సెయింట్ మేరీస్ చర్చి

From Wikipedia, the free encyclopedia

సెయింట్ మేరీస్ చర్చిmap

సెయింట్ మేరీస్ చర్చిగా పిలువబడే బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్సంప్షన్ సికిందరాబాదులో నెలకొన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. ఈ చర్చి 2008 నవంబరు 7వ తేదీన బసిలికా స్థాయిని పొందింది. ఈ చర్చి సికిందరాబాదు సరోజినీదేవి రోడ్డులో ఉంది. 1850లో ఈ చర్చి నిర్మాణం పూర్తి అయ్యింది. మొదట ఈ చర్చిని కాథడ్రల్ ఆఫ్ ఆర్కిడయోసిస్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

త్వరిత వాస్తవాలు బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్సంప్షన్, మతం ...
బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అస్సంప్షన్
Thumb
మతం
Ecclesiastical or organizational statusబసిలికా
ప్రదేశం
ప్రదేశంసికిందరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం
భౌగోళిక అంశాలు17.4421°N 78.5022°E / 17.4421; 78.5022
మూసివేయి

చరిత్ర

ఈ చర్చిని బ్రిటిష్ ఆర్మీలోని ఐరిష్ కాథలిక్కుల కోసం ఫాదర్ డేనియల్ మర్ఫీ ప్రారంభించాడు.[2]అతడు 1839లో భారతదేశానికి వచ్చి ఈ చర్చిని 1840లో నిర్మించడం ఆరంభించాడు. ఈ చర్చి నిర్మాణం 1850లో పూర్తి అయింది. మేరీ మాతకు అంకితం చేయబడిన ఈ చర్చి హైదరాబాద్ స్టేట్ లో ఆ సమయంలో అతి పెద్దదిగా పేరుగడించింది.[2] ఇది 1886 వరకు కాథడ్రల్ చర్చిగా ఉన్నది. 1871లో ఇటలీ దేశపు టురిన్ పట్టణం నుండి వచ్చిన క్రైస్తవ సన్యాసినులు ఇక్కడ ఈ చర్చికి అనుబంధంగా సెయింట్ ఆన్స్ హైస్కూలును ప్రారంభించారు. ఈ చర్చి 2008 నవంబరు 7వ తేదీన 'బసిలికా' గుర్తింపు పొందింది.

వాస్తు శైలి

భారతీయ గోతిక్ వాస్తు శైలికి ఒక ఉదాహరణగా ఈ చర్చి భవనం నిలుస్తుంది. వొంపైన కమానులతో, మొనదీరిన అంటుగోడలతో ఈ చర్చి చూపరులను ఆకర్షిస్తుంది. మిగిలిన కాథలిక్ రోమన్ చర్చిలవలె ఈ చర్చి కూడా అనేక సెయింట్‌ల పేరు మీద దైవపీఠాలు ఉన్నాయి.

గంటలు

Thumb
క్రిస్మస్ పండుగ సందర్భంగా అలంకరించబడిన సెయింట్ మేరీస్ చర్చ్

ఈ చర్చిలో 1901లో ఇటలీ దేశం నుండి తెప్పించబడిన నాలుగు గంటలు ఉన్నాయి.[3] వాటిలో ఒక గంటకు పగుళ్లు వచ్చాయి.[3]

ఇవి కూడా చూడండి

ప్రార్థనా సమావేశాలు

ప్రతి దినము సమావేశం ఇంగ్లీషులో ఉదయం 6.గం. సాయంత్రం 6. గం. ఆదివారం సమావేశాలు:

  • ఉదయం 6 గం - తమిళం
  • ఉదయం 7 గం - ఇంగ్లీషు
  • ఉదయం 8 గం 15 ని - తెలుగు
  • ఉదయం 9 గం 15 ని - బాలబాలికల సమావేశం
  • ఉదయం 9 గం 30 ని - ఇంగ్లీషు
  • ఉదయం 11 గం 30 ని -ఇంగ్లీషు
  • సాయంత్రం 5 గం - ఇంగ్లీషు
  • సాయంత్రం 6 గం - ఇంగ్లీషు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.