయబడిన వైన్, తృణధాన్యాలను రోమనా స్ట్రాటా సెరెటానా (స్ట్రాటా కాన్ఫ్లూయెటనా) మీదుగా రోమన్ నగరాలైన ఉర్గెలెట్ (ప్రస్తుతం లా సీ డి ఉర్గెల్) తో, సెగ్రే అంతటా విక్రయించబడ్డాయి.[18][24][23]
రోమన్ సామ్రాజ్యం పతనం తరువాత ఇది టోలెడో రాజ్యానికి సమీపంలో ఉన్న కారణంగా అండోరా విసిగోత్స్ ప్రభావానికి లోనయ్యింది. స్థానికంగా ఉర్గెల్ డియోసెస్ ఈ రాజ్యానికి మూలంగా ఉంది. ఈ లోయలో క్రైస్తవ మతం వ్యాపించిన సమయంలో ఈ లోయలో విసిగోతులు 200 సంవత్సరాలు నివసించారు. ఐబీరియా ద్వీపకల్పంలో ఎక్కువ భాగాన్ని ముస్లిం సామ్రాజ్యం ఆక్రమించిన తరువాత అండోఋఆలోని పాలక విసిగోతుల స్థానాన్ని ముస్లిములు భర్తీ చేసారు. ఈ ఆక్రమణదారుల నుండి రక్షించుకోవడానికి ఇక్కడి ప్రజలు ఫ్రాంకులను ఆశ్రయించారు.[25]
పుయ్మోర్న్సు నౌకాశ్రయం (సెర్డన్యా) సమీపంలో మూర్సుతో పోరాడినందుకు బదులుగా చార్లెస్ ది గ్రేట్ (చార్లెమాగ్నే) అండోరను ప్రజలకు మార్క్ అల్ముగావర్ నాయకత్వంలోని ఐదు వేల మంది సైనికుల బృందం శిక్షణ కొరకు ఒక శిక్షణాశిబిరాన్ని మంజూరు చేసాడు.[26]
అండోరా ఫ్రాంకిషు సామ్రాజ్యం మార్కా హిస్పానికాలో భాగంగా ఉర్గెల్ కౌంట్ చేత పాలించబడింది. తరువాత ఇది ఉర్గెల్ డియోసెస్ బిషప్ చేత పాలించబడింది.[27]
988 లో రెండవ బోర్రెల్, కౌంట్ ఆఫ్ అర్గెల్ సెర్డన్యాలోని భూమికి బదులుగా అండోర్రా లోయలను ఉర్గెల్ డియోసెస్కు ఇచ్చారు.[28] అప్పటి నుండి సియు ఉర్గెల్ కేంద్రంగా ఉర్గెల్ బిషప్, అండోరా సహ-యువరాజు ఈ ప్రాంతాన్ని పాలించారు.[29]
ఆక్టా డి కన్సాగ్రేసి ఐ డోటాసిక్ డి లా కాటెడ్రల్ డి లా సీ డి ఉర్గెల్ (డీడ్ ఆఫ్ కన్సెరేషన్ అండ్ ఎండోమెంట్ ఆఫ్ కేథడ్రల్ ఆఫ్ లా సీ డి ఉర్గెల్) పత్రంలో అండోరా ఒక భూభాగంగా పేర్కొనబడింది. 839 నాటి పాత పత్రం అండోరన్ లోయల ఆరు పాత పారిషులను (పరిపాలనా విభాగం) వర్ణిస్తుంది.[30]
1095 కి ముందు అండోరాకు ఎలాంటి సైనిక రక్షణ లేదు. ఉర్గెల్ కౌంటు అండొర్రా లోయలను తిరిగి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు గ్రహించిన ఉర్గెల్ బిషపు [29] సహాయం, రక్షణ కావాలని కాబోయట్ ప్రభువును కోరాడు. బదులుగా 1095 లో కాబోయట్ ప్రభువు, ఉర్గెల్ బిషప్ అండోరా మీద సహ సార్వభౌమాధికారాన్ని ప్రకటించారు. కాబోయట్ ఆర్నావు కుమార్తె ఆర్నాల్డా, కాస్టెల్బే విస్కౌంట్ను వివాహం చేసుకున్నది. వారి కుమార్తె ఎర్మెసెండా, [31] ఫోయిక్సు కౌంటు రెండవ రోజర్-బెర్నార్డును వివాహం చేసుకున్నది. రెండవ రోజర్-బెర్నార్డు, ఎర్మెసెండా లిద్దరూ ఉర్గెల్ బిషపుతో కలిసి అండోరాను పాలించారు.
13 వ శతాబ్దంలో కాథర్ క్రూసేడ్ తరువాత ఉర్గెల్ బిషపు, ఫోయిక్స్ కౌంటు మధ్య సైనిక వివాదం తలెత్తింది. 1278 లో అరగోన్ రాజు, రెండవ పీటర్ మధ్యవర్తిత్వంతో బిషపు, కౌంటు కలిసి మొదటి పార్జేజ్ మీద సంతకం చేయడం ద్వారా వివాదం పరిష్కరించబడింది. ఇది అండోర్రా సార్వభౌమరాజ్యాన్ని ఫోయిక్స్ కౌంటు కలిసి పాలించేలా చేసింది.[29] ఇది రాజ్యానికి భూభాగం, రాజకీయ రూపాన్ని ఇచ్చింది.[30][32]
1288 లో ఫోయిక్స్ కౌంటు రోయిక్ డి ఎంక్లేరులో కోటను నిర్మించమని ఆదేశించినందుకు వివాదం తలెత్తిన తరువాత రెండవ పార్జేజ్ మీద సంతకం చేయబడింది.[30][32] ప్యూగ్సర్డేకు చెందిన నోబెల్ నోటరీ జౌమ్ ఒరిగ్ ఈ పత్రాన్ని ధ్రువీకరించింది. తరువాత దేశంలో సైనిక నిర్మాణాలు నిర్మించడం నిషేధించబడ్డాయి.[34][30]
1364 లో సహ-యువరాజులకు దేశ రాజకీయ సంస్థ అండొర్రా ప్రతినిధిగా సిండిక్ (ఇప్పుడు పార్లమెంటు ప్రతినిధి, అధ్యక్షుడు) పాలనాసౌలభ్యత కొరకు స్థానిక విభాగాలను (కమ్యూన్స్, క్వార్ట్సు, వీనాట్స్) రూపొందించింది. 1419 లో బిషపు ఫ్రాన్సిస్క్ టోవియా, కౌంటు మొదటి జాన్‌లు ఆమోదించిన తరువాత కాన్సెల్ డి లా టెర్రా (కాన్సెల్ జనరల్ డి లెస్ వాల్స్) స్థాపించబడింది. ఇది ఐరోపాలోని రెండవ పురాతన పార్లమెంటు. 1433 లో సహ-పాలకులతో సిండిక్ ఆండ్రూ డి అలేస్, జనరల్ కౌన్సిల్ జస్టిస్ కోర్టులను (లా కోర్ట్ డి జస్టిసియా), ఫోక్ ఐ లాక్ ( ఫైర్ అండ్ సైట్, పన్నులు వసూలు చట్టం) ఏర్పాటు చేయబడింది.[35][25]
9 వ శతాబ్దానికి పూర్వం శాంట్ విసెనే డి ఎంక్లేరు (ఎస్గ్లేసియా డి శాంటా కోలోమా) వంటి మతపరమైన నిర్మాణాల అవశేషాలు ఉన్నాయి. అండోర్రాలో 9 వ - 14 వ శతాబ్దాలలో సున్నితమైన రోమనీయ కళను అభివృద్ధి చేయబడింది. ముఖ్యంగా చర్చిలు, వంతెనలు, మతపరమైన కుడ్యచిత్రాలు, వర్జిన్ అండ్ చైల్డ్ (అవర్ లేడీ ఆఫ్ మెరిట్సెల్) విగ్రహాల నిర్మాణాలు నిర్మించబడ్డాయి.[25] ఈ రోజులలో అండోరా సాంస్కృతిక వారసత్వంలో భాగమైన రోమనీయ భవన నిర్మాతలు ఎస్గ్లేసియా డి సాంట్ ఎస్టీవె, సంట్ జోన్ డి కాసెల్లెస్, ఎస్గ్లేసియా డి సాంట్ మైఖేల్ డి ఎంగోలాస్టర్స్, సాంట్ మార్టి డి లా కార్టినాడా, మార్గినా, ఎస్కాల్స్, అనేక ఇతర నిర్మాణాలతో మధ్యయుగ వంతెనల మీద దృష్టి సారించారు.[36][37]
11 వ శతాబ్దం చివరలో కాటలాన్ భాష మూలంగా ఉన్న కాటలాన్ పైరినీస్ భాషారూపం అండోర్రాను ప్రభావితం చేసింది. అది అరగోన్ రాజ్యంలో విస్తరించడానికి దశాబ్దాల ముందే సామీప్యతగా ఉండి ప్రజలను ప్రభావితం చేయబడిన కారణంగా ఈ భాషను అండొర్రా ప్రజలు స్వీకరించారు.[38]
మధ్యయుగ కాలంలో స్థానిక జనాభా పశువుల పెంపకం, వ్యవసాయం, అలాగే ఉన్ని, చేనేత పనులను జీవనాధారంగా స్వీకరించారు. 11 వ శతాబ్దం చివరలో ఆర్డినో వంటి ఉత్తర పారిష్లలో మొదటి ఇనుప కర్మాగారాలు ప్రారంభించబడ్డాయి. 15 వ శతాబ్దం నుండి దేశంలో ఫోర్జెస్ కళాభివృద్ధిని శిల్పకళానిపుణులు ప్రశంశించారు. [25]
స్పెయిన్ నుండి వచ్చిన విచారణ కోర్టులు, దేశంలో వాడుకలో ఉన్న స్థానిక మంత్రవిద్య కారణంగా తలెత్తిన సమస్యలు, ఫ్రాన్సు నుండి హ్యూగెనోటు తిరుగుబాటుల ఫలితంగా 1601 లో ట్రిబ్యునల్ డి కోర్టు (హైకోర్టు ఆఫ్ జస్టిస్) సృష్టించబడింది. [39][40][41] సమయం గడిచేకొద్దీ అండోరా సహ శీర్షిక నవారే రాజులకు చేరింది. నవారేకు చెందిన మూడవ హెన్రీ ఫ్రాన్సు రాజు అయిన తరువాత ఆయన 1607 లో ఒక శాసనం జారీ చేశాడు. ఈ శాసనం ఆధారంగా ఫ్రెంచి దేశానికి అధిపతిగా, ఉర్గెల్ బిషపు (అండోరా సహపాలకులుగా ఉన్నట్లు) సహపాలకులు అయ్యారు. 1617 లో బాండోలెరిస్మే (బ్రిగేండేజ్) పెరుగుదలను ఎదుర్కోవటానికి కొంతకాలం మతతత్వ మండళ్ళ (జనాదరణ పొందిన మిలీషియా (సైన్యం) ) ను ఏర్పాటు చేసాయి.[42]
అండోరా 12 వ -14 వ శతాబ్దాలలో లోహపరిశ్రమ (ఫార్గాస్, ఫార్గా కాటలానా వంటి ఒక వ్యవస్థ), పొగాకు సిర్కా 1692, దిగుమతి వాణిజ్యానికి అనుమతి ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థ అదేస్థాయిలో కొనసాగింది. 1371 - 1448 లో సహ-పాలకులు అండొర్రా లా వెల్ల ఉత్సవాన్ని ధ్రువీకరించారు. అప్పటినుండి వాణిజ్యపరంగా అత్యంత ముఖ్యమైన జాతీయ ఉత్సవంగా ఇది వార్షికంగా నిర్వహించబడుతుంది. [43][44][45]
1604 లో స్థాపించబడిన ఎస్కాల్డెస్-ఎంగోర్డనీలో ఉన్న కాన్ఫ్రారియా డి పారైర్సు ఐ టీక్సిడోర్స్ అనుభవజ్ఞులైన నేతపనివారి గిల్డ్ ఈ దేశంలోని ఉష్ణ జలాలను సద్వినియోగం చేసుకుంది. ఈ సమయానికి దేశం ప్రోహోమ్స్ (సంపన్న సమాజం), కాసేలర్స్ (మిగిలిన జనాభా చిన్న ఆర్థిక సముపార్జన) ద్వారా పుబిల్లా, హెర్యూ సంప్రదాయం ఉద్భవించింది.[47][48][49][50]
స్థాపించబడిన మూడు శతాబ్దాల తరువాత కాన్సెల్ డి లా టెర్రా 1702 లో దాని ప్రధాన కార్యాలయం, " కాసా డి లా వాల్ లో ట్రిబ్యునల్ డి కార్ట్స్ "ను ఏర్పాటు చేసింది. 1580 లో నిర్మించిన మేనరు హౌస్ బుస్కెట్స్ కుటుంబానికి ఒక గొప్ప కోటగా పనిచేసింది. అండోర్రా పారిషులు, అండొర్రా నియోజకవర్గం ఒక్కొక్కదాని నుండి ఒక్కొకరుచొప్పున పార్లమెంటు లోపల ఆరు కీలక ప్రతినిధులు (అర్మారి డి లెస్ సిస్ క్లాజ్) లను నియమించారు. తరువాత ఆండొర్రా రాజ్యాంగం, ఇతర పత్రాలు, చట్టాలు రూపొందించబడ్డాయి.[51][52]
రీపర్స్ యుద్ధం, స్పానిష్ వారసత్వ యుద్ధం రెండింటిలోనూ అండొర్రా ప్రజలు (తటస్థ దేశంగా చెప్పుకుంటున్నప్పటికీ) 1716 లో తగ్గించబడిన వారి హక్కుల పునరుద్ధరణ కొరకు కాటలాన్లకు మద్దతు ఇచ్చారు. అండొర్రాలో కాటలాన్ రచనలను ప్రోత్సహించిన కారణంగా సాంస్కృతిక రచనలలో భాగంగా బుక్ ఆఫ్ ప్రివిలేజెస్ (లిబ్రే డి ప్రివిలేగిస్ డి 1674), ఆంటోని ఫిటర్ ఐ రోసెల్ రాసిన మాన్యువల్ డైజెస్ట్ (1748) లేదా ఆంటోని పుయిగ్ రాసిన పొలిటీ ఆండోర్ (1763) వంటి రచనలు వెలువరించబడ్డాయి.[53][54]
1809 లో ఫ్రెంచి విప్లవం తరువాత మొదటి నెపోలియన్ సహ-రాజ్యాన్ని తిరిగి స్థాపించి మధ్యయుగ ఫ్రెంచి ఆధిపత్యాన్ని తొలగించాడు. 1812–1813లో మొదటి ఫ్రెంచి సామ్రాజ్యం ద్వీపకల్ప యుద్ధం (గెరా పెనిన్సులర్) సమయంలో కాటలోనియాను స్వాధీనం చేసుకుని ఈ ప్రాంతాన్ని నాలుగు డిపార్టుమెంట్లుగా విభజించింది. తరువాత అండొర్రా పుయిగ్సర్డే జిల్లాలో భాగంగా ఉంది. 1814 లో సామ్రాజ్య ఉత్తర్వు అండొర్రా స్వాతంత్ర్యం, ఆర్థిక వ్యవస్థను తిరిగి స్థాపించింది.[55][56][57]
ఈ కాలంలో అండోర్రా మధ్యయుగ సంస్థలు, గ్రామీణ సంస్కృతి పెద్దగా మారలేదు. 1866 లో సిండిక్ గుల్లెం డి అరేనీ-ప్లాండోలిట్ సంస్కరణలకు ఓటింగు ద్వారా ఎన్నికచేయబడిన 24 మంది సభ్యుల కౌన్సిల్ జనరల్ నాయకత్వం వహించింది. గతంలో రాజ్యాన్ని పాలించిన కులీన రాజరికాన్ని కౌన్సిల్ జనరల్ భర్తీ చేసింది.[58] సహ-పాలకుల చేత ధ్రువీకరించబడిన రాజ్యాంగం నిర్మాణం తరువాత కొత్త సంస్కరణ (నోవా సంస్కరణ) ప్రారంభమైంది.[59] అండోరా త్రివర్ణ జెండా వంటి చిహ్నాలు స్థాపించబడ్డాయి. లోయ నివాసుల అవసరాలదృష్ట్యా కొత్త సేవా ఆర్థిక వ్యవస్థ ఉద్భవించింది. హోటళ్ళు, స్పా రిసార్ట్స్, రోడ్లు, టెలిగ్రాఫ్ లైన్లు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడం ప్రారంభించబడ్డాయి.[60][61][62]
సహ - పాలక అధికారులు కాసినోలు, బెట్టింగ్ గృహాలను దేశవ్యాప్తంగా నిషేధించారు. ఈ నిషేధం వల్ల అండొర్రా ప్రజలలో ఆర్థికసంబంధిత వివాదం ఏర్పడింది. 1881 డిసెంబరు 8 న విప్లవకారులు సిండిక్ ఇంటి మీద దాడి చేసి జోన్ ప్లా ఐ కాల్వో, పెరే బార్ ఐ మాస్ నేతృత్వంలోని తాత్కాలిక విప్లవ మండలిని స్థాపించిన తరువాత ఈ వివాదం 1881 నాటి విప్లవానికి దారితీసింది. తాత్కాలిక విప్లవ మండలి విదేశీ సంస్థల కాసినోలు, స్పాకేంద్రాల నిర్మాణానికి అనుమతించింది.[64]
1881 జూన్ 7 నుండి 9 వరకు ఎస్కాల్డెస్-ఎంగోర్డనీలో విప్లవశక్తులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా కెనిల్లో, ఎన్క్యాంప్ విధేయులు ఆర్డినో, మసానా పారిషులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.[65] ఒక రోజు పోరాటం తరువాత జూన్ 10 న ఎస్కాల్స్ వంతెన ఒప్పందం కుదుర్చుకుంది.[66][67][68] కౌన్సిల్ స్థానంలో, కొత్త ఎన్నికలు జరిగాయి. తూర్పు ప్రాంతం " క్వెస్టిక్ డి అండోరా " పేరుతో విభజించబడినందున ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.[69] 1882 - 1885 లలో కెనిల్లో సమస్యల ఆధారంగా బిషప్ అనుకూల వర్గం, ఫ్రెంచ్ అనుకూల వర్గం, జాతీయవాదుల మధ్య పోరాటాలు కొనసాగాయి.[70][71][72]
కాటలాన్ రెనైక్సేనియా సాంస్కృతిక ఉద్యమంలో అండొర్రా పాల్గొన్నది. 1882 - 1887 మధ్య మొట్టమొదటి విద్యాలయాలు ఏర్పడ్డాయి. విద్యావిధానంలో అధికారిక భాష అయిన కాటలాన్తో కలిసి త్రిభాషావాదం తలెత్తింది. ఫ్రాన్సు, స్పెయిన్ నుండి రచయితలు దేశం జాతీయతను మేల్కొలిపారు. జాసింట్ వెర్డాగుర్ 1880 లలో ఆర్డినోలో నివసించాడు. అక్కడ ఆయన రెనైక్సేనియాకు సంబంధించిన రచనలను రచయిత - ఫోటోగ్రాఫర్ జోక్విం డి రిబాతో వ్రాసి పంచుకున్నాడు.
1848 లో ఫ్రోమెంటల్ హాలెవి ఒపెరా లే వాల్ డి అండోర్రే ఐరోపాలో గొప్ప విజయాన్ని సాధించింది. ఇక్కడ ద్వీపకల్ప యుద్ధంలో సాహిత్యరూపంలో లోయల జాతీయ స్పృహ బహిర్గతమైంది.[73][74][75]
మొదటి ప్రపంచ యుద్ధంలో అండొర్రా ఇంపీరియల్ జర్మనీ మీద యుద్ధం ప్రకటించినప్పటికీ నేరుగా పోరాటంలో పాల్గొనలేదు. కొంతమంది ఆండొర్రాన్లు ఫ్రెంచి సైనికబృందంలో భాగంగా ఈ సంఘర్షణలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.[76] ఇది వెర్సైల్లెస్ ఒప్పందంలో చేర్చబడనందున ఇది 1958 వరకు అనధికారిక పోరాట స్థితిలో ఉంది.[77]
1933 విప్లవం - ఎఫ్.హెచ్.ఎ.ఎస్.ఎ సమ్మెలు (వాగ్స్ డి ఎఫ్.హెచ్.ఎ.ఎస్.ఎ) కారణంగా ఎన్నికలకు ముందు సంభవించిన సామాజిక అశాంతి తరువాత ఫ్రాన్సు అండొర్రాను ఆక్రమించింది; జోవ్స్ ఆండొరానుల (స్పానిషు సి.ఎన్.టి, ఎఫ్.ఎ.ఐ.కి సంబంధించిన కార్మిక సంఘ సమూహం) నేతృత్వంలోని తిరుగుబాటు రాజకీయ సంస్కరణలకు పిలుపునిచ్చింది.[78] తరువాత అండోర్రానులు అందరికి సార్వత్రిక ఓటు హక్కు, ఎన్క్యాంపులోని ఎఫ్.హెచ్.ఎస్.ఎ. జలవిద్యుత్ కేంద్రం నిర్మాణంలో పనిచేసిన స్థానిక, విదేశీ కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు కృషిచేసింది.[79] 1933 ఏప్రిల్ 5 న జోవ్స్ అండోర్రానులు అండొర్రా పార్లమెంటును స్వాధీనం చేసుకున్నారు.[80] ఈ చర్యలకు ముందు కల్నల్ రెనే-జూల్స్ బౌలార్డ్ 50 జెండార్మ్లతో రావడం, 200 స్థానిక మిలీషియాలను సమీకరించడం, కొంతమంది సాండిక్ ఫ్రాన్సిస్ కైరాట్ నేతృత్వంలో సైన్యాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించారు. [81]
1934 జూలై 6 న, సాహసికుడు, కులీనుడు బోరిస్ స్కోసిరెఫ్ దీనిని పన్ను స్వర్గం చేసి, విదేశీ పెట్టుబడుల స్థాపన చేయడం ద్వారా దేశసంపద, స్వేచ్ఛ, ఆధునికీకరణకు వాగ్దానం చేస్తూ స్వీయ సార్వభౌమాధికారిగా ప్రకటించడానికి జనరల్ కౌన్సిల్ సభ్యుల మద్దతు పొందాడు. 1934 జూలై 8 న బోరిస్ ఉర్గెల్లో ఒక ప్రకటనను విడుదల చేశాడు. తనను తాను అండోరా రాజుగా మొదటి బోరిస్ ప్రకటించుకున్నాడు. [82] ఏకకాలంలో ఉర్గెల్ బిషపు మీద యుద్ధాన్ని ప్రకటించాడు. జూలై 10 న రాజు చేత రాజ్యాంగం ఆమోదించబడింది. [83] ఆయనను జూలై 20 న సహ-పాలకులు, బిషప్ జస్టే గిటార్ట్ ఐ విలార్డెబే, వారి అధికారులు అరెస్టు చేసి చివరికి స్పెయిన్ నుండి బహిష్కరించారు.[84] 1936 నుండి 1940 మద్యకాలంలో స్పానిష్ సివిల్ వార్, [85] ఫ్రాంకోయిస్టు స్పెయిన్[86] నుండి అంతరాయం జరగకుండా రాజ్యాంగాన్ని పొందటానికి ప్రసిద్ధ కల్నల్ రెనే-జూల్స్ బౌలార్డ్ నేతృత్వంలోని ఫ్రెంచ్ సైనిక బృందం అండోరాలో ఉంచబడింది. 1933 విప్లవం తరువాత గణతంత్రం అభివృద్ధి చెందింది.[87] స్పానిషు అంతర్యుద్ధం సమయంలో, అండోరా నివాసులు రెండు వైపుల నుండి వచ్చిన శరణార్థులను స్వాగతించారు. వచ్చినవారిలో చాలామంది దేశంలో శాశ్వతంగా స్థిరపడ్డారు. తద్వారా తరువాతి ఆర్థిక వృద్ధికి, అండోర పెట్టుబడిదారీ యుగంలోకి ప్రవేశించడానికి ఇది దోహదపడింది.[88][89] ఫ్రాంకోయిస్ట్ దళాలు యుద్ధం తరువాతి దశలలో అండొర్రా సరిహద్దుకు చేరుకున్నాయి.[90]
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అండోరా తటస్థంగా ఉన్నప్పటికీ విచి ఫ్రాన్సు, ఫ్రాంకోయిస్ట్ స్పెయిన్ మధ్య ఒక ముఖ్యమైన అక్రమ రవాణా మార్గంగా ఉంది.[92] [93] యుద్ధ సమయంలో, బహిరంగంగా నియంతృత్వ రాజ్యాలుగా ప్రకటించిన రెండు రాజ్యాల మధ్య నివసించిన విదేశీ కౌన్సిల్, శరణార్థుల ప్రవేశించడానికి అనుమతించడం, బహిష్కరించడం, ఆర్థిక ప్రయోజనాల కోసం నేరాలు, పౌరుల హక్కుల తగ్గింపు[94] వంటి చర్యలతో ఫ్రాంకోయిజానికి చాలా దగ్గరగా, సానుభూతితో ఉన్నారు.[95][96] జనరల్ కౌన్సిల్ అండోరా సార్వభౌమాధికారం మనుగడ, రక్షణలో తన రాజకీయ, దౌత్య చర్యలను సమర్థించింది. ఇది చివరకు రెండు ఘర్షణల నుండి సురక్షితంగా బయటపడింది. [96][97] ఈ విధంగా నాజీ అణచివేతకు గురైన ఐరోపా నుండి వస్తున్న వారికి సహాయం చేయడానికి కొన్ని సమూహాలు స్వీయ ఏర్పాటు చేసుకున్నాయి. అదే సమయంలో దేశం మనుగడకు సహాయపడటానికి స్మగ్లింగులో పాల్గొంటుంది. అత్యంత ప్రాచుర్యం పొందిన సమూహాలలో బ్రిటిషు మి 6 తో సంబంధం కొనసాగించింది. ఇది దాదాపు పారిపోయినవారిలో 400 మందికి సహాయపడింది.[98] వీరిలో మిత్రరాజ్యాల సైనిక సిబ్బంది కూడా ఉన్నారు.[99][100] 1941-1944 దేశంలోని యాక్సిస్ అనుకూల ఇన్ఫార్మర్లు, గెస్టపో ఏజెంట్ల మద్య కొన్ని పోరాటాలు జరిగాయి.[101]
రాజధాని నగరంలో నిరంకుశ పాలన పరిస్థితుల కారణంగా సంస్కృతి, సినిమా కళల స్మగ్లింగు బ్లాక్ మార్కెట్ నెట్వర్క్ ఉంది. కొన్ని ప్రదేశాలలో హోటల్ మిరాడోర్ లేదా క్యాసినో హోటల్ స్థాపించబడ్డాయి.[102] దగ్గరి భావజాల ప్రజల సమావేశ స్థలం అండొర్రా - స్పానిష్ రిపబ్లికనిజం, ఫ్రీ ఫ్రాన్స్ సమీపంలో ఉంది.[103] యుద్ధం తరువాత ఫిల్మ్ సొసైటీలు ఏర్పడ్డాయి. సెన్సార్ చేయబడిన ఫ్రాంకో స్పెయిన్ సినిమాలు, సంగీతం, పుస్తకాలు దిగుమతి చేయబడ్డాయి. తద్వారా అండొర్రాలో కాటలాన్, విదేశీ ప్రజలకు సెన్సార్షిపు వ్యతిరేకంగా మారింది.[89] ఆక్సిటనీ ఫ్రెంచ్ రెసిస్టెన్స్‌తో ముడిపడి ఉన్న నిరంకుశత్వ వ్యతిరేక సంస్థ అండోరన్ గ్రూప్ (అగ్రూపమెంట్ అండోరే), ఫ్రెంచ్ ప్రతినిధి (వేగుర్) నాజీయిజంతో సహకరించారని ఆరోపించారు.[104]
పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు సామూహిక పర్యాటకానికి అనుమతిస్తూ, దేశం పన్ను మినహాయింపు ప్రకటించి పర్యాటకులకు అండొర్రా తలుపులు తెరిచింది. ఎఫ్.హెచ్.ఎ.ఎస్.ఎ. నిర్మాణం, ప్రొఫెషనల్ బ్యాంకింగు ద్వారా 1930 ల నుండి పెట్టుబడిదారీ విజృంభణ దిశగా మొదటి అడుగులు వేసింది.[105][106] బ్యాంకు అగ్రికోల్ (1930), క్రెడిట్ అండోరే (1949), తరువాత బాంకా మోరా (1952), బాంకా కాస్సనీ (1958), సోబాంకా (1960) బ్యాంకులు స్థాపించబడ్డాయి. 1930 ల చివరలో స్కీ రిసార్ట్సు, సాంస్కృతిక సంస్థల ప్రారంభోత్సవంతో స్కీయింగు, షాపింగ్ వంటి కార్యకలాపాలు పర్యాటక ఆకర్షణగా మారాయి.[105][107] మొత్తం మీద, పునరుద్ధరించిన హోటల్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. 1968 ఏప్రిల్ న ఒక సామాజిక ఆరోగ్య బీమా వ్యవస్థ సృష్టించబడింది. [108]
భవిష్యత్తు కోసం ప్రణాళిక: 1967 - 1969 లో ఫ్రెంచ్ సహ-యువరాజు చార్లెస్ డి గల్లే అధికారిక సందర్శనతో, మానవ హక్కులు, అంతర్జాతీయ పారదర్శకత చట్రంలో ఆర్థికాభివృద్ధి, జాతీయ డిమాండ్లకు ఆమోదం లభించింది.[111][112]
అండొర్రా "అండోరన్ డ్రీం"[113] (అమెరికన్ డ్రీమ్‌కి సంబంధించి) అని పిలువబడే యుగంలో అండొర్రా నివసించారు: దేశంలోని సామూహిక సంస్కృతి ఆర్థిక వ్యవస్థ, సంస్కృతిలో సమూల మార్పులను అనుభవాలను ఎదుర్కొంటుంది. ఈ సంఘటనకు ప్రస్తుత ఐరోపాలోని నంబరు వన్ ట్రాన్స్మిటర్ మ్యూజికల్ రేడియో స్టేషన్ ఋజువుగా ఉంది.[114] అతిథులు, గొప్ప ప్రాముఖ్యత కలిగిన వక్తలతో చాన్సన్ ఫ్రాంకైజ్, స్వింగ్, రిథమ్ & బ్లూస్, జాజ్, రాక్ & రోల్ లేదా అమెరికన్ దేశీయ సంగీతం ప్రాముఖ్యత సంతరించుకున్నాయి.[115] అండోరా తలసరి జిడిపి, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో అత్యంత ప్రామాణిక దేశాల కంటే అధిక ఆయుర్దాయం సాధించింది.[105][116]
అండోరా యూరోపియన్ చరిత్ర ప్రధాన స్రవంతి వెలుపల ఒంటరిగా ఉనికిలో ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ కాకుండా ఇతర దేశాలతో కొన్ని సంబంధాలు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో అభివృద్ధి చెందుతున్న పర్యాటక పరిశ్రమతో రవాణా, సమాచార మార్పిడి అభివృద్ధి దేశాన్ని ఒంటరితనం నుండి తొలగించాయి. 1976 నుండి దేశం సార్వభౌమాధికారం, మానవ హక్కులు, అధికారాల సమతుల్యత, ఆధునిక అవసరాలకు అనుగుణంగా చట్టాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉన్నందున అండొర్రా సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉంది. 1982 లో, కో-ప్రిన్స్ ఆమోదంతో మొదటి ప్రధాన మంత్రి ఆస్కార్ రిబాస్ రీగ్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ బోర్డు (కాన్సెల్ ఎగ్జిక్యూటియు) పేరుతో గవర్న్ డి అండోరాను స్థాపించిన తరువాత మొదటి అధికార విభజన జరిగింది.[117] వాణిజ్య సంబంధాలను క్రమబద్ధీకరించడానికి 1989 లో ప్రిన్సిపాలిటీ యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.[118]
అండొర్రా రాజ్యాంగ ప్రజాభిప్రాయ సేకరణ తరువాత 1993 లో దాని రాజకీయ వ్యవస్థ ఆధునీకరించబడింది. రాజ్యాంగాన్ని సహ-పాలకులు, జనరల్ కౌన్సిల్ ముసాయిదా చేసి మార్చి 14 న [119] 74.2% ఓటర్ల 76% ఓటింగ్‌తో ఆమోదం పొందారు.[120] కొత్త రాజ్యాంగం ప్రకారం సంవత్సరం తరువాత మొదటి ఎన్నికలు జరిగాయి.[119] అదే సంవత్సరం అండొర్రా ఐక్యరాజ్యసమితి, కౌన్సిల్ ఆఫ్ యూరప్‌లో సభ్యదేశం అయింది.[121]
అండోరా 1996 లో 51 వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని అమెరికాతో అధికారికంగా దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇది దేశం ఆశించిన సరళీకరణ దృష్ట్యా చాలా ముఖ్యమైన విషయంగా భావించబడింది. సంస్థ సంస్కరణను కాపాడటానికి మొదటి జనరల్ సిండిక్ మార్క్ ఫోర్నే జనరల్ కాటన్లో జరిగిన అసెంబ్లీలో ఒక ప్రసంగంలో పాల్గొన్నారు. మూడు రోజుల తరువాత ఫోర్నే భాషా హక్కులను, అండోరా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి యూరోప్ కౌన్సిల్ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.[122] 2006 మధ్యకాలంలో ఐరోపా సమాఖ్య ద్రవ్య ఒప్పందం లాంఛనప్రాయంగా ఉంది. ఇది యూరోను అధికారిక మార్గంలో ఉపయోగించటానికి అండోరాకు అనుమతిస్తుంది. అలాగే దాని స్వంత యూరో కరెన్సీని నాణెం ముద్రించింది.[123][124]
అండొర్రాలో ఏడు పారిషులు ఉన్నాయి:
తూర్పు పైరినీసు పర్వత శ్రేణిలో ఉన్నందున, అండోరాలో ప్రధానంగా కఠినమైన పర్వతాలు ఉన్నాయి. వీటిలో ఎత్తైనది కోమా పెడ్రోసా ఎత్తు 2,942 మీటర్లు (9,652 అడుగులు). అండోరా సగటు ఎత్తు 1,996 మీటర్లు (6,549 అడుగులు).[125] వై (Y) ఆకారంలో మూడు ఇరుకైన లోయలుదేశాన్ని విభజిస్తున్నాయి. ఈ మూడు ఒకటిగా సంగమిస్తున్న కూడలి నుండి గ్రాన్ వాలిరా నది దేశాన్ని వదిలి (అండోరా అత్యల్ప స్థానం 840 మీ లేదా 2,756 అడుగులు) స్పెయిన్‌లో ప్రవేశిస్తుంది. అండోరా వైశాల్యం 468 చ.కి.మీ (181 చదరపు మైళ్ళు).
అండోరా బోరియల్ రాజ్యంలోని సర్కుంబోరియల్ ప్రాంతంలోని అట్లాంటిక్ యూరోపియన్ ప్రావింసుకు చెందినది. అండోరా భూభాగం పైరినీస్ కోనిఫెర్, మిశ్రమ అడవుల పర్యావరణ ప్రాంతానికి చెందినది.
అండోరాలో ఎత్తును బట్టి ఆల్పైన్, ఖండాంతర, సముద్ర వాతావరణం ఉంటుంది. అధిక ఎత్తులో ఉన్న కారణంగా శీతాకాలంలో సగటున మంచు అధికంగా కురుస్తుంది. వేసవిలో కొద్దిగా చల్లగా ఉంటుంది. భౌగోళిక వైవిధ్యం, లోయల విభిన్న ధోరణి, మధ్యధరా వాతావరణం విలక్షణమైన పర్వతవాతావరణం దేశం ఎత్తైన పర్వత వాతావరణం, మద్యధరా వాతావరణం కలిగిన కొండచరియలు సాధారణ వాతావరణ ఆధిపత్యానికి ఆటంకం కలిగిస్తూ గొప్ప వైవిధ్యాన్ని కలిగిన మైక్రొక్లైమేటు వాతావరణానికి ఆసరాగా ఉంటుంది. కనిష్ఠ, గరిష్ఠ పాయింట్లలో ఎత్తులో ఉన్న గొప్ప తేడాలు, మధ్యధరా వాతావరణం ప్రభావంతో కలిపి, అండోరన్ పైరినీసు వాతావరణాన్ని అభివృద్ధి చేస్తాయి.
సమృద్ధిగా వర్షాలు వసంత ఋతువు, వేసవిలో ఉంటాయి. ఇది శరదృతువు వరకు ఉంటుంది. (మే, జూన్, ఆగస్టు సాధారణంగా వర్షపు నెలలు) ; శీతాకాలంలో అట్లాంటిక్ సరిహద్దుల ప్రభావానికి లోబడి ఎత్తైన ప్రాంతాలలో మినహా వర్షపాతం తక్కువగా ఉంటుంది. అండోరన్ పర్వతాలలో గొప్ప హిమపాతం ఉంటుంది. సమశీతోష్ణ వేసవి, దీర్ఘమైన చల్లని శీతాకాలం ఉంటుంది.[126]
అండోరా అభివృద్ధి చెందవలసిన ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం ప్రధానమైనదిగా ఉంది. దీనికి జిడిపిలో సుమారు 80% వాటా ఉంది. సంవత్సరానికి 10.2 మిలియన్ల మంది పర్యాటకులు అండొర్రాను సందర్శిస్తారు.[8] అండోరా స్వేచ్ఛా విఫణి, వేసవి, శీతాకాలపు రిసార్టుల ద్వారా పర్యాటకులు ఆకర్షితులవుతారు.[127]
అండోరాలో ప్రధాన ఆదాయ వనరులలో ఒకటి స్కీ రిసార్ట్సు. పర్యాటకం, ఇది మొత్తం 175 కిమీ (109 మైళ్ళు) స్కీ గ్రౌండ్. ఈ క్రీడ సంవత్సరానికి 7 మిలియన్లకు పైగా సందర్శకులను, సంవత్సరానికి 340 మిలియన్ యూరోలను అంచనా వేస్తుంది, 2007 నుండి ప్రస్తుతం 2,000 ప్రత్యక్ష, 10,000 పరోక్ష ఉద్యోగాలను కొనసాగిస్తుంది.
పన్నురహిత స్వర్గస్థితితో బ్యాంకింగు రంగం కూడా ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదం చేస్తుంది (ఆర్థిక, బీమా రంగం జిడిపిలో సుమారు 19% [128]). [128]). ఆర్థిక వ్యవస్థలో ఐదు బ్యాంకింగు గ్రూపులు ఉన్నాయి, [129] ఒక ప్రత్యేక క్రెడిట్ ఎంటిటీ, 8 ఇన్వెస్ట్మెంటు మేనేజ్మెంట్ ఎంటిటీలు, 3 అసెట్ మేనేజ్మెంటు కంపెనీలు, 29 ఇన్సూరెన్సు కంపెనీలు, వీటిలో 14 విదేశీ భీమాసంస్థల శాఖలు ఉన్నాయి. ఇవి రాజ్యంలో పనిచేయడానికి అధికారం కలిగి ఉన్నాయి.[128]
వ్యవసాయ ఉత్పత్తి పరిమితం; 5% భూమి మాత్రమే వ్యవసాయం చేయదగినదిగా ఉంది. దేశ అవసరాలకు ఆహారాన్ని అధికంగా దిగుమతి చేసుకోవాలి. కొంతమంది స్థానికంగా పొగాకును పండిస్తారు. పశువుల పెంపకంలో దేశీయ గొర్రెల పెంపకం ప్రాధాన్యత వహిస్తుంది. తయారీ రంగంలో సిగరెట్లు, సిగార్లు, ఫర్నిచరు ప్రాధాన్యత వహిస్తుంటాయి. అండోరా సహజ వనరులలో జలవిద్యుత్, మినరల్ వాటర్, కలప, ఇనుము ధాతువు, సీసం ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి.[6]
అండోరా ఐరోపా సామాఖ్యలో సభ్యదేశం కానప్పటికీ ఒక ప్రత్యేక సంబంధం కలిగి ఉంది. అంటే తయారు చేసిన వస్తువుల వ్యాపారం కొరకు సుంకాలు (సుంకాలు లేవు), వ్యవసాయ ఉత్పత్తులకు ఐరోపాసామాఖ్య వెలుపలి సభ్యదేశంగా వ్యవహరిస్తుంది. అండోరాకు సొంతంగా కరెన్సీ లేదు. 1999 డిసెంబరు 11 వరకు ఫ్రెంచి ఫ్రాంక్, స్పానిష్ పెసెటా రెండింటినీ బ్యాంకింగు లావాదేవీలలో ఉపయోగించారు. ఈ రెండు కరెన్సీలను ఐరోపాసమాఖ్య కరెన్సీ యూరో ద్వారా భర్తీ చేశారు. 2002 డిసెంబరు వరకు ఫ్రాంక్, పెసెటా రెండింటి నాణేలు, నోట్లు అండోరాలో చట్టబద్దంగా చెలామణిలో ఉన్నాయి. 2014 నుండి అండొర్రా దాని స్వంత యూరో నాణేలను జారీ చేయడానికి చర్చలు జరిపింది.
అండోరా సాంప్రదాయకంగా ప్రపంచంలో అతి తక్కువ నిరుద్యోగ రేటును కలిగి ఉంది. 2009 లో నిరుద్యోగం 2.9% ఉంది.[130]
దిగుమతి సుంకాల ద్వారా ఆదాయాన్ని ప్రత్యేకంగా పెంచడంతో, అండోరా పన్ను స్వర్గంగా దాని స్థితి నుండి చాలాకాలంగా లాభపడింది. అయినప్పటికీ 21 వ శతాబ్దం ఐరోపా సార్వభౌమ- రుణ సంక్షోభం సమయంలో దాని పర్యాటక ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. కొంతవరకు స్పెయిన్‌లో వస్తువుల ధరల తగ్గుదల అండోరా డ్యూటీ-ఫ్రీ షాపింగును తగ్గించింది. ఇది నిరుద్యోగం పెరుగుదలకు దారితీసింది. 2012 జనవరి 1 న 10% వ్యాపార పన్ను ప్రవేశపెట్టబడింది.[131] ఒక సంవత్సరం తరువాత 2% అమ్మకపు పన్ను, ఇది మొదటి త్రైమాసికంలో 14 మిలియన్ల యూరోలకు పైగా వసూలు చేసింది.[132]
2013 మే 31 న ఐరోపా సమాఖ్య సభ్యులలో పన్ను స్వర్గాల ఉనికి మీద పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో జూన్ చివరి నాటికి ఆదాయపు పన్నును అండోరా చట్టబద్ధం చేయాలని ఉద్దేశించినట్లు ప్రకటించింది.[133] పారిసులో ప్రభుత్వ అధిపతి ఆంటోని మార్టి, ఫ్రెంచి అధ్యక్షుడు, అండోరా యువరాజు ఫ్రాంకోయిస్ హాలెండు మధ్య జరిగిన సమావేశం తరువాత ఈ ప్రకటన జారీ చేశారు. అండోరా "అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దాని పన్నును తీసుకురావడం" ప్రక్రియలో భాగంగా ఈ చర్యను హాలెండు స్వాగతించాడు.[134]
సంవత్సరం | జనాభా | ±% p.a. |
---|---|---|
1950 | 6,176 | — |
1960 | 8,392 | +3.11% |
1970 | 19,545 | +8.82% |
1980 | 35,460 | +6.14% |
1990 | 54,507 | +4.39% |
2000 | 65,844 | +1.91% |
2010 | 85,015 | +2.59% |
2015 | 78,014 | −1.70% |
Source: Departament d'Estadística d'Andorra[135] |
అండోరా జనసంఖ్య 77,281 (2016) గా అంచనా వేయబడింది. అండోరాన్లు కాటలాన్ సంతతికి చెందిన రొమాన్ల జాతికి చెందిన సమూహం.[3] 1900 లో జనసంఖ్య 5,000 ఉండేది.
ప్రజలలో మూడింట రెండొంతుల మంది నివాసితులకు అండోరా జాతీయత లేదు. ఎన్నికలలో ఓటు హక్కు లేదు. అంతేకాకుండా వారు ప్రధానమంత్రిగా పోటీ చేయడానికి అనుమతి లేదు.[136] ప్రైవేటు ఆధీనంలో ఉన్న సంస్థ మూలధన స్టాక్‌లో 33% కంటే ఎక్కువ కలిగి ఉండటానికి అవకాశం లేదు.[137][138][139][140]
చారిత్రాత్మక, అధికారిక భాషగా ఉన్న కాటలాన్ భాష ఒక రోమానుభాషాకుటుంబానికి చెందిన భాష. అండొరా ప్రభుత్వం కాటలాన్ వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది అండోరాలోని కాటలాన్ టోపోనిమి కోసం ఏర్పాటు చేసిన ఒక కమిషన్‌కు నిధులు సమకూరుస్తుంది (కాటలాన్: లా కామిసి డి డి టోపోనామియా డి అండోరా).అండొర్రా ప్రభుత్వం వలసదారులకు సహాయం చేయడానికి ఉచిత కాటలాన్ తరగతులను అందిస్తుంది. కాటలాన్ భాషలో అండొర్రా టెలివిజన్, రేడియో స్టేషన్లు నిర్వహించబడుతున్నాయి.
వలసలు చారిత్రక సంబంధాలు, దగ్గరి భౌగోళిక సామీప్యత కారణంగా అండొర్రా ప్రజలు స్పానిషు, పోర్చుగీసు, ఫ్రెంచి సాధారణంగా మాట్లాడతారు. చాలా మంది అండోరా నివాసితులు కాటలాన్తో పాటు వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మాట్లాడగలరు. ప్రధాన పర్యాటక రిసార్టులలో వివిధ ఆంగ్లం ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ సాధారణ ప్రజలు ఇంగ్లీషు తక్కువగా మాట్లాడతారు. జాతీయ " కౌన్సిల్ ఆఫ్ యూరప్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ నేషనల్ మైనారిటీసు " మీద సంతకం చేయని నాలుగు ఐరోపా దేశాలలో (ఫ్రాన్స్, మొనాకో, టర్కీతో కలిపి) [141] అండోరా ఒకటి.[142]
అబ్జర్వేటోరి సోషల్ డి అండోరా ఆధారంగా అండోరాలో భాషా వినియోగం క్రింది విధంగా ఉంది:[143]
Mother tongue | % |
---|---|
Catalan | 38.8% |
Spanish | 35.4% |
Portuguese | 15% |
French | 5.4% |
Others | 5.5% |
2005 3 PoliticaLinguistica.pdf |
అండోరా ప్రజలలో (88.2%) కాథలిక్కులు అధికంగా ఉన్నారు.[144] వారి పేట్రన్ సెయింటు " అవర్ లేడీ ఆఫ్ మెరిత్క్సెసెల్ ". ఇది అధికారిక మతం కానప్పటికీ రాజ్యాంగం కాథలిక్కు చర్చితో ఒక ప్రత్యేక సంబంధాన్ని అంగీకరించింది. ఆ సమూహానికి కొన్ని ప్రత్యేక అధికారాలను అందిస్తోంది.[విడమరచి రాయాలి] ఇతర క్రైస్తవ వర్గాలలో ఆంగ్లికన్ చర్చి, యూనిఫికేషన్ చర్చి, న్యూ అపోస్టోలిక్ చర్చి, యెహోవాసాక్షులు ఉన్నారు. ప్రధానంగా ఉత్తర ఆఫ్రికా వలసదారులతో రూపొందించబడిన స్వల్పసంఖ్యలో ముస్లిం సమాజం ఉంది. [145] హిందువులు, బహాయిల చిన్న సంఘం ఒకటి ఉంది, [146][147] అండొర్రాలో సుమారు 100 మంది యూదులు నివసిస్తున్నారు.[148] (అండోరాలోని యూదుల చరిత్ర చూడండి.)
6-16 సంవత్సరాల మద్య పూర్తి సమయం నిర్బంధ విద్యను అభ్యసించడం చట్టబద్ధం చేయబడింది. ద్వితీయ స్థాయి వరకు విద్యను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది.
పాఠశాల విద్య మూడు స్థాయిలు ఉన్నాయి. అవి అండోరా, ఫ్రెంచి, స్పానిషు. ఇవి వరుసగా కాటలాన్, ఫ్రెంచి, స్పానిషు మాధ్యమాలలో విద్యాబోధన చేస్తాయి. ఇవి ప్రధాన బోధనా భాషలుగా ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ వ్యవస్థకు హాజరుకావాలో ఎంచుకోవచ్చు. అన్ని పాఠశాలలు అండోరన్ అధికారులచే నిర్మించబడ్డాయి, నిర్వహించబడుతున్నాయి. కాని ఫ్రెంచి, స్పానిషు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు చాలా వరకు ఫ్రాన్సు, స్పెయిను దేశాల నుండి వేతనాలు అందజేయబడుతుంటాయి. 39% అండోరా పిల్లలు 33% ఫ్రెంచి పాఠశాలలకు, 28% స్పానిషు పాఠశాలలకు హాజరవుతారు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ డి అండోరా (ఉడా) అండోరాలోని ఏకైక విశ్వవిద్యాలయంగా ఉంది. ఇది 1997 లో స్థాపించబడింది. విశ్వవిద్యాలయం ఉన్నత వృత్తి విద్యా కోర్సులతో పాటు నర్సింగు, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, విద్యా శాస్త్రాలలో మొదటి స్థాయి డిగ్రీలను అందిస్తుంది. అండోరాలోని రెండు గ్రాడ్యుయేటు పాఠశాలలు నర్సింగు స్కూల్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, రెండోది పిహెచ్డి విద్యను అందిస్తుంది.
భౌగోళిక క్లిష్టపరిస్థితి, తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండడం కారణంగా అండోరా విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి విద్యాకార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి ఆటంకాలుగా ఉన్నాయి. ఇది ప్రధానంగా స్పానిషు, ఫ్రెంచి విశ్వవిద్యాలయాలకు అనుసంధానించబడిన అధ్యయనాల కేంద్రంగా పనిచేస్తుంది. విశ్వవిద్యాలయంలోని వర్చువల్ స్టడీస్ సెంటర్ (సెంటర్ డి ఎస్టూడిస్ వర్చువల్స్) పర్యాటక రంగం, చట్టం, కాటలాన్ భాషాశాస్త్రం, హ్యుమానిటీస్, సైకాలజీ, పొలిటికల్ సైన్సెస్, ఆడియోవిజువల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, తూర్పు ఆసియా అధ్యయనాలు విభాగాలలో ఉన్నత విద్యను అందిస్తుంది. ఈ కేంద్రం నిపుణుల కోసం వివిధ పోస్టు గ్రాడ్యుయేటు కార్యక్రమాలు, నిరంతర-విద్యా కోర్సులను నిర్వహిస్తుంది.
20 వ శతాబ్దం వరకు అండోరాకు బయటి ప్రపంచానికి మద్య చాలా పరిమిత రవాణా సంబంధాలు ఉన్నాయి. దాని ఒంటరితనం దేశాభివృద్ధిని ప్రభావితం చేసింది. ఇప్పటికీ అండొర్రా సమీప ప్రధాన విమానాశ్రయాలు రెండూ (టౌలౌసు, బార్సిలోనా) అండోరా నుండి మూడు గంటల ప్రయాణదూరంలో ఉన్నాయి.
అండోరాలో 279 కిమీ (173 మైళ్ళు) పొడవైన రహదారి నెట్వర్కు ఉంది. వీటిలో 76 కిమీ (47 మైళ్ళు) పొడవైన రహదారి వెంట పాదచారుల బాట నిర్మించబడింది. అండోరా లా వెల్ల నుండి రెండు ప్రధాన రహదారులు స్పానిష్ సరిహద్దు వరకు సి.జి-1, ఎల్ పాస్ డి లా కాసా సమీపంలోని ఎన్వాలిరా కనుమ మీదుగా ఫ్రెంచి సరిహద్దు వరకు సి.జి-2. ఉన్నాయి.[149] బస్సు సేవలు మహానగర ప్రాంతాలన్నింటికి, అనేక గ్రామీణలకు అందుబాటులో ఉన్నాయి. చాలా ప్రధాన మార్గాలలో సేవలు గరిష్ఠ అరగంటకు ఒకంటే ఎక్కువసార్లు అందుబాటులో ఉన్నాయి. అండోరా నుండి బార్సిలోనా, టౌలౌసు వరకు తరచూ సుదూర బస్సు సర్వీసులు ఉన్నాయి. బస్సు సేవలు ఎక్కువగా ప్రైవేటు సంస్థలచే అందించబడుతున్నాయి. స్థానిక సేవలను కొన్నింటిని ప్రభుత్వం నిర్వహిస్తుంది.
అండోరా సరిహద్దులలో విమానాశ్రయాలు లేవు. అయితే లా మసానా (కామే హెలిపోర్ట్), అరిన్సాల్, ఎస్కాల్డెస్-ఎంగోర్డనీలలో వాణిజ్య హెలికాప్టర్ సేవలు ఉన్నాయి.[150][151] పొరుగున ఉన్న స్పానిషులో విమానాశ్రయం ఉంది. అండోరా-స్పానిషు సరిహద్దుకు దక్షిణాన 12 కిలోమీటర్లు (7.5 మైళ్ళు) కోమార్కా ఆల్ట్ ఉర్గెల్ ఉంది.[152] 2015 జూలై నుండి అండోరా-లా సీ డి ఉర్గెల్ విమానాశ్రయం మాడ్రిడ్, పాల్మా డి మల్లోర్కాకు వాణిజ్య విమానాలను నిర్వహించింది. ఎయిర్ అండోరా, అండోరా ఎయిర్లైంసుకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. 2018 జూలై 11 నాటికి విమానాశ్రయంలో రోజువారీ వాణిజ్య విమానాలు లేవు.
స్పెయిన్, ఫ్రాన్సులలో ఉన్న సమీప విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానసేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. సమీపంలో ఫ్రాన్సులోని పెర్పిగ్నన్ (అండోరా నుండి 156 కిలోమీటర్లు లేదా 97 మైళ్ళు), స్పెయిన్‌లోని లీడా (అండోరా నుండి 160 కిలోమీటర్లు లేదా 99 మైళ్ళు) ఉన్నాయి. సమీపంలోని అతిపెద్ద విమానాశ్రయాలు ఫ్రాన్సులోని టౌలౌసు (అండోరా నుండి 165 కిలోమీటర్లు లేదా 103 మైళ్ళు), స్పెయిన్‌లోని బార్సిలోనా (అండోరా నుండి 215 కిలోమీటర్లు లేదా 134 మైళ్ళు) విమానాశ్రయాలు ఉన్నాయి. బార్సిలోనా, టౌలౌసు విమానాశ్రయాల నుండి అండోరాకు గంటగంటకు బస్సు సర్వీసులు ఉన్నాయి.
సమీప రైల్వే స్టేషన్ అండోరాకు తూర్పున 10 కి.మీ (6 మైళ్ళు) ఎల్'హోస్పిటాలెట్-ప్రెస్-ఎల్'ఆండోర్రే ఉంది. ఇది 1,435మి.మీ గేజి (4 నాలో 8 1⁄2) - లాటూర్-డి-కరోల్ నుండి గేజ్ మార్గం (25 కి.మీ. లేదా 16 మైళ్ళు) ఉంది. టౌలౌసుకు, పారిసుకు ఫ్రెంచ్ హై-స్పీడ్ రైళ్ల ద్వారా ఈ మార్గాన్ని ఎస్.ఎన్.సి.ఎఫ్. నిర్వహిస్తుంది. లాటూర్-డి-కరోల్ విల్లెఫ్రాంచె-డి-కాన్ఫ్లెంట్కు 1,000 మీటర్ల (3 3 3 38) మీటర్ గేజ్ రైలు మార్గాన్ని కలిగి ఉంది. అలాగే ఎస్ఎన్సిఎఫ్ 1,435 ఛేర్ గేజ్ మార్గం పెర్పిగ్ననుతో అనుసంధానిస్తుంది. ఆర్.ఇ.ఎన్.ఎఫ్.ఇ. 1,668% (5) 5 21⁄32) బార్సిలోనాకు గేజ్ మార్గం ఉంది.[153][154] కొన్ని మాత్రమే ఎల్'హాస్పిటాలెట్-ప్రెస్-ఎల్'ఆండోర్రే, పారిస్ మధ్య ప్రత్యక్ష ఇంటర్సిటీస్ డి న్యూట్ రైలు సేవలు అందిస్తూ ఉన్నాయి.[155]
అండోరన్ జాతీయ టెలికమ్యూనికేషన్ సంస్థ ఎస్.ఒ.ఎం. అండోరాలో మొబైల్, లేండ్ లైన్ టెలిఫోన్, అంతర్జాల సేవలను నిర్వహిస్తుంది. దీనిని అండోరా టెలికాం (ఎస్.టి.ఎ) అని కూడా పిలుస్తారు. అదే సంస్థ డిజిటల్ టెలివిజన్, రేడియో జాతీయ ప్రసారాలకి అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను అందిస్తుంది.[156] 2010 లో గృహాలు, (ఎఫ్.టి.టి.హెచ్.) వ్యాపారాలు అన్నింటికి ప్రత్యక్ష ఆప్టికల్ ఫైబరు లింకును అందించిన మొదటి దేశంగా అండోరా నిలిచింది. [157]
మొట్టమొదటి వాణిజ్య రేడియో స్టేషన్ " రేడియో అండోరా " 1939 నుండి 1981 వరకు క్రియాశీలకంగా ఉంది.[158][159][160] 1989 అక్టోబరు 12 న జనరల్ కౌన్సిల్ రేడియో, టెలివిజను (ఒ.ఆర్.టి.ఎ) అనే సంస్థను రూపొందించి నిర్వహిస్తుంది. 2000 ఏప్రిల్ 13 న, పబ్లిక్ కంపెనీ రేడియో ఐ టెలివిసిక్ డి అండోరా (ఆర్.టి.వి.ఎ) లో మారింది.[161] 1990 లో అండొర్రాలో పబ్లిక్ రేడియో రేడియో నేషనల్ డి' స్థాపించబడింది. 1995 లో జాతీయ పబ్లిక్ టెలివిజన్ నెట్వర్కు అండోరా టెలివిసిక్ స్థాపించబడింది.[162] ఐపిటివి ద్వారా స్పెయిన్, ఫ్రాన్స్ నుండి అదనపు టీవీ, రేడియో స్టేషన్లు డిజిటల్ టెరెస్ట్రియల్ టెలివిజన్ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.[163]
అండొర్రాలో మూడు జాతీయ వార్తాపత్రికలు ఉన్నాయి;డియారి డి అండోరా, ఎల్ పెరిస్టిక్ డి అండోరా, బోండియా. అలాగే అనేక స్థానిక వార్తాపత్రికలు.[164] అండోరన్ ప్రచురణాసంస్థ చరిత్ర 1917 -1937 లో ప్రారంభం అయింది. ఈ మద్యకాలంలో " లెస్ వల్లాస్ డి అండొర్రా " (1917), " నొవా అండొర్రా " (1832), " అండొర్రా అగ్రికోలా " (1933) పత్రికలు స్థాపించబడ్డాయి.[165] 1974 లో " పొబ్లె అండొర్రా " మొదటి దినపత్రికగా గుర్తింపు పొందింది.[166] అలాగే దేశంలో అమెచ్యూరు రేడియో సొసైటీ ఉంది.[167] స్వతంత్రంగా పనిచేస్తున్న ఎ.ఎన్.ఎ. వార్తా ఏజెన్సీ ఉంది.[168]
అండొర్రా అధికారిక, చారిత్రక భాష కాటలాన్. అందువలన కాటలాన్ సంస్కృతి దాని స్వంత ప్రత్యేకత కలిగి ఉంది.
అండోరా కాంట్రాపాస్, మరాట్క్సా వంటి జానపద నృత్యాలకు నిలయం. ఇవి ముఖ్యంగా శాంట్ జూలి డి డి లారియాలో ఉనికిలో ఉంది. అండోరా జానపద సంగీతానికి దాని పొరుగుదేశాల సంగీతంతో సారూప్యతలు ఉన్నప్పటికీ కానీ ముఖ్యంగా కాటలానియా సంగీతంగా ప్రచారంలో ఉంది. ఇతర అండోరా జానపద నృత్యాలలో అండోరా లా వెల్లాలో " కాంట్రాప్సు ", ఎస్కాల్డెస్-ఎంగోర్డనీలో " సెయింట్ " అన్నే నృత్యం ఉన్నాయి. అండోరా జాతీయ సెలవుదినం అవర్ లేడీ ఆఫ్ మెరిట్సెల్ డే, సెప్టెంబరు 8.[6]
ప్రాముఖ్యత కలిగిన పండుగలు, సంప్రదాయాలలో మే మాసంలో కెనలిచ్ గాదరింగు, జూలైలో రోజర్ డి ఓర్డినో, మెరిట్సెల్ డే (అండోరా జాతీయ దినోత్సవం), అండోరా లా వెల్ల ఫెయిర్, సంట్ జోర్డి డే, శాంటా లూసియా ఫెయిర్ (పండుగ లా కాండెలెరా నుండి కానిల్లో వరకు), కార్నివాల్ ఆఫ్ ఎన్క్యాంప్, కారామెల్లెస్ పాట, సంత్ ఎస్టీవ్ ఉత్సవం, ఫెస్టా డెల్ పోబుల్ ఉన్నాయి.[169][170]
ఆండొరాన్ ఇతిహాసాలు చార్లెమాగ్నే పురాణం జనాదరణ కలిగి ఉన్నాయి. వైట్ లేడీ ఆఫ్ అవినీ, బునర్ డి ఓర్డినో, ఎంగోలాస్టర్సు సరస్సు పురాణం, లిజెండ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మెరిట్సెల్ వంటి జానపద కథనాలు ఆధారంగా ఫ్రాంకిషు రాజు ఈ దేశాన్ని స్థాపించాడని భావిస్తున్నారు.
అండొర్రా ఆహారవిధానం ప్రధానంగా కాటలాన్ అయినప్పటికీ ఇది ఫ్రెంచి, ఇటాలియన్ వంటకాల ఇతర అంశాలను కూడా స్వీకరించింది. దేశం వంటకాలు సెర్డన్యా, ఆల్ట్ ఉర్గెల్ పొరుగుదేశాలతో బలమైన సాంస్కృతిక సంబంధాల ఉన్న కారణంగా పొరుగుదేశాల ఆహారాలకు సమానమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. అండోర్రా వంటకాలు పర్వతలోయల సంస్కృతితో ప్రభావితమై ఉంటాయి. దేశంలోని విలక్షణమైన వంటకాలు క్విన్స్ ఆల్-ఐ-ఓలి, శీతాకాలపు బేరీకాయను చేర్చిన బాతు, డ్రైఫ్రూట్సును చేర్చి ఓవెన్లో కాల్చిన గొర్రె, పోర్కు సివెటు, మాస్సేగాడా కేక్, పియర్ చెట్లతో ఎస్కరోల్, కాన్ఫిటెడ్ డక్, పుట్టగొడుగులు, ఎస్కుడెల్లా, బచ్చలికూర ఎండుద్రాక్ష, పైన్ కాయలు, జెల్లీ మార్మాలాడే, సగ్గుబియ్యము (పుట్టగొడుగులు) చేర్చిన పంది మాంసం, డాండెలైన్ సలాడ్, అండోరాన్ ట్రౌట్. త్రాగడానికి, మల్లేడ్ వైన్, బీర్ కూడా ప్రాచుర్యం పొందాయి.[171] కాటలోనియాలోని పర్వత ప్రాంతాలలో ట్రిన్క్సాటు, ఎంబోటిట్స్, వండిన నత్తలు, పుట్టగొడుగులతో బియ్యం, పర్వత బియ్యం, మాటే వంటి కొన్ని వంటకాలు చాలా సాధారణం. [172]
ప్రీ-రోమనెస్కు, రోమనెస్క్ కళలు రాజ్యంలో వ్యక్తీకరించబడిన అతి ముఖ్యమైన కళాత్మక ప్రక్రియలుగా ఉన్నాయి. రోమనెస్క్ వన్ ప్రాంతీయ సమాజాల ఏర్పాటు (సామాజిక, రాజకీయ) శక్తి సంబంధాలు, జాతీయ సంస్కృతి గురించి తెలుసుకోవడానికి అనుమతిస్తుంది. మొత్తం నలభై రోమనెస్కు చర్చిలు ఉన్నాయి. ఇవి చిన్న కఠినమైన అలంకార నిర్మాణాలుగా ఉన్నాయి. అలాగే వంతెనలు, కోటలు, అదే కాలపు వాస్తుశైలిలో నిర్మించబడిన ఇళ్ళు పురాతన అండొర్రా వాస్తుకళకు సాక్ష్యంగా ఉన్నాయి.[173][174]
పైరినీస్లో వేసవి కాలం అగ్ని ఉత్సవాలను యునెస్కో సాంస్కృతిక వారసత్వంగా 2015 లో చేర్చారు.[175] మాడ్రియు-పెరాఫిటా-క్లారర్ వ్యాలీ అండోరా మొట్టమొదటి (2004 లో) అండొర్రా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉంది.[176][177]
అండోరా శీతాకాలపు క్రీడల అభ్యాసానికి ప్రసిద్ధి చెందింది. పైరినీస్ (3100 హెక్టార్లు, 350 కిలోమీటర్ల వాలుమార్గం), రెండు స్కీ రిసార్టులలో అండోరాలోని అతిపెద్ద స్కీ వాలుమార్గాలు ఉన్నాయి. గ్రాండ్వాలిరా అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన రిసార్టు. అండోరాలో ఆడే ఇతర ప్రసిద్ధ క్రీడలలో ఫుట్‌బాల్, రగ్బీ యూనియన్, బాస్కెట్‌బాల్, రోలర్ హాకీ ఉన్నాయి.
అండోరాలో సాధారణంగా రోలర్ హాకీ క్రీడాకారులు సి.ఇ.ఆర్.హెచ్. యూరో కప్, ఎఫ్.ఐ.ఆర్.ఎస్. రోలర్ హాకీ ప్రపంచ కప్‌లో ఆడతారు. 2011 లో 2011 యూరోపియన్ లీగ్ ఫైనల్ ఎనిమిదికి అండోరా ఆతిథ్యం ఇచ్చింది.
అండోరా జాతీయ ఫుట్‌బాల్ జట్టు అసోసియేషన్ ఫుట్‌బాల్‌లో ప్రాతినిధ్యంలో క్రీడలలో పాల్గొంటున్నది. 2019 అక్టోబరు 11 న జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో మోల్డోవాతో జరిగిన యూరోపియన్ ఛాంపియన్షిప్ క్వాలిఫైయర్‌లో ఈ జట్టు మొదటి విజయాన్ని సాధించింది.[178] అండోరాలో ఫుట్బాలును అండోరా ఫుట్‌బాల్ సమాఖ్య నిర్వహిస్తుంది - 1994 లో స్థాపించబడింది. ఇది అసోసియేషన్ ఫుట్‌బాల్ (ప్రైమెరా డివిసిక్, కోపా కాన్స్టిట్యూసిక్, సూపర్కోపా), ఫుట్సల్ జాతీయ పోటీలను నిర్వహిస్తుంది. 1996 లో అండోరా యు.ఇ.ఎఫ్.ఎ, ఎఫ్.ఐ.ఎఫ్.ఎ.లో చేరింది. 1942 లో స్థాపించబడిన అండోరా లా వెల్లాలో ఉన్న ఎఫ్.సి. అండోరా స్పానిషు బాల్ లీగ్ సిస్టంలో పోటీపడుతుంది.
రగ్బీ అండోరాలో ఒక సాంప్రదాయ క్రీడగా ఉంది. ఇది ప్రధానంగా దక్షిణ ఫ్రాన్సులో ప్రజాదరణ పొందింది. ఎల్స్ ఐసార్డ్స్ అనే మారుపేరుతో ఉన్న అండోరా జాతీయ రగ్బీ యూనియన్ జట్టు అంతర్జాతీయ వేదిక మీద రగ్బీ యూనియన్, రగ్బీ సెవెన్స్‌లో పాల్గొంటుంది.[179] అండోరా లా వెల్లాలో ఉన్న వి.పిసి. అండోరా ఎక్స్, వి. రగ్బీ జట్టు ఫ్రెంచి ఛాంపియన్షిప్పులో ఆడుతుంది.
1990 ల నుండి దేశంలో బాస్కెట్బాలుకు ఆదరణ అధికరించింది. అండోరా జట్టు బిసి అండోరా స్పెయిన్ టాప్ లీగ్ (లిగా ఎసిబి) లో ఆడింది.[180] 18 సంవత్సరాల తరువాత క్లబ్బు 2014 లో టాప్ లీగులోకి తిరిగి వచ్చింది.[181]
అండోరాలో సాధన చేసే ఇతర క్రీడలలో సైక్లింగు, వాలీబాలు, జూడో, ఆస్ట్రేలియా రూల్స్ ఫుట్బాలు, హ్యాండ్బాలు, స్విమ్మింగు, జిమ్నాస్టిక్సు, టెన్నిసు, మోటరుస్పోర్ట్సు ఉన్నాయి. 2012 లో అండోరా తన మొదటి జాతీయ క్రికెట్టు జట్టును ఏర్పాటు చేసింది. ఈ జట్టు డచ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిర్లీ ఆడ్ ప్లేసెస్ క్రికెట్టు క్లబ్బుతో స్వదేశీ మ్యాచి ఆడింది. ఇది అండోరా చరిత్రలో 1,300 మీటర్ల (4,300 అడుగులు) ఎత్తులో ఆడిన మొదటి మ్యాచిగా గుర్తింపు పొందింది.[182]
1976 లో అండోరా మొట్టమొదట ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నది. 1976 నుండి వింటర్ ఒలింపిక్ క్రీడలన్నింటిలో అండొర్రా పాల్గొన్నది. అండోరా స్మాల్ స్టేట్స్ ఆఫ్ యూరప్ ఆటలలో పోటీపడుతుంది, 1991 - 2005 లో రెండుసార్లు ఆతిథ్య దేశంగా ఉంది.
కాటలాన్ దేశాలలో ఒకటిగా అండోరా కాస్టెల్లర్స్ లేదా కాటలాన్ మానవ టవర్ బిల్డర్ల బృందానికి నిలయంగా ఉంది.. శాంటా కొలోమా డి అండోరా పట్టణంలో ఉన్న కాస్టెల్లర్స్ డి అండోరా (సి.ఎ) ను కాస్టెల్స్ పాలకమండలి కోఆర్డినాడోరా డి కొల్లెస్ కాస్టెల్లెరెస్ డి కాటలున్యా (సి.ఎ) గుర్తించింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.