From Wikipedia, the free encyclopedia
100 మహిళలు అనేది బిబిసి విడుదల చేసే జాబితా. 2013లో మొదలైన ఈ సిరీస్ లో ప్రతీ సంవత్సరం అంతర్జాతీయంగా 100 మంది మహిళలను ఎంపిక చేసి, జాబితాగా వేస్తారు. ఈ సిరీస్ ద్వారా 21వ శతాబ్దంలో మహిళల పాత్ర తెలుస్తుంది. ప్రతీ ఏటా లండన్[1], మెక్సికో[2][3] నగరాల్లో బిబిసి ఈ విషయమై కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. బిబిసి జాబితాను ప్రచురించిన తరువాత మూడు వారాల సమయంలో మహిళల గురించి వార్తా కథనాలు, అంతర్జాల నివేదికలు, చర్చలు నిర్వహిస్తుంది.[4] ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈ లిస్టు గురించి ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తారు. అలాగే చర్చలు, ఇంటర్వ్యూలు చేసి లిస్టుపై అభిప్రాయాలు వెల్లడిస్తారు. అలా ఖరారు చేసిన జాబితాను బిబిసి ప్రచురిస్తారు. 2013లో మొదలైన ఈ జాబితా ప్రచురణ, 2016లో కూడా కొనసాగింది.[5]
100 Women | |
---|---|
స్థితి | Active |
ఫ్రీక్వెన్సీ | Annually |
క్రియాశీల సంవత్సరాలు | 4 |
ప్రారంభించినది | 22 అక్టోబరు 2013 |
ఇటీవలి | 22 నవంబరు 2016 |
వెబ్సైటు | |
100 Women |
2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం జరిగిన తరువాత బిబిసి కంట్రోలర్ లిలియేన్ లాండర్[6], బిబిసి ఎడిటర్ ఫియోనా క్రాక్[7], ఇతర పాత్రికేయులు కలసి ప్రస్తుత సమాజంలో మహిళల విజయాలు, సమస్యల గురించి ఒక సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నారు.[8] మహిళల గురించి మీడియాలో ఎక్కువగా కవరేజ్ కావడంలేదని వారు నిర్ధారించుకున్నారు. మార్చి 2013లో మహిళల గురించి, మహిళ నుంచి ఎక్కువ కథనాలు ప్రచురించాలని పెద్ద సంఖ్యలో మహిళా ప్రేక్షకులు బిబిసిని కోరారు.[9]
చిత్రం | పేరు | వృత్తి | సంవత్సరం |
---|---|---|---|
స్నేహా జవాలే | ఈ జాబితాలో నాలుగో భారతీయురాలు స్నేహా జవాలే, గృహహింస
బాధితురాలు సామాజిక కార్యకర్తగా మారింది. "గత 10 సంవత్సరాలుగా, కాలిన, యాసిడ్ దాడులలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి .[10] |
2022 | |
గీతాంజలి శ్రీ | హిందీ నవలా రచయిత్రి . ఆమె తన నవల ‘రెట్ సమాధి’ ఆంగ్ల అనువాదం ‘టోంబ్ ఆఫ్ ది శాండ్’కి అంతర్జాతీయ
బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి హిందీ రచయిత్రి. పుస్తకం యొక్క ఫ్రెంచ్ అనువాదం కూడా ఎమిలే గుయిమెట్ ప్రైజ్ కి పరిశీలిస్తున్నారు[10] |
2022 | |
శిరీష బండ్ల | చారిత్రాత్మక 2021 యూనిటీ 22 మిషన్లో భాగంగా శిరీష బండ్ల అంతరిక్షం అంచుకు వెళ్ళింది. ఆమె అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళా గా గుర్తింపబడింది.ఆమె అమెరికాలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివింది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ రీసెర్చ్ ఆపరేషన్స్ ఫర్ వర్జిన్ గెలాక్టిక్ (VG),[10] | 2022 | |
ప్రియాంక చోప్రా | బాలీ ఉడ్, హాలీ వుడ్ నటి. ప్రపంచ సుందరి. మిస్ వరల్డ్. మీ టూ ఉద్యమం లో భాగస్వామి. సొంత నిర్మాణ సంస్థ ఉంది. యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా కూడా ఉన్నారు, బాలల హక్కులు, బాలికల విద్య కోసం ప్రచారం చేస్తోంది.[10] | 2022 | |
మంజులా ప్రదీప్ | "నాట్ దట్ డిఫరెంట్" సంస్థ సహ వ్యవస్థాపకురాలు | 2021 | |
ముగ్ధ కల్రా | పౌరహక్కుల కార్యకర్త | 2021 | |
బిల్కిస్ దాదీ | పౌరసత్వ సవరణబిల్లు (2019)కి వ్యతిరేకంగా పోరాడిన వృద్ధురాలు | 2020 | |
మానసి జోషి | పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్ | 2020 | |
రిధిమా పాండే | వాతావరణ కార్యకర్త | 2020 | |
ఈశాయివాణి | గాయకురాలు | 2020 | |
ప్రవీణా అహంగర్ | మానవహక్కుల కార్యకర్త | 2019 | |
అరణ్య జోహార్ | కవయిత్రి | 2019 | |
సుస్మితా మొహంతీ | అంతరిక్ష నౌక డిజైనర్ | 2019 | |
శుభలక్ష్మి నంది | లైంగిక సమానత్వ ప్రచారకర్త | 2019 | |
నటాషా నోయల్ | బాడీ పాజిటివిటీ ఇన్ఫ్ల్యూయన్సర్ | 2019 | |
వందన శివ | సామాజిక కార్యకర్త | 2019 | |
ప్రగతి సింగ్ | అలైంగిక వ్యక్తుల సంస్థ ఇండియన్ ఏసెస్ నిర్వాహకురాలు | 2019 | |
రాహిబాయ్ సోమా పొపెరె | దేశవాళీ విత్తనబ్యాంకు స్థాపకురాలు, మహిళా రైతు | 2018 | |
విజి పలితోడి | కేరళలో మహిళా కార్మిక సంఘం వ్యవస్థాపకురాలు | 2018 | |
మీనా గాయెన్ | వ్యాపారవేత్త | 2018 | |
మిథాలి రాజ్ | క్రికెటర్ | 2017 | |
రూపి కౌర్ | రచయిత్రి | 2017 | |
విరాలి మోది | వికలాంగుల హక్కుల కార్యకర్త, యువ అంబాసిడర్ | 2017 | |
అదితి అవస్థి | పారిశ్రామికవేత్త, సి.ఇ.వో ఎమ్బైబ్ | 2017 | |
మెహరున్నీసా సిద్ధిఖి | గృహిణి | 2017 | |
సవితా దేవి | డోలు కళాకారిణి | 2017 | |
నిత్యా తుమ్మలచెట్టి | డైరెక్టర్ ఆఫ్ డైవర్సిటీ, ఫార్చునా పిక్స్ | 2017 | |
ప్రియాంకా రాయ్ | విద్యార్థిని | 2017 | |
తులికా కిరణ్ | ఉపాధ్యాయిని, సామాజిక కార్యకర్త | 2017 | |
ఊర్వశి సాహ్ని | వ్యవస్థాపకురాలు, సి.ఇ.వో స్టడీ హాల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ | 2017 | |
ఇరా త్రివేది | రచయిత్రి | 2017 | |
గౌరీ చిందర్కర్ | భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థి | 2016 | |
మల్లికా శ్రీనివాసన్ | భారతీయ ట్రాక్టర్ తయారీదారులు | 2016 | |
నేహాసింగ్ | భారతీయ సామాజిక కార్యకర్త | 2016 | |
సాలుమరద తిమ్మక్క | భారతీయ పర్యావరణ వేత్త | 2016 | |
ఆశా భోస్లే[11] | భారతీయ గాయకురాలు | 2015 | |
కామినీ కౌశల్[11] | భారతీయ బాలీవుడ్ నటి | 2015 | |
రింపి కుమారి[11] | భారతీయ రైతు | 2015 | |
సానియా మీర్జా[12] | భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి | 2015 | |
స్మృతి నాగ్పాల్[11] | భారతీయ వ్యాపారవేత్త | 2015 | |
ముంతాజ్ షేక్[11] | భారతీయ మానవ హక్కుల కార్యకర్త | 2015 | |
కానికా తేక్రీవాల్[11] | భారతీయ వ్యాపారవేత్త | 2015 | |
రుబీ చక్రవర్తి | భారతీయ మహిళా హక్కుల ప్రచారకురాలు | 2014 | |
అదితి మిట్టల్ | భారతీయ హ్యాస్యనటి | 2014 | |
దివ్యాశర్మ | భారతీయ విజ్ఞానశాస్త్ర విద్యార్థిని | 2014 | |
కవితా కృష్ణన్ | సెక్రటరీ,
ఆల్ ఇండియా ప్రొగ్రెస్సివ్ వుమెన్ అసోసియేషన్ |
2014 | |
ఇరియానా చక్రవర్తి | రష్యన్-ఫినిష్-భారతీయ ఇంజనీర్ | 2013 | |
అదితి మిట్టల్ | భారతీయ హాస్యనటి | 2013 | |
దివ్యాశర్మ | ఎలక్ట్రానిక్స్,కమ్యూనికేషన్స్ ఇంజనీరు | 2013 |
Seamless Wikipedia browsing. On steroids.