From Wikipedia, the free encyclopedia
స్టాలిన్ పూర్తి పేరు జోసఫ్ విస్సారినోవిక్ స్టాలిన్ (ఆంగ్లం Joseph Vissarionovich Stalin) (డిసెంబరు 18, 1878 – మార్చి 5, 1953).[1][2][3] అతను క్రమంగా తన అధికారాన్ని పటిష్ఠం చేసుకొని సోవియట్ యూనియన్‌కు బ్యూరోక్రాటిక్ పాలకుడు అయ్యాడు. ఆ కాలాన్ని సోవియట్ యూనియన్ చరిత్రలో స్టాలినిజమ్ అంటారు.[4] ఇతని అసలు ఇంటిపేరు "జుఘాష్విల్" (Jughashvili). ఇతడు రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు. 1922 నుండి 1953లో అతను మరణించేవరకు "సోనియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ" జనరల్ సెక్రటరీగా ఉన్నాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Joseph Stalin
Иосиф Сталин (in Russian)
იოსებ სტალინი మూస:Ka icon | |
---|---|
General secretary of the Central Committee of the Communist Party of the Soviet Union | |
In office 3 April 1922 – 16 October 1952 | |
అంతకు ముందు వారు | Vyacheslav Molotov (as Responsible Secretary) |
తరువాత వారు | Nikita Khrushchev (office reestablished) |
Chairman of the Council of Ministers | |
In office 6 May 1941 – 5 March 1953 | |
First Deputies | Nikolai Voznesensky Vyacheslav Molotov |
అంతకు ముందు వారు | Vyacheslav Molotov |
తరువాత వారు | Georgy Malenkov |
People's Commissar for Defense of the Soviet Union | |
In office 19 July 1941 – 25 February 1946 | |
Premier | Himself |
అంతకు ముందు వారు | Semyon Timoshenko |
తరువాత వారు | Nikolai Bulganin after vacancy |
Member of the Secretariat | |
In office 3 April 1922 – 5 March 1953 | |
Full member of the Presidium | |
In office 25 March 1919 – 5 March 1953 | |
Member of the Orgburo | |
In office 16 January 1919 – 5 March 1953 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Gori, Tiflis Governorate, Russian Empire | 1878 డిసెంబరు 18
మరణం | 1953 మార్చి 5 74) Kuntsevo Dacha, Kuntsevo, Russian SFSR, Soviet Union | (వయసు
సమాధి స్థలం | Lenin's Mausoleum, Moscow, Russian SFSR, Soviet Union (9 March 1953 – 31 October 1961) Kremlin Wall Necropolis, Moscow, Russian Federation (from 31 October 1961) |
జాతీయత | Georgian |
రాజకీయ పార్టీ | Communist Party of the Soviet Union |
జీవిత భాగస్వామి | Ekaterina Svanidze (1906–1907) Nadezhda Alliluyeva (1919–1932) |
సంతానం | Yakov Dzhugashvili, Vasily Dzhugashvili, Svetlana Alliluyeva |
పురస్కారాలు | మూస:Hero of the Soviet Union |
సంతకం | |
Military service | |
Allegiance | Soviet Union |
Branch/service | Soviet Armed Forces |
Years of service | 1943–1953 |
Rank | Marshal of the Soviet Union (1943–1945) Generalissimus of the Soviet Union (1945–1953) |
Commands | All (supreme commander) |
Battles/wars | World War II |
1924లో లెనిన్ మరణానంతరం అధికారం కోసం లియాన్ ట్రాట్స్కీ (Leon Trotsky), స్టాలిన్ల మధ్య పోటీ నెలకొంది. ఫలితంగా ట్రాట్స్కీ సోనియట్ యూనియన్ నుండి వెళ్ళగొట్టబడ్డాడు. స్టాలిన్ నాయకత్వంలో వ్యవసాయాన్ని సమిష్టీకరించడం జరిగింది, వేగవంతమైన పారిశ్రామికీకరణ కూడా జరిగింది. స్టాలిన్ యుగంలో ప్రైవేట్ మార్కెట్ ను పూర్తిగా రద్దు చేశారు. వ్యవసాయ సమిష్టీకరణని భూస్వాములు, మధ్య తరగతి రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిఘటించిన భూస్వాములు, రైతుల్ని అరెస్ట్ చెయ్యడం లేదా బలవంతంగా పని చేయించడం జరిగింది. సోవియట్ సమాఖ్యలో వ్యవసాయ సమిష్టీకరణ తరువాత గణణీయంగా ఆహారోత్పత్తి పెరిగింది. కానీ రష్యన్ జైళ్ళలో మాత్రం ఖైదీలకి సరైన ఆహారం, మందులు అందక చనిపోయారు. సోవియట్ సమాఖ్య నుంచి ఇతర దేశాలకు కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి అయ్యేవి. 1940 కాలంలో ప్రపంచం మొత్తంలోని 40% ఆహారం సోవియట్ సమాఖ్యలోనే ఉత్పత్తి అయ్యేది. రెండవ ప్రపంచ యుధ్ధ సమయంలో నాజీ జర్మనీ రష్యన్ వ్యవసాయ క్షేత్రాల పై బాంబులు వెయ్యడం వల్ల వ్యవసాయానికి భారీ నష్టం వచ్చింది. స్టాలిన్ చనిపోయిన తరువాత ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సోవియట్ సమాఖ్య వాటా 40% నుంచి 20%కి తగ్గిపోయింది.
1930 దశకం చివరిలో స్టాలిన్ ప్రారంభించిన మహా ప్రక్షాలన సమయంలో అనేక మంది రాజకీయ ప్రత్యర్థులని అరెస్ట్ చెయ్యడం, జైలు శిక్షలు లేదా మరణ శిక్షలు విధించడం జరిగింది. కొందరికి నామమాత్రపు విచారణతోనే మరణ శిక్షలు విధించిడం కూడా జరిగింది. దీని వల్ల స్టాలిన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఈ కాలంలో రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా నాజీ దురాక్రమణ రష్యా పై ఉప్పెనలా పడింది. ఎంతో నష్టాన్ని ఎదుర్కొని స్టాలిన్ అధ్వర్యంలో రష్యా సాగించిన పోరాటం నాజీ జర్మనీ ఓటమికి చాలా ముఖ్యమైన కారణమయ్యింది. (1939–1945),[5] అయితే యుద్ధం సమయంలోను, అంతకు పూర్వం స్టాలిన్ అనుసరించిన కొన్ని చర్యలు పెద్ద తప్పిదాలుగాను, వాటివల్ల సోవియట్ ప్రజలు చాలా నష్టపోయినట్లుగాను చరిత్రకారులు భావిస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత స్టాలిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ ఒక సూపర్ పవర్‌గా రూపొందింది. ఆ స్థానం సుమారు నాలుగు దశాబ్దాలు (1991 వరకు) కొనసాగింది.
స్టాలిన్ వ్యక్తిత్వం పై కూడా విమర్శలు ఉన్నాయి. ఇతను వ్యక్తి పూజ (personality cult)ని ప్రోత్సహించేవాడని విమర్శలు ఉన్నాయి. బెల్జియం దేశానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు లూడో మార్టెన్స్ మాత్రం ఈ విమర్శలని కొట్టి పారేస్తున్నరు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.