Map Graph

చెన్నై

తమిళనాడు రాజధాని నగరం

చెన్నై, తెలుగులో చెన్నపట్నం, చెన్నపట్నము, చెన్నపట్టణము పేరులు కూడా, భారత దేశములోని తమిళనాడు రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరం. చెన్నై నగరం బంగాళాఖాతం తీరాన ఉంది. చెన్నై: మద్రాస్. 1953 వరకు ఆంధ్రకు కూడా రాజధాని. మద్రాసు రాజధానిగా వుండే ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు. మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం అన్నాడు శ్రీరాములు. ఈ మహానగరం బంగాళాఖాతం కోరమాండల్ దక్షిణ తీరములో ఉంది. 2007 జనాభా గణాంకాల ప్రకారం చెన్నై నగర జనాభా 70.6 లక్షలు ఉండవచ్చునని అంచనా. ఈ ప్రపంచములోనే 34వ మహానగరమైన చెన్నైకి 375 సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశములో వాణిజ్య, పరిశ్రమల పరంగా చెన్నై నగరం మూడవ స్థానంలో నిలుస్తుంది. అంతే కాదు ఈ నగరంలో ఉన్న దేవాలయాల నిర్మాణశైలి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి చెన్నై నగరం కేంద్రబిందువు. భారతదేశములోని వాహన నిర్మాణ పరిశ్రమలు అన్నీ చెన్నై నగరంలో కేంద్రీకరించబడి ఉన్నాయి. అన్ని వాహననిర్మాణ పరిశ్రమలు ఉండడం వల్ల ఈ నగరాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఆగ్నేయా ఆసియా అని కూడా పిలుస్తారు. ఔట్ సోర్సింగ్ కూడా చాలా మటుకు చెన్నై నగరం నుండి జరుగుతోంది. ఈ నగరం బంగాళా ఖాతం తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ. బీచ్ రోడ్ ఉన్నది దీనినే మెరీనా బీచ్ అని పిలుస్తారు. ఈ నగరంలో క్రీడల పోటీలు కూడా నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధికి చెందిన ఏ.టి.పి. టెన్నిస్ పోటీలు, చెన్నై ఓపెన్ టెన్నీస్ పోటీలు నిర్వహించబడతున్నాయి. గిండీ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయం ఈ నగర పొలిమేర్లలోనే ఉంది. వన్యప్రాణీ సంరక్షణాలయాలు మహానగరాల పొలిమేర్లలో ఉండటం ప్రపంచములోనే అరుదు. అమెరికాలో కొలరాడో రాష్ట్రములో ఉన్న డెన్వర్ నగరంలో కూడా వన్యప్రాణీ సంరక్షణాలయం నగర పొలిమేర్లలో ఉండడంవళ్ల చెన్నైని డెన్వర్ తో పోలుస్తారు. చెన్నైని డెన్వర్ కి సోదర నగరంగా చెబుతారు. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.

Read article
దస్త్రం:ChennaiCentral2.JPGదస్త్రం:Tamil_Nadu_locator_map.svgదస్త్రం:India_Tamil_Nadu_locator_map.svgదస్త్రం:MylaporeKapaleeshwararTemple.jpgదస్త్రం:Anna-university.jpgదస్త్రం:M._A._Chidambaram_Stadium_Challenger_Trophy_2006.jpgదస్త్రం:Chennai.ATP.jpg