From Wikipedia, the free encyclopedia
డాక్టర్ పి.వేణుగోపాల్ (ఆంగ్లం: P. Venugopal) ప్రముఖ హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు.[1] 49 సంవత్సరాల సేవ తరువాత 3, జులై 2008న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ గా పదవీ విరమణ చేసారు. కేంద్ర ఆరోగ్యమంత్రి అంబుమణి రామదాసుతో అల్ ఇండియా మెడికల్ సైన్సెస్ నిర్వహణపరమైన విధానాలతో విభేదించి, కుట్ర పూరితమయిన చట్టం ద్వారా తొలగింపబడి తిరిగి సుప్రీం కోర్టు ద్వారా నియమింపబడి, సంస్థ లోని డాక్టర్లు, ఇతర సిబ్బంది,[2] పలువురు రాజకీయ నాయకులు, మీడియా వారి మద్దతు పొంది విజయం సాధించిన అరుదయిన వ్యక్తి.[3] భారతదేశములో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు. అనేక అంతర్జాతీయ హృద్రోగ సంస్థలకు సలహాదారుడిగా, సభ్యుడిగా ఉన్న వేణుగోపాల్ తెలుగుజాతికి గర్వకారణం.
ఈయన 1942 జూలై 7 న రాజమండ్రి లోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. వైద్యవిద్యలో 1959లో ఢిల్లీలో అడుగుపెట్టారు. రాజమండ్రికి చెందిన వీరు 1963లో ఎం.బి., బి.ఎస్. చదవడానికి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో చేరారు. 1967లో చండీఘర్ వైద్య విజ్ఞాన సంస్థలో శస్త్రచికిత్సలో ఎమ్.ఎస్. చేశారు. అందులో సర్వ ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు. ఎం.సి.హెచ్. పూర్తి చేసారు. 1970లో కార్డియాక్ సర్జరీలో స్పషలైజేషన్ పూర్తిచేసారు.అనంతరం కొంతకాలం అమెరికా వెళ్ళి ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు డెంటన్ కూలేతో కలసి పనిచేసరు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో 1971 లో చేరారు. 1972-74 మధ్య టెక్సాస్‌లో విశేష శిక్షణ పొందారు. వీరు 1992 నుండి కార్డియో థొరాసిక్ విభాగం అధిపతి. 1992 నుండి కార్డియోధారాసిక్ లో గాఢ అధ్యయనం, పరిశోధనలు నిర్వహించారు. అప్పటి నుండి అంచెలంచెలుగా ఎదిగి గుండె శస్త్రచికిత్స విభాగానికి అధిపతిగా చాలాకాలంగా పనిచేస్తున్నారు. ఇక్కడ సంవత్సరానికి మూడు వేల గుండె ఆపరేషన్లు నిర్వహించబడుతున్నాయి. మొదటి మూడు దశాబ్దాలలో 25 వేల ఓపెన్ హార్ట్ సర్జరీలు, 10 వేల క్లోజ్డ్ హార్ట్ సర్జరీలు చేశారు. ఇంచుమించు తొంభై మంది కార్డియో థొరాసిక్ సర్జన్లకు తర్ఫీదు ఇచ్చారు. 1997లో భారత రాష్ట్రపతికి గౌరవ హృద్రోగ నిపుణులుగా నియమించబడ్డారు. కొంతకాలం హాస్పిటల్ డీన్ గా పనిచేసిన వీరు ప్రస్తుతం ఈ వైద్యసంస్థకు డైరెక్టరుగా ఉన్నారు.[4]
వైద్యంలో ముఖ్యంగా హృద్రోగాల నిదానంలో ఈయన ఒక అసాధారణ నిపుణులు. మౌలిక ప్రతిభ ఉన్న పరిశోధకులు. మన దేశంలో మొట్టమొదటి గుండెమార్పిడి శస్త్రచికిత్స చేసింది ఈయనే. 1994 లో దేవీరాం (ఓక మోటార్ మెకానిక్) కు అరుదైన శస్త్రచికిత్స చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దేశంలో తొలిసారిగా ఈ అసాధారన వైద్య విజయాన్ని సాధించారు. ఆనాటి నుండి 50వేల మందికి పైగా హృద్రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.
1970లో ఎయిమ్స్ లో చేరినప్పటి నుండి ఏ ఆపరేషన్ థియేటర్ లో, ఏ టేబుల్ మీదనయితే వేలాది మంది హృద్రోగులకు ఈయన శస్త్ర చికిత్స చేసారో, అదే టేబుల్ మీద ఈయనకు కూడా బైపాస్ సర్జరీ జరిగింది. మన దేశంలో కూడా ఎంత అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానమున్నా, ఎందుకో తెలియని అభద్రతాభావంతో కొట్టుమిట్టాడేవారెందరో ఉన్న పరిస్థితులలో ఈయన విదేశాలకు వెళ్ళకుండా తన విద్యార్థి చేతనే శస్త్రచికిత్స చేయించుకున్నారు. తనను మామూలు రోగిగానే పరిగణించాలని చెబుతూ, కేవలం అయిదేళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ ఎ.కె.చిసోయిని టీమ్ నాయకుడిగా ఉంచి, రోజు తనతో కలసి ఆపరేషన్ లు నిర్వహించే వైద్య బృందంతోనే 2005, జనవరిలో చికిత్స చేయించుకున్నారు. ఇది జరిగిన పదో రోజున యథావిధిగా తమ విధులకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు, పన్నెండో రోజున ఈయన స్వయంగా ఒక శస్త్రచికిత్స కూడా చేసారు.
హృద్రోగాలకు "మూలకణాలు" చికిత్స ఈయన పరిశోధనా ప్రతిభ ఫలితమె. ఎముకల మజ్జలో (బోన్ మారో) మూలకణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ దృష్ట్యా వీటిని గుండెలోకి ఇంజక్ట్ చేసినప్పుడు అవి గుండె కందర కణాలుగా రూపొందుతాయి. శల్యమైన హృదయభాగాన్ని పునరుద్ధరిస్తాయి. ఈయన పరిశోధనా ఫలితాలు విజయవంతం కావడంతో ఎయిమ్స్ వైద్యులు సాంప్రదాయక చికిత్సతో పాటు స్టెమ్ సెల్ చికిత్సను కూడా వినియోగిస్తున్నారు. హృద్రోగాల చికిత్సలో ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణ క్రమంలో ఈ అధునాతన చికిత్సా విషయమై ఈయన పరిశోధనలు ప్రారంభించారు. మూలకణాల సేకరణకు తోద్పడడానికి ఎవరూ ముందుకు రాలేదు. మూలకణాలను అస్థి మజ్జి నుండి తీసుకుంటారు. బొడ్దు తాడులోని మూలకణాలను ఘనీభవింపచేసి, ఎవరికైనా 50 సంవత్సరాల పైబడిన వయస్సులో సేకే జన్యు సంబంధమైన వ్యాధులు నివారణకు ఉపయోగించుకోవచ్చు.
2003 ఫిబ్రవరి నుండి 2005 జనవరి వరకు ఈయన జరిపిన పరిశోధనలలో భాగంగా 35మంది హృద్రోగులకు మూలకణాల చికిత్స చేయడం జరిగింది. 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు వ్యవధిలో ఈ చికిత్స ఏ విధంగా పనిచేసిందీ నిశితంగా గమనించడం జరిగింది. ఈ చికిత్స చేయించుకున్న రోగులెవరూ మరణించలేదు. వారందరూ బైపాస్ సర్జరీ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరచలేని దశలో ఆస్పత్రిలో చేరినవారే
డా. వేణుగోపాల్ ప్రత్యేక పరిశోధనల వలన, ప్రోధ్బలంతో "ఎయిమ్స్"లో జాతీయ మూలకణాల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వెలువడింది. దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో ఈ చికిత్స విషయమై జరిగే పరిశోధనలకు సమన్వయ పరిచేలా ఈ కేంద్ర స్థాపన ఆవశ్యకతనౌ డా. వేణుగోపాల్ స్పష్టీకరించార్. స్టెం సెల్ చికిత్స చేయించుకున్నవారిలో ఆరునెలల్లో శల్యమైన హృదయ భాగంలో 56 శాతం మెరకు పరిస్థితి మెరుగయిందనీ, 18 నెలలలో అది 64 శాతానికి పెరిగిందని ఈయన తెలిపారు. చాలా మంది హృద్రోగులకు గుండె మార్పిడే ఏకైక పరిష్కార మార్గంగా ఉన్న దశలోనే నిపుణులను సంప్రదించడం జరుగుతుందని, స్టెమ్ సెల్ చికిత్సలో గుండె మార్పిడి చేయించుకోవలసిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశముందని ఈయన ప్రకటించారు.
హృద్రోగాలతో సంప్రదాయక వైద్య శస్త్రచికిత్సా పద్ధతులు సత్ఫలితాలు యివ్వవని మూలకణాల చికిత్స ద్వారానే గుండె కండరాల పరిస్థితి మెరుగుపడుతుందని ఈయన తెలిపారు. రాష్ట్రపతి కలాం ఢిల్లోలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఈ చికిత్సా పద్ధతి చాలా అధునాతమైందని, ప్రపంచంలో అతి కొద్దిమందికి మాత్రమే ఈ చికిత్స జరిగిందని, భారత్ లో ఇదే మొదటిసారని తెలుపుతూ, వివిధ హృద్రోగాలతో బాధ పడుతున్నవారికి స్టెం థెరపీ ఒక ఆశాదీపమని పేర్కొని, డా. వేణుగోపాల్ పరిశోధనలను ప్రస్తుతించారు.
ఎయిమ్స్ డైరక్టరు పదవిలో ఉన్న ఈయనను 2006 జూలై 6 వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తొలగించగా, ఈ దుశ్చర్యను ఎయిమ్స్ సిబ్బంది మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా భిన్న వర్గాలు తీవ్రంగా ఖండించాయి.[5] 2008 జూలై 2 వ తేదీన పదవీకాలం ముగియునున్న డా. వేణుగోపాల్ మిద పాలకవర్గం చేసిన దుందుడుకు చర్యను హైకోర్టు నిలిపివేసింది. మన రాష్ట్రంలో ఒకనాడు ముఖ్యమంత్రి చెన్నారెడ్ది అభాండాలు మోపి అవమానించడాంతో తీవ్ర మనస్తాపం చెందిన డా. కాకర్ల సుబ్బారావు "నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)" (హైదరాబాదు) సారథ్య బాధ్యతల నుండి తప్పుకోవలసి వచ్చిన దుర్గతి డా. వేణుగోపాల్ విషయంలో కూడా పునరావృతమైనది. ప్రజారోగ్య వ్యవస్థకు చేటుగా, సమాజానికి అరిష్తంగా జరిగిన ఈ అవమానం సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని మెధావి వర్గాలకు కించిత్ బాధ కలగక పోవడం ఆశ్చర్యం కలిగించలేక పోయింది.
పదవీవిరమణ చేసిన తదుపరి వేణుగోపాల్ హర్యానా రాష్ట్రంలోని గుర్గాన్ లో ఆల్కెమిస్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కార్డియాలజీ విభాగాధిపతిగా చేరారు.[6] ఆయన తన 55వ యేట వివాహం చేసుకున్నారు.[7] ఆయనకు ఒక కుమార్తె ఉన్నారు.[8]
ఎయిమ్స్ లో ఈయన అధ్వర్యంలో సంవత్సరానికి మూడువేల హార్ట్ సర్జరీలు, జరుగుతున్నాయి. 1970 నుండి 2000 వరకు మొత్తం 25వేల ఓపెన్ హార్ట్ సర్జరీలు, 10వేల క్లోజ్డ్ హార్డ్ సర్జరీలు జరిగాయి. 90మందికి కార్డియో థొరాసిక్ సర్జన్లకు శిక్షణ అందించిన ఘనత డాక్టర్ వేణుగోపాల్ కు దక్కుతుంది. రోజుకు 18 గంటలపాటు శ్రమిస్తాయి.
పుట్టపర్తిలోని సత్యసాయి వైద్య విజ్ఞాన కేంద్రం స్థాపనకు సలహాలందించారు. ఇక్కడ వందలాది గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించి అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు చేతుల మీదుగా స్వర్ణ కంకణాన్ని అందుకున్నారు. 1994లో తొలిసారిగా గుండెమార్పిడి శస్త్ర చికిత్స చేసేందుకు పట్టిన సమయం 102 నిముషాలు.
1994 ఆగస్టు 3 న భారత్ లో తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. అంతర్జాతీయ గుండెమార్పిది మ్యాప్ లో మనదేశం ప్రవేశించడానికి వేణుగోపాల్ ప్రధాన కారకుడు.[9] దశాబ్ద కాలంగా ఈ చికిత్సలో శిక్షణ పొంది, 1994 మే 5 వ తేదీన అవయమార్పిడి బిల్ కు పార్లమెంటులో ఆమోదం తెలిపేవరకు వేచిఉండి "ఎయిమ్స్"లో తొలి గుండెమార్పిడి విజయవంతంగా పూర్తిచేసారు.[10]
అకడమిక్ గుర్తింపులు
సామాజిక గుర్తింపులు
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.