రంగు
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుది. రంగులు లేదా వర్ణాలు [1] మన కంటికి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. ప్రకృతిలో సాధారణంగా కనిపించే ఏడు రకాల రంగుల్ని సప్తవర్ణాలు అని పేర్కొంటారు . వివిధ రంగులు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం, పరావర్తనం మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400 nm to 700 nm మధ్యలో ఉంటాయి. ఈ కిరణాలను రెటినాలోని కోన్ కణాలు గుర్తించి, మెదడుకు సమాచారం అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 21న అంతర్జాతీయ రంగుల దినోత్సవం నిర్వహించబడుతోంది.[2]
సాధారణంగా తెల్లని కాంతిలో 7 రంగులుంటాయి. తెల్లని కాంతిని పట్టకం గుండా వక్రీభవనం చెంది అందలి అంశ రంగులుగా విడిపోవటాన్ని కాంతి విశ్లేషణ అంటారు. సూర్య కాంతిని పట్టకం గుండా విశ్లేషించినపుడు ఏడు రంగులు గల వర్ణపటం కనిపిస్తుంది. దీనినే వర్ణపటం అంటారు. ఈ ఏడు రంగులు ఇంద్ర ధనుస్సు లోని వర్ణాలను పోలి ఉంటాయి. అవి ఊదా (Violet), ఇండిగో (Indigo), నీలం (Blue), ఆకుపచ్చ (Green), పసుపుపచ్చ (Yellow), నారింజ (Orange), ఎఱుపు (Red). ఈ రంగులను గుర్తు పెట్టుకోవడానికి VIBGYOR ఆనే సంకేత పదమును సూచిస్తారు. ఈ రంగులలో ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలది. ఊదారందు తక్కువ తరంగ దైర్ఘ్యం గలది. ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉండటం వల్ల చాలా దూరం నుండి స్పష్టంగా కనబడుతుంది. అందువల్ల రహదారుల ప్రక్కన సూచించే గుర్తులు గల బోర్డులు ఎరుపు రంగుతో వ్రాస్తారు.
రంగులు రెండు రకాలు అవి 1. ప్రాథమిక రంగులు 2. గౌణ రంగులు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను ప్రాథమిక రంగులు అంటారు. వీటిని సరియైన నిష్పత్తిలో కలిపినపుడు గౌణ రంగులు యేర్పడుతాయి. ఎరుపు, అకుపచ్చ కలిసినపుడు పసుపు పచ్చ, ఎరుపు, నీలం కలసినపుడు ముదురు ఎరుపు, నీలం, ఆకుపచ్చ కలిసినపుడు ముదురు నీలం అనే గౌన రంగులు యేర్పడుతాయి. ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను కలిపినట్లైతే దాదాపుగా తెలుపు రంగు యేర్పడుతుంది. (కాంతి రంగులు మాత్రమే, ఇతర రంగులు కాదు)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.