చెన్నై జిల్లా
తమిళనాడు లోని జిల్లాచెన్నై జిల్లా, గతంలో దీనిని మద్రాసు జిల్లా అని పిలిచేవారు. ఇది భారతదేశం, తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో ఇది ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని జిల్లాలలో విస్థీర్ణంలో అతి చిన్నది.ఈ అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా. గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ ద్వారా నిర్వహించబడే చెన్నై నగరంతో జిల్లా సహసంబంధంగా ఉంది. దీని చుట్టూ ఉత్తరాన, పశ్చిమాన తిరువళ్లూరు జిల్లా, నైరుతిలో కాంచీపురం జిల్లా, దక్షిణాన చెంగ్లపట్టు జిల్లా, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. చెన్నై అనే పేరు విజయనగర సామ్రాజ్యంలో ఒక సైన్యాధిపతి తండ్రి, దామర్ల చెన్నప్ప నాయక్ నుండి వచ్చింది.
Read article