కన్నడ, తమిళ, తెలుగు సినిమా నటి. From Wikipedia, the free encyclopedia
లీలావతి (జననం లీలా కిరణ్; 1937 - 2023 డిసెంబరు 8) కన్నడ, తమిళ, తెలుగు సినిమా నటి. 50 సంవత్సరాల సినిమా జీవితంలో 600లకు పైగా (కన్నడలోనే 400 కంటే ఎక్కువ) సినిమాలలో నటించింది. భక్త కుంబార, మన మెచ్చిదా మాదాడి, శాంతా తుకారాం సినిమాలలో తన నటనతో గుర్తింపు పొందింది. 1999లో డా. రాజ్‌కుమార్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకుంది.
లీలావతి 1937లో కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లా, బెల్తంగడిలో జన్మించింది. 6 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులను కోల్పోయింది.
చంచల కుమారి సినిమాలో చిన్న పాత్రలో, శంకర్ సింగ్ రూపొందించిన నాగ కన్నిక సినిమాలో నటించింది. తరువాత మహాలింగ భాగవతార్ కు చెందిన శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటక కంపెనీ బృందంలో చేరింది.[2] 1958లో సుబ్బాయినాయుడు తీసిన భక్త ప్రహ్లాద, మాంగల్య యోగ, ధర్మ విజయం, రణధీర కంఠీరవ వంటి చిత్రాలలో నటించింది.
రాణి హొన్నమ్మ సినిమా నుండి లీలావతి పూర్తిస్థాయి కథానాయికగా మారింది. సంత తుకారం, కంతేరేడు నోడు, కైవర మహాత్మే, గాలి గోపుర, కన్యారత్న, కులవధులు, వీర కేసరి, మన మెచ్చిదా మాదాడి వంటి చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించింది. గెజ్జె పూజ, డాక్టర్ కృష్ణలో సహాయక పాత్రలలో నటించింది, కర్ణాటక రాష్ట్ర అవార్డును కూడా అందుకుంది.
లీలావతి 2023 డిసెంబరు 8న బెంగుళూరు శివారు నెలమంగళలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. ఆమె వయసు 86 సంవత్సరాలు.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.